చెత్త లుక్! ప్రియాంక చోప్రా ధరించిన ఆ గౌను ఖరీదు తెలిస్తే షాకే..

Recommended Video

You Won’t Believe How Much Priyanka Chopra’s Met Gala 2019 Attire Costs || Filmibeat Telugu

న్యూయార్కులో జరుగుతున్న 'మెట్ గాలా 2019' వేడుకలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా సందడి చేసిన సంగతి తెలిసిందే. 36 ఏళ్ల ఈ సందరి డియోర్ సిల్వర్ గౌను, జిమ్మీ చూ హీల్స్ ధరించి ఈ వేడుకకు హాజరయ్యారు. ఆమె హెయిర్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

తనకోసమే ప్రత్యేకంగా డిజైన చేసిన డ్రెస్సులో ప్రియాంక చోప్రా అభిమానులు ఎన్నడూ చూడని ఒక విభిన్నమైన, వింత లుక్‌లో దర్శనిమిచ్చారు. తాజాగా ఆమె ధరించిన గౌను, ఆ దుస్తులకు మ్యాచ్ అయ్యే విధంగా ధరించిన నగల కోసం ఎంత ఖర్చు పెట్టారనే విషయాలు బయటకు వచ్చాయి.

వోగ్ మేగజైన్ కథనం ప్రకారం... ప్రియాంక ధరించిన డియోర్ సిల్వర్ గౌను కోసం రూ. 45 లక్షలు ఖర్చు పెట్టారట. అంతే కాదు ఈ గౌను డిజైన్ చేసి రూపొందించడానికి 1500 గంటల సమయం తీసుకున్నారట. ఈ విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Priyanka Chopra 2019 Met Gala dress cost Rs. 45 lakh

ఈ గౌను ధరించడంతో పాటు 100 కేరెట్లకు పైగా నగలు ధరించారు. ఆమె ధరించిన సిల్వర్ హీల్స్ ఖరీదు రూ. 24,030. దీంత పాటు రూ. 4.51 లక్షల ఖరీదు చేసే ఇయర్ రింగ్స్ ధరించారు. ఇలా డ్రెస్సుకు, నగలకు కలిపి లక్షలు ఖర్చు పెట్టారు.

ప్రియాంక డ్రెస్సు ఒకే కానీ....మేకప్, హెయిర్ స్టైల్ కారణంగా విమర్శల పాలైంది. ఆమె చింపిరి జుట్టుతో కనిపించడంతో చాలా మంది ట్విట్టర్లో ట్రోల్స్ చేయడం ప్రారంభిచారు. భిన్నత్వం చాటుకోవాలని ఆరాట పడిన ఆమె చివరకు విమర్శల పాలైంది.

ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీలు న్యూయార్కులో జరుగుతున్న 'మెట్ గాలా 2019' వేడుకలో సందడి చేస్తున్నారు. ఇక్కడి మెట్రోపాలిటన్ మ్యూజియంలో ఈ వేడుక సోమవారం(మే 6) అట్టహాసంగా ప్రారంభం అయింది. హాలీవుడ్ తారలతో పాటు అమెరికన్ పాప్ స్టార్లు, వివిధ దేశాల నుంచి సినీ తారలు ఈ వేడుకలో సందడి చేస్తున్నారు. ఇండియా నుంచి ప్రియాంక చోప్రా, దీపిక పదుకోన్ హాజరయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X