అప్పుడు మా అమ్మే లేకుంటే ఏమై పోయేదాన్నో.. బాలీవుడ్ నిర్మాతలు, హీరోలపై ప్రియాంక చోప్రా ఫైర్
బాలీవుడ్, హాలీవుడ్ తార ప్రియాంక చోప్రాకు చెందిన ఆత్మకథ అన్‌ఫినీష్‌డ్ పాఠకులనే కాకుండా, సోషల్ మీడియా యూజర్ల హృదయాలను ఆకట్టుకొంటున్నది. ఈ పుస్తకంలో తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను వెల్లడిస్తూ సెన్సేషన్‌ను క్రియేట్ చేస్తున్నది. ఈ సందర్బంగా బాలీవుడ్‌లోని నిర్మాతలు, హీరోల ప్రవర్తనపై ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ప్రియాంక చోప్రా వెల్లడించిన ప్రకారం..

బాలీవుడ్ నిర్మాత తీరు
బాలీవుడ్‌లో నిర్మాతలు వ్యవహార తీరు చాలా విచిత్రంగా ఉంటుంది. హీరోయిన్ల అంటే వారికి చిన్నచూపు. వారి దృష్టంతా హీరోలపైనే. వారి కోసమే పాకులాడుతుంటారు. హీరోలు ఎలా ప్రవర్తించిన వారికి అణిగిమణిగి ఉంటారు అని ప్రియాంక చోప్రా తన పుస్తకంలో పేర్కొన్నారు.

హీరోల కోసం పడిగాపులు
ఇక తాను సినిమా షూటింగుకు నిర్మాతలు చెప్పిన ప్రకారమే వెళ్లి సెట్లో కూర్చొనే దానిని. కానీ సినిమా యూనిట్ అంతా హీరో కోసం పడిగాపులు పడుతూ వెయిట్ చేసే వారు. ఒక్కోరోజు రోజంతా హీరో కోసం వెయిట్ చేస్తూ విసిగిపోయే వాళ్లం అని ప్రియాంక చెప్పారు.

ఉదయం షూటింగ్ అయితే హీరోలు సాయంత్రానికి
నా కెరీర్ ఆరంభంలో హీరోల కోసం వెయిట్ చేసే విషయాలు, నిర్మాతల తీరు నాకు గొప్ప అనుభవం, జీవిత పాఠంగా మారాయి. హిందీ పరిశ్రమలో పురుషాధిక్యతను కళ్లారా చూశాను. ఒక్కో రోజు 9 గంటలకు నేను సెట్లో ఉంటే హీరో సాయంత్రం 4.30 గంటల వరకు కూడా వచ్చే వారు కాదు. అంత సేపు వెయిట్ చేస్తూనే ఉండే వాళ్లం. నిర్మాతలు, దర్శకులు మాట కూడా మాట్లాడేవారు అంటూ ప్రియాంక చోప్రా అసలు విషయాన్ని బయటపెట్టారు.

ఎన్నోసార్లు నిలదీయాలని ప్రయత్నించా
ఇలాంటి వ్యవహారాలతో విసిగిపోయి ఎన్నోసార్లు నేను నిలదీయాలని అనుకొన్నాను. కానీ నా తల్లి అడ్డుపడ్డారు. ఓ సినిమాకు కమిట్ అయినప్పుడు.. వారితో చేసుకొన్న అగ్రిమెంట్ ప్రకారం సినిమాను పూర్తి చేయాలి. ఒకవేళ నీకు ఇలాంటివి నచ్చకపోతే కాంట్రాక్టు చేసుకోవడం ఆపివేయాలని నా తల్లి నాకు నచ్చ చెప్పేది అని ప్రియాంక చోప్రా వెల్లడించారు.

కమిటెడ్‌గా ఉండాలని అనుకొన్నా
సినిమాలు చేస్తున్న కొద్ది నాకు చాలా విషయాలు అర్ధమయ్యాయి. నీవు నటిస్తున్నావా? లేక మరొకరి కోసం సెట్లో వెయిట్ చేస్తున్నావా అనేది విషయం కాదు. నీకు నిర్మాత డబ్బులు చెల్లిస్తున్నాడు కాబట్టి నీవు వెయిట్ చేసినా తప్పులేదు. నీవు ఒప్పుకొన్న ప్రకారం కమిటెడ్‌గా ఉండాలనే విషయాన్ని గ్రహించాను అని ప్రియాంక చోప్రా తన పుస్తకంలో తెలిపారు.


Click it and Unblock the Notifications











