పబ్లిక్‌లోనే భర్తతో ప్రియాంక చోప్రా లిప్‌లాక్: ముద్దు పెట్టిన వెంటనే ఆ పని చేయడంతో షాక్

ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటన.. అన్నింటికీ మించిన గ్లామర్ ట్రీట్‌తో దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇండియాలోనే స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా. సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించడమే కాదు.. తనకంటూ ఒక మార్కును సెట్ చేసుకుందామె.

అలాగే, హాలీవుడ్‌లోకి కూడా ప్రవేశించి గ్లోబల్ బ్యూటీగా పేరొందింది. ఇక, కొన్నేళ్ల క్రితమే ప్రియాంక.. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి తరచూ అతడితో తెగ ఎంజాయ్ చేస్తూ హైలైట్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రియాంక చోప్రా.. తన భర్తతో రొమాన్స్ చేస్తూ దిగిన వీడియో వదిలింది. దానిపై మీరూ లుక్కేయండి!

మిస్ వరల్డ్.. స్టార్ హీరోయిన్‌గా

మిస్ వరల్డ్.. స్టార్ హీరోయిన్‌గా

టీనేజ్‌లోనే ప్రియాంక చోప్రా మోడల్‌గా తన కెరీర్‌ను ఆరంభించింది. ఈ క్రమంలోనే 2000లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. తద్వారా ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ అమ్మడు సినిమాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఈ అమ్మడు ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తూ.. స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

హాలీవుడ్‌ ఎంట్రీ.. లవ్ ట్రాక్‌తో

హాలీవుడ్‌ ఎంట్రీ.. లవ్ ట్రాక్‌తో

బాలీవుడ్‌తో పాటు ఎన్నో భాషల్లో నటించిన ప్రియాంక చోప్రా.. కొన్నేళ్ల క్రితమే హాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టింది. అక్కడ ఈ భామ పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని ఆంగ్ల చిత్రాలు, ప్రైవేట్ ఆల్బమ్‌లను కూడా చేసింది. తద్వారా గ్లోబల్ స్టార్ అయింది. అదే సమయంలోనే ప్రియాంక చోప్రా.. తన కంటే చిన్నోడైన అయిన అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌తో ప్రేమలో పడిపోయింది.

నిక్‌ను పెళ్లాడిన తర్వాత ఇలా

నిక్‌ను పెళ్లాడిన తర్వాత ఇలా

ప్రియాంక చోప్రా.. నిక్ జోనస్‌తో చాలా కాలం పాటు డేటింగ్ చేసిన తర్వాత 2018 డిసెంబర్‌లో అతడిని పెళ్లి చేసుకుంది. వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చారు. వివాహం తర్వాత ప్రియాంక పూర్తిగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఫారెన్ కల్చర్‌ను అలవాటు చేసుకున్న ఈ భామ.. నిత్యం ట్రోల్స్‌ను కూడా ఎదుర్కొంటోంది.

 విడాకులు.. పుకార్లకు పుల్‌స్టాప్

విడాకులు.. పుకార్లకు పుల్‌స్టాప్

చాలా కాలంగా అన్యోన్యంగా ఉంటోన్న ప్రియాంక, నిక్.. విడాకులు తీసుకోబోతున్నారన్న వార్త ఒకటి ఆ మధ్య ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. దీనికి కారణం ప్రియాంక.. తన సోషల్ మీడియా ఖాతాల్లో నిక్ పేరును తొలగించడమే. ఈ వార్తలు వైరల్ అవడంతో స్వయంగా ఈ బ్యూటీనే స్పందించింది. విడాకులు తీసుకోవట్లేదని తెలుపుతూ భర్తతో దిగిన పిక్స్‌ను వదిలింది.

అందులో మాత్రం ఫుల్ బిజీగా

అందులో మాత్రం ఫుల్ బిజీగా

ప్రియాంక చోప్రా ఆ మధ్య వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నా.. ఈ మధ్య అవకాశాలు లేక ఖాళీగా ఉన్నా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ మరింత క్రేజ్ దక్కించుకుంటోంది.

పబ్లిక్‌లో భర్తతో ప్రియాంక కిస్

పబ్లిక్‌లో భర్తతో ప్రియాంక కిస్

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రియాంక చోప్రా.. తరచూ తన భర్తతో చేసిన రొమాన్స్ తాలూకు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ సీనియర్ హీరోయిన్ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు తన భర్త నిక్ జోనస్‌ అడగ్గానే లిప్ కిస్ చేసింది. దీంతో ఇది తక్కవు టైంలోనే వైరల్ అవుతోంది.

ముద్దు తర్వాత షాకిచ్చిన నిక్

ముద్దు తర్వాత షాకిచ్చిన నిక్

హోలీ పండుగ సంబరాల్లో భాగంగా నిక్ జోనస్‌ ముఖం మొత్తం రంగులతో నిండిపోయింది. అలానే వచ్చి ప్రియాంకను ముద్దు పెట్టమని అడిగిన అతడు.. లిప్‌లాక్ అయిన వెంటనే ఆమెకు కూడా రంగులు పూశాడు. ఇక, ప్రియాంక కూడా తన భర్త ముఖాన్ని తన ముఖంతో రాసుకుంటూ రంగులు అంటించుకుంది. ఆ సమయంలో వీళ్ల పక్కన చాలా మంది ఉన్నా పట్టించుకోలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X