ప్రియాంక బొడ్డుపై వజ్రపు ఆభరణం.. ఎన్ని కోట్ల విలువో తెలుసా?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం టాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న బిగ్గెస్ట్ ఫిలిం ఎస్ఎస్ఎంబీ 29లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు, ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ కథను అందించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. కాగా ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కూడా నటిస్తుండడం ప్రాజెక్టుపై మరింత హైప్ ను పెంచింది. ప్రస్తుతం ప్రియాంక ఈ మూవీ పైనే ఫోకస్ పెట్టింది. రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటుంది.

కాగా ఎస్ఎస్ఎంబీ 29 చిత్రం ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకమైన సెట్స్ లో షూటింగ్ జరిపించారు. మొదటి షెడ్యూల్ కు కూడా ప్రియాంక చోప్రా హాజరై సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఒడిశాలో ఈ చిత్ర షూటింగ్ రెగ్యులర్ గా కొనసాగుతోంది. ఈ రెండో షెడ్యూల్ లోను ప్రియాంక చోప్రా రీసెంట్ గా జాయిన్ అయింది. ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా మీడియా కంట పడింది. దాంతో ప్రియాంక చోప్రా కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Priyanka Chopra Belly Button Diamond Piercing Photos Goes Viral

అదేంటో కాదు... ప్రియాంక చోప్రా తన నావెల్ కి ధరించిన వజ్రమే. సాధారణంగా హీరోయిన్లు బెల్లీ బటన్ ను ప్రదర్శిస్తూ ఉంటారు. తమ అందమైన నడుముకు బటన్ తో మరింత అందాన్ని అలంకరిస్తారు. ప్రస్తుతం హీరోయిన్ జీరో సైజ్ నడుములను మెయింటైన్ చేస్తున్నారు. దాంతో జీరో ఫ్యాట్ ఉన్న తమ బెల్లీకి ఖరీదైన బటన్స్ ను ధరిస్తున్నారు. ఇక ఈ విషయంలోనే ప్రియాంక చోప్రా హాట్ టాపిక్ గా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఎస్ఎస్ఎంబీ 29 చిత్ర షూటింగ్లో పాల్గొనేందుకు ఒడిశాలో దిగిన ప్రియాంక చోప్రా తన బెల్లీ బటన్ తో షాక్ ఇచ్చింది.

అందులో షాక్ అవ్వాల్సినంత మేటర్ ఏముందని అనుకుంటున్నారా? కానీ, అసలు విషయం తెలిస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ప్రియాంక చోప్రా ధరించిన బెల్లీ బటన్ నార్మల్ జువెలరీ కాదు.. అది అత్యంత ఖరీదైన వజ్రం. ఆ డైమండ్ ఖరీదు రూ.2.40 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది. రవ్వ అంతే ఉన్న డైమండ్ కు అంత కాస్ట్ ఉంటుందని తెలుసుకున్న నెటిజెన్లు షాక్ అవుతున్నారు. సింపుల్ లుక్ లో మెరిసినప్పటికినీ అత్యంత ఖరీదైన డైమండ్ బెల్లీ బటన్ ను ధరించి తన లగ్జరీ లెవెల్ ను చూపించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక ప్రియాంక చోప్రా బాలీవుడ్లో కొన్నాళ్లపాటు ఊపిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్ స్టార్స్ సరసన నటించి మెప్పించింది. ఇక టాలీవుడ్ లోనూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన 'జంజీర్' చిత్రంలో నటించింది. దాంతో సౌత్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది. అంతకుముందే హృతిక్ రోషన్ 'క్రిష్' మూవీ తో ఇండియా మొత్తం క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత హాలీవుడ్ బాట పట్టి అక్కడ కూడా సక్సెస్ సాధించింది. దీంతో ప్రియాంక చోప్రా రేంజ్ అమాంతం పెరిగిపోయింది. మరోవైపు అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకొని పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అటు హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తూనే ఇటు ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా దూసుకెళ్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X