పెళ్లి తర్వాత ప్రియమణి చేస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే!
నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ ప్రియమణి 2016లో వచ్చిన ప్రకాష్ రాజ్ మూవీ 'మనవూరి రామాయణం' తర్వాత ఏ తెలుగు సినిమా చేయలేదు. ముస్తఫారాజ్ వివాహం తర్వాత ఆమె పూర్తిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరం అయ్యారు.
తాజాగా సమాచారం ప్రకారం... ప్రియమణి త్వరలో ఓ థ్రిల్లర్ మూవీ ద్వారా టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వబోతుున్నట్లు సమాచారం. 'సిరివెన్నెల' అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తయిందని, మరో రెండు పాటల చిత్రీకరణ మిగిలి ఉందని తెలుస్తోంది.

'సిరివెన్నెల' చిత్రంలో కాలకేయ ప్రభాకర్ కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్. కొత్త దర్శకుడు ప్రకాష్ పులిజల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ బోహ్రా, ఏఎన్ భాష ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ప్రియమణి నటిస్తున్న ఇతర భాషా చిత్రాల విషయానికొస్తే.. కన్నడలో నాన్న ప్రకార, డాక్టర్ 56, తమిళంలో కుట్రపయిర్చి చిత్రాల్లో నటిస్తోంది. మరో వైపు 'ఆర్ఆర్ఆర్' మూవీలో ఆమె నటిస్తున్నట్లు వార్తలు సైతం ప్రచారంలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











