Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- News రేవంత్‌కు అందుకే నాపై కక్ష: కాళేశ్వరం, కవిత అరెస్టుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పెన్ను పట్టిన పీసీ ... అప్పుడే బెస్ట్ సెల్లర్ అట.!
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా గురించి తెలియని వారు ఎవరు ఉండరు. హాలీవుడ్ పాప్ సింగర్ నిక్క్ జోనస్ ను వివాహం చేసుకొని అక్కడికి షిఫ్ట్ అయిపోయిన సీపీ ఈ మధ్య కాస్త స్పీడ్ తగ్గించింది. కరోనా సమయంలో తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది . ఎంతో మందికి అభిమాన నటిగా, ఆరాధ్య దేవతగా మారిన ప్రియాంక, బాలీవుడ్ లో సుస్థిరమైన స్థానాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ అందాల తార దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న "అన్ఫినిష్డ్" పుస్తకాన్ని రిలీజ్ చేయనుంది. ఇందుకు సంబందించిన ఫస్ట్ లుక్ ను ప్రియాంకా తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.
గ్లోబల్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రియాంకచోప్రా తన జీవితానుభవాలు, జ్ఞాపకాల్ని అక్షరీకరిస్తూ 'అన్ఫినిష్డ్' పేరుతో ఓ పుస్తకాన్ని రాసింది. అమెరికాకు చెందిన ప్రముఖ ప్రచురణ సంస్థ మార్కెట్లోకి విడుదల చేయబోతున్నది. బాలీవుడ్ లో అలాగే హాలీవుడ్లో తన కెరీర్‌ను నావిగేట్ చేసేటప్పుడు ఆమె ఎదుర్కొన్న సవాళ్ళ గురించి ఇందులో వివరించనున్నారు. ", మీరు చూడని వాటి 'మధ్యలో' నేను ఎలా అయ్యాను అనే దాని గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు ఓ పబ్లిక్ పర్సనాలిటీగా నా జీవితంలోకి చూస్తే ఇప్పుడు నా జీవితం ఉన్న స్థితి, సాధించిన విజయాలు నన్ను గర్వపడేలా చేశాయి.
'నీ కథ ముగింపు చెప్పడానికి ఎప్పడూ ప్రయత్నించకు...' ఇదే నేను మీకు చెప్పేది. ఎందుకంటే జీవితం నేర్పే గొప్ప పాఠాలు ప్రయాణం సాగుతున్నప్పుడు తెలుసుకుంటాం....''అని రాసుకొచ్చింది ప్రియాంక" జ్ఞాపకం రాయడం గురించి ఉన్న తమాషా ఏమిటంటే, మీ మైండ్ విషయాలను భిన్నంగా చూడమని బలవంతం చేస్తుంది, మీరు పడుకున్నారని మీరు అనుకున్నా చాలా విషయాలను తిరిగి గుర్తు చేసుకోండి .అలా చేయడం వల్ల "అన్ ఫినిష్డ్ " గా నాలో లోతైన అర్ధం దాగి ఉందని నేను గ్రహించాను. అని చెప్పుకొచ్చింది. ధైర్యంగా ఉండటాన్ని నా తల్లిదండ్రులు చిన్న వయస్సులోనే నాకు నేర్పించారు . నేను దీని గురించి ఎప్పుడూ సందిగ్ధంగా లేను. సవాలు కోసం, నిరంతరం అభివృద్ధి చెందడానికి అలాగే ముందుకు సాగడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను" అని చెప్పుకొచ్చింది.