కీర్తి సురేష్ బుక్కయ్యింది.. ప్రియాంక హిట్టయ్యింది.. పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
మన తెలుగు సినిమా దగ్గర తెలుగు నుంచి వచ్చే ఆర్టిస్టులలో హీరోలు, కమెడియన్స్ ని పక్కన పెడితే హీరోయిన్ నుంచి విలన్స్ వరకు కూడా ఇతర భాషల నుంచి వచ్చినవారు అంటేనే దర్శక నిర్మాతలు ఎక్కువ మక్కువ చూపుతారని ఒక టాక్ ఎప్పుడు నుంచో ఉంది. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే మన తెలుగు హీరోయిన్స్ కి అవకాశాలు తక్కువే కానీ తమిళ్, మలయాళ ముద్దుగుమ్మలకు మన దగ్గర మంచి డిమాండ్ ఉంది.
టాలీవుడ్ యువత కూడా వారికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు కాబట్టి దర్శకులు కూడా అదే పాట పాడుతున్నారు. కాగా తమిళ్ సినిమా నుంచి తెలుగులో హిట్ అయ్యిన హీరోయిన్స్ కొందరు ఉన్నారు. మరి వారిలో ఆల్రెడీ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ నిలిచిన కీర్తి సురేష్ కూడా ఒకామె.. కానీ ఇప్పుడు కీర్తి సురేష్ టైం అంతగా బాగోలేదు. ఆమె నటించిన సినిమా ప్లాప్స్ అవుతూ వస్తున్నాయి.
ఈ క్రమం లోనే ఆమె చేసిన స్టేట్మెంట్ ఒకటి అది కూడా మెగాస్టార్ చిరంజీవి విషయంలో కొన్ని రోజులు కాంట్రవర్సీకి దారి తీసింది. మెగాస్టార్ చిరంజీవి కంటే దళపతి విజయ్ నే డాన్సింగ్ లో కానీ నటనలో కానీ ఉంటాడు అని కామెంట్స్ చేసి నవ్వుల పాలైంది. ఈ కామెంట్స్ చేసిన తర్వాత విజయ్ నటిస్తున్న గోట్ సినిమా నుంచి వచ్చిన సాంగ్ అందులో విజయ్ డాన్స్ దారుణంగా ట్రోల్ కి గురయ్యాయి.

ఇక ఇదిలా ఉంటే ఇదే విజయ్, కీర్తి సురేష్ విషయంలోనే వారి తమిళ్ కి చెందిన బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తమిళ్ ఆడియెన్స్ తో మన తెలుగు ఆడియెన్స్ కి వచ్చే చిక్కు ఒకటి ఉంది. రియాలిటీలో వారి సినిమా కంటే మన సినిమా బాగుటుంది. మన దగ్గర సినిమా అక్కడ రీమేక్ అయినా కానీ వారి సినిమాని మనం రీమేక్ చేసినా కానీ తెలుగులో చాలా బెటర్ గా చేస్తారు.
అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు ఎస్ జె సూర్య కాంబినేషన్ లో వచ్చిన "ఖుషి" తమిళ్ ఖుషి కి చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ స్టైలింగ్ గాని డైలాగ్ డెలివరీ కానీ తన యాక్షన్ టేకింగ్ సెపరేట్ అని తమిళ్ లో హిట్ అయితే తెలుగులో ఖుషి సూపర్ డూపర్ హిట్ అని స్వయంగా రెండు భాషల్లో తెరకెక్కించిన ఎస్ జే సూర్యనే చెప్పాడు. దీనికి కారణం పవన్ కళ్యాణ్ అని కూడా చెప్పాడు.

మరి దీనిపైనే బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియాంక మాట్లాడుతూ ఈసారి ఖుషి 2 చేస్తే డెఫినెట్ గా ఒక్క పవన్ కళ్యాణ్ గారితో మాత్రమే చెయ్యాలి అని డిమాండ్ చేసింది. పాపం తమ తమిళ్ హీరో విజయ్ ని పక్కన పెట్టి మరీ ఈ స్టేట్మెంట్ అంటే పవర్ స్టార్ క్రియేట్ చేసిన మార్క్ ఎలాంటిదో మనం అర్ధం చేసుకోవచ్చు. అందుకే రియాలిటీలో కీర్తి సురేష్ లాంటి విజయ్ అభిమానులు ఉంటే బాగుంటుంది అని చెప్పాలి.
కీర్తి అలా అన్నయ్య విషయంలో బుక్కయ్యిపోతే అదే విజయ్ విషయంలో "ఓజి" బ్యూటీ ఇలా కామెంట్స్ చేయడంతో అటు విజయ్ ఫ్యాన్స్ కి కీర్తి సురేష్ కూడా కౌంటర్ పడ్డట్టు అయ్యింది. కాగా ఇప్పుడు ప్రియాంక పవర్ స్టార్ తో భారీ చిత్రం "ఓజి" లో హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. తమ ఇద్దరి మధ్య సీన్స్ ఇంకా చేయాల్సి ఉంది అని అవి తొందరలోనే స్టార్ట్ చేస్తామని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో వీరి కలయిక కోసం అభిమానులు చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











