Priyamani పెళ్లి చెల్లదు.. భర్తపై మొదటి భార్య కేసు నమోదు..ఇబ్బందుల్లో వైవాహిక జీవితం!

దక్షిణాది ఇండస్ట్రీతోపాటు బాలీవుడ్‌లో రాణిస్తున్న ప్రియమణి వైవాహిక జీవితం ఇబ్బందుల్లో పడినట్టు కనిపిస్తున్నది. తన భర్త ముస్తాఫా మొదటి భార్య తాజాగా ఆరోపణలు చేయడంతో ప్రియమణి వైవాహిక హోదా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. జాతీయ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో ముస్తాఫా, ప్రియమణి పెళ్లి చెల్లదు అంటూ ఆయేషా కామెంట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆయేషా, ముస్తాఫా మధ్య చోటుచేసుకొన్న వివాదంలోకి వెళితే...

బాబోయ్ ఏంటా అందాలు: ఫిట్‌నెస్ మోడల్ అదితి మిస్త్రీ వైరల్ (ఫోటోలు)

ప్రియమణి భర్త మొదటి వివాహం గురించి

ప్రియమణి భర్త మొదటి వివాహం గురించి

ప్రియమణి భర్త ముస్తాఫా విషయానికి వస్తే... గతంలో ఆయేషాతో వివాహం జరిగింది. వారిద్దరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. ఆ తర్వాత విభేదాలు చోటుచేసుకోవడంతో వారు వేర్వేరుగా జీవించడం మొదలు పెట్టారు. అనంతరం 2017లో ప్రియమణిని ముస్తాఫా వివాహం చేసుకొన్నారు. అయితే వారిద్దరి పెళ్లి చట్టరీత్యా చెల్లదు అంటూ సంచలన ప్రకటన చేసింది.

Leaked Shocking Pictures of Indian Celebs Photos

ప్రియమణి భర్తపై మొదటి భార్య కేసు..

ప్రియమణి భర్తపై మొదటి భార్య కేసు..

తనకు విడాకులు ఇవ్వకుండా ప్రియమణిని ముస్తాఫా పెళ్లి చేసుకొన్నారు అంటూ ఆయేషా కోర్టులో క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ప్రియమణి, ముస్తాఫాను భాగం చేసింది. చట్టరీత్యా తనకు ముస్తాఫా విడాకులు ఇవ్వలేదు అని ఆమె తెలిపారు. అంతేకాకుండా ముస్తాఫాపై గృహ హింస చట్టం కేసు కూడా పెట్టింది. ప్రస్తుతం మేజిస్ట్రేట్ కోర్టులో ఈ ఫిర్యాదులపై విచారణ జరుగుతున్నది.

Photos: Actress Caught Smoking On & Off Screen

నాపై అసత్య ఆరోపణలు అంటూ

నాపై అసత్య ఆరోపణలు అంటూ

భార్య ఆయేషా దాఖలు చేసిన కేసులపై ముస్తాఫా స్పందించారు. ఈటీటైమ్స్‌ ఇంటర్వ్యూ ప్రకారం... మేమిద్దరం 2010 నుంచి వేర్వేరుగా ఉంటున్నాం. 2013లో విడాకులు తీసుకొన్నాం. ఆ తర్వాతనే 2017లో ప్రియమణితో వివాహం జరిగింది. కానీ ఇప్పుడు మళ్లీ మేము విడాకులు తీసుకోలేదని చెప్పడం అవాస్తవం అని ముస్తాఫా పేర్కొన్నారు.

డబ్బు గుంజేందుకు నా మొదటి భార్య ప్రయత్నాలు

డబ్బు గుంజేందుకు నా మొదటి భార్య ప్రయత్నాలు

నా మొదటి భార్య నాపై పెట్టిన కేసులు అన్నీ తప్పుడు కేసులే. నా పిల్లలకు, ఆమెకు నేను ప్రతీ నెల భరణం చెల్లిస్తున్నాను. అయినా నా నుంచి డబ్బు గుంజేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రియమణితో నా పెళ్లి 2017లో జరిగింది. ఆ విషయం తెలిసి కూడా ఎందుకు ఇన్ని రోజులు ఆగింది అంటూ ఆయేషా తీరును ముస్తాఫా ప్రశ్నించాడు.

Recommended Video

Actress Priyamani Exclusive Interview About Narappa Movie | Part 2 | Filmibeat Telugu
నా భర్తతో సామరస్యంగా

నా భర్తతో సామరస్యంగా

ముస్తాఫా చేసిన వాదనపై ఆయేషా స్పందిస్తూ.. నేను ఇద్దరు పిల్లల తల్లిని. నేను నిస్సహాయతతో పోరాటం చేస్తున్నాను. నేను ఏమీ చెప్పలేకపోతున్నాను. ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు ప్రయత్నిస్తున్నాను. అందుకే ఇంత సమయం తీసుకొన్నాను. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇలా స్పందించాల్సి వస్తున్నది అని ఆయేషా అన్నారు.

ప్రియమణి కెరీర్ ఇలా..

ప్రియమణి కెరీర్ ఇలా..

ప్రియమణి కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో ది ఫ్యామిలీ మ్యాన్ 2, నారప్ప చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆమె నటించిన విరాటపర్వం చిత్రం రిలీజ్‌కు సిద్దంగా ఉంది. బాలీవుడ్‌లో మైదాన్, సైనేట్, డాక్టర్ 56, కొటేషన్ గ్యాంగ్, ఖైమారా చిత్రాల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X