బీచ్‌లో నిక్‌తో ప్రియాంక చోప్రా రొమాన్స్: వాళ్ల బట్టలు, ఫోజులు చూశారంటే!
ప్రియాంక చోప్రా.. ఈ పేరుకు అస్సలు పరిచయం అవసరం లేదు. అంతలా ఈ సుందరాంగి దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇండియన్ సినిమాపై తన ప్రభావాన్ని చూపించింది. అందానికి అందం.. నటనకు నటన కనబరుస్తూ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇలా బాలీవుడ్‌తో పాటు చాలా భాషల్లో సినిమాలు చేసి అలరించింది. ఈ క్రమంలోనే హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి గ్లోబల్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఇక, అక్కడే అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌తో ప్రేమలో పడి అతడిని పెళ్లాడింది. అప్పటి నుంచి భర్తతో కలిసి ఈ స్టార్ హీరోయిన్ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా నిక్‌తో రొమాన్స్ చేస్తూ తీసుకున్న ఓ ఫొటోను ప్రియాంక చోప్రా షేర్ చేసింది. ఆ పిక్‌పై మీరూ లుక్కేయండి!

ప్రపంచాన్ని గెలిచి.. మూవీల్లోకి
ప్రియాంక చోప్రా చిన్న వయసులోనే మోడల్‌గా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలోనే 2000లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. తద్వారా ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకుంది. తర్వాత ఈ అమ్మడు సినిమాల్లోకి సైతం ఎంటరైంది. అలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగింది. అప్పటి నుంచి ఇరవై ఏళ్ల పాటు హవాను చూపిస్తూనే వచ్చింది.

హాలీవుడ్‌కి వెళ్లి... ప్రేమలో పడి
ఇండియాలోని చాలా భాషల్లో సినిమాలు చేసిన ప్రియాంక చోప్రా.. కొన్నేళ్ల క్రితమే హాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఈ భామ పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని ఆంగ్ల చిత్రాలు, ప్రైవేట్ ఆల్బమ్‌లలో కూడా నటించింది. తద్వారా గ్లోబల్ స్టార్ అనిపించుకుంది. అదే సమయంలోనే ప్రియాంక.. తన కంటే చిన్నోడైన అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌తో ప్రేమలో పడింది.

నిక్ జోనస్‌ను పెళ్లాడిన బ్యూటీ
చాలా కాలం పాటు డేటింగ్ చేసిన తర్వాత ప్రియాంక చోప్రా.. నిక్ జోనస్‌ను 2018 డిసెంబర్‌లో వివాహం చేసుకుంది. వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చారు. పెళ్లి తర్వాత ప్రియాంక వ్యవహార శైలిలో పూర్తిగా మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే ఫారెన్ కల్చర్‌ను అలవాటు చేసుకున్న ఈ భామ.. విమర్శలను ఎదుర్కొంటోంది.

విడాకుల వార్తలు... తల్లైన పీసీ
ప్రియాంక, నిక్.. విడాకులు తీసుకోబోతున్నారన్న వార్త ఒకటి ఆ మధ్య ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. దీనికి కారణం పీసీ.. తన సోషల్ మీడియా ఖాతాల్లో నిక్ పేరును తొలగించడమే. ఆ తర్వాత ఈ జంట ఆ వార్తలను ఖండించింది. ఇక, ఇటీవలే సరోగసి ద్వారా ప్రియాంక.. నిక్ దంపతులు ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వాళ్లు వెల్లడించారు.

సోషల్ మీడియాలో రచ్చ చేసి
ఆ మధ్య వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నా.. ఈ మధ్య కొంత గ్యాప్ తీసుకుంటూ ఫ్యామిలీతో ఉంటోన్నా ప్రియాంక చోప్రా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది.

భర్తతో రొమాన్స్ చేస్తూ సందడి
సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోన్న ప్రియాంక చోప్రా.. అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది. వీటితో పాటు తరచూ తన భర్తతో చేసిన రొమాన్స్ తాలూకు ఫొటోలు, వీడియోలను వదులుతోంది. తద్వారా తమ మధ్య ఎంతటి అన్యోన్య బంధం ఉంది అనేది నిరూపిస్తూ ఉంటుంది. ఇలా చాలా కాలంగా ప్రియాంక ఇంటర్నెట్‌లో హైలైట్ అవుతోంది.

బీచ్‌లో రొమాంటిక్ ఫోజులతో
ప్రియాంక చోప్రా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో ఒకటి మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికి కారణం ఇందులో ఆమె తన భర్త నిక్ జోనస్‌తో కలిసి బీచ్‌లో రొమాంటిక్ ఫోజు పెట్టడమే. పైగా ఈ పిక్‌లో ప్రియాంక వేసుకున్న డ్రెస్ ఘోరంగా ఉంది. ఫలితంగా ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఇది వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











