హాలీవుడ్ దిగ్గజాల సరసన ప్రియాంక చోప్రా.. శక్తిమంతమైన మహిళగా
నిక్ జోన్స్‌తో పెళ్లి తర్వాత ప్రియాంక చోప్రా జోష్ మరింత పెరిగింది. భర్తతో కలిసి నటించిన మ్యూజిక్ ఆల్బమ్ 'సకర్' ప్రపంచ మ్యూజిక్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చింది. తాజాగా యూఎస్ఏ టుడే రూపొందించిన 50 మంది శక్తిమంతమైన మహిళల జాబితాలో ప్రియాంక చోప్రాకు చోటుదక్కింది.
ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల్లో ప్రభావవంతమైన పాత్రను పోషిస్తున్న 50 మంది శక్తిమంతమైన జాబితాలో మెరిల్ స్ట్రీప్, ఓప్రా విన్ ఫ్రే, గాయని బెయాన్స్, జెన్నిఫర్ లారెన్స్, నికోల్ కిడ్మన్, రీసీ విథర్‌స్పూన్ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా ప్రియాంక సన్నిహిత వర్గాలు మీడియాతో మాట్లాడుతూ.. నిక్ జోనస్‌తో ప్రియాంక కలిసి రూపొందించిన సకర్ వీడియో బిల్‌బోర్డు హాట్ 100 ఛార్ట్‌లో టాప్ స్థానంలో నిలిచింది. నిక్‌తో పెళ్లి తర్వాత ప్రియాంక కెరీర్ జోరందుకున్నది అని అన్నారు.
యూఎస్ఏ టుడే జాబితాతోపాటు ప్రియాంక ఫోర్బ్స్ 100 జాబితాలో, వెరైటీ 500 శక్తిమంతులైన మహిళల జాబితాలో చోటుదక్కించుకోవడం విశేషం.


Click it and Unblock the Notifications











