‘91 రోజుల్లో ది ఒడిస్సీ ఫినిష్.. 14 నెలలుగా వారణాసి’
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకొన్న ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో సినిమాల్లో తనదైన ఇమేజ్ సంపాదించుకొని గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. కొన్నేళ్లుగా బాలీవుడ్ సినిమాలకు, ఇండియన్ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆమె.. తాజాగా పాన్ ఇండియా సినిమాగా దర్వక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న వారణాసి చిత్రంలో మహేష్ బాబుతో కలిసి నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కావడానికి ముస్తాబవుతున్నది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకొంటున్నది. ఈ సినిమా షూటింగులో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్‌తో కలిసి పాడ్ కాస్ట్‌లో పలు విషయాలను పంచుకొన్నది. ఆమె తన ఇంటర్వ్యూలో వారణాసి గురించిన వివరాలను వెల్లడించి హైప్ పెంచారు. ఆమె చెప్పిన వివరాల్లోకి వెళితే..
రాజమౌళి రూపొందించిన RRR సినిమా గ్లోబల్‌గా ట్రెండ్ అయింది. హాలీవుడ్‌లో చాలా మంది ఆ సినిమాను చూసి ప్రశంసలు గుప్పించారు. నా కంటే ముందుగా నా భరత్ జోనస్ చూసి నాకు ఆ మూవీ గురించి చెప్పారు. ఆ సినిమా తీసిన విధానం హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్‌ను ఆకట్టుకొన్నది అని ప్రియాంక చెప్పారు.

వారణాసి చిత్రంలో నటించడం అమేజింగ్. ఈ సినిమాను గ్లోబల్ స్థాయిలో సంచలనం క్రియేట్ చేసేలా రాజమౌళి భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఎక్కువ సమయం తీసుకొంటున్నారు. గత 14 నెలలుగా ఈ సినిమా కోసం పనిచేస్తున్నాం. ఈ సినిమాలో నేను చాలా యాక్షన్ సీన్లలో నటించాను. నాకు ఇష్టమైన స్లో మోషన్ సీన్లలో నటించాను. అలా నటించడం నాకు గొప్ప అనుభూతి అని ప్రియాంక చోప్రా చెప్పారు.
వరల్డ్ సినిమాలో రాజమౌళి మాస్టర్ ఫిల్మ్ మేకర్. ఆయన పనితీరు, ఆయన విజన్ చూస్తే గ్రేట్‌గా ఉంటుంది. ఆయనతో పనిచేయడం అద్బుతంగా ఉంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్ కోసం నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా గొప్పగా ఉంటుందని మాత్రం చెప్పగలను అని ఆమె అన్నారు.
ఇక క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వంలో రూపొందిన ధి ఓడిస్సీ గురించి వెయింటింగ్ చేస్తున్నాను. ఈ సినిమాను ఆయన కేవలం 91 రోజుల్లోనే రూపొందించారు. ఇప్పటికే ఈ సినిమా గురించి భారీ అంచనాలు ఉన్నాయి అని ప్రియాంక చోప్రా తెలిపారు.
హాలీవుడ్‌లో ఇటీవల కాలంలో సిటాడెల్, ది బ్లఫ్ సినిమాల్లో నటించింది. నటిగా ఆమెకు మంచి పేరు సంపాదించుకొన్నది. క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డుల్లో ఉత్తమ నటిగా ఆమె నామినేట్ అయ్యారు. ప్రస్తుతం నా దృష్టి అంతా వారణాసిపైనే ఉంది అని ఆమె తెలిపారు.


Click it and Unblock the Notifications