బికినీలో డోసు పెంచేసిన ప్రియాంక చోప్రా: ఏకంగా అలాంటి సెల్ఫీతో రచ్చ.. ఈ సారి మరింత ఘాటుగా!

చిన్న వయసులోనే అందంతో ప్రపంచం మొత్తాన్ని తన వైపునకు తిప్పుకుని.. ఆ తర్వాత హీరోయిన్‌గా దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకున్న బ్యూటీ ప్రియాంక చోప్రా. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండియన్ సినిమాలో తన మార్కును చూపిస్తూ దూసుకుపోతోన్న ఈ భామ.. విదేశీయుడిని పెళ్లాడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మరింతగా రెచ్చిపోతూ తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తన సోషల్ మీడియా ఖాతాల్లో బికినీ ధరించిన హాట్ ఫొటోలను ప్రియాంక చోప్రా షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి!

 మిస్ వరల్డుగా ఎంపికైన ప్రియాంక

మిస్ వరల్డుగా ఎంపికైన ప్రియాంక

అద్భుతమైన అందంతో మెస్మరైజ్ చేసే ప్రియాంక చోప్రా చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలో అడుగు పెట్టింది. ఆరంభంలోనే తన అందచందాలతో ఫిదా చేసిన ఈ బ్యూటీ.. దేశ ప్రజలను ఫిదా చేయడంతో పాటు 2000లో మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకుంది. తద్వారా ఆమె ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది. అదే సమయంలో భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేసిందీ బ్యూటీ.

 దేశంలోని అన్ని ఇండస్ట్రీల్లో అడుగు

దేశంలోని అన్ని ఇండస్ట్రీల్లో అడుగు

ప్రపంచ సుందరిగా విజయం సాధించిన తర్వాత ప్రియాంక చోప్రాకు సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 2002లో 'తమీజాన్' అనే తమిళ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అలా దాదాపు ఇరవై ఏళ్లుగా ఉత్తరాది నుంచి దక్షిణాది వరకూ ఉన్న పలు భాషల్లో హీరోయిన్‌గా నటించింది. తద్వారా దేశ వ్యాప్తంగా హవాను చూపించింది.

అక్కడికెళ్లి ప్రేమలో.. లవర్‌తోనే పెళ్లి

అక్కడికెళ్లి ప్రేమలో.. లవర్‌తోనే పెళ్లి

దేశంలోని దాదాపు అన్ని భాషల్లోనూ నటించిన ప్రియాంక చోప్రా.. ఆ మధ్య హాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఇంగ్లీష్‌లో కొన్ని వెబ్ సిరీస్‌లలో నటించిన ఈ బ్యూటీ.. అప్పుడే అమెరికాకు చెందిన నికో జోనస్ అనే పాప్ సింగర్‌తో ప్రేమలో పడింది. తనకంటే వయసులో చిన్నోడు అయిన అతడితో డేటింగ్ చేసింది. ఆ తర్వాత కొన్నేళ్లకు తన ప్రియుడిని గ్రాండ్‌గా వివాహం చేసుకుంది.

మొత్తం మార్చుకుంది... ట్రోల్స్‌ వల్ల

మొత్తం మార్చుకుంది... ట్రోల్స్‌ వల్ల

హాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన తర్వాత ప్రియాంక చోప్రా తీరు మారిపోయింది. మరీ ముఖ్యంగా ఆమె వ్యవహార శైలి కూడా పాశ్చత్య సంస్కృతిలో కలిసిపోయింది. దీంతో విచిత్రమైన డ్రెస్‌లు వేసుకుంటూ.. స్మోకింగ్ చేస్తూ.. పార్టీలు చేసుకుంటూ తరచూ రచ్చ రచ్చ చేస్తోందామె. అదే సమయంలో భర్తతో బహిరంగంగానే రొమాన్స్‌ను పండిస్తూ నెటిజన్ల నుంచి విమర్శలను ఎదుర్కొంటోంది.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా


వరుస ఆఫర్లతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే కెరీర్ సంబంధిత విశేషాలను సైతం ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను వదులుతూ రచ్చ చేస్తోంది. తద్వారా హాట్ టాపిక్ అవుతోంది.

బికినీ ఫొటోలతో రచ్చ చేసిన ప్రియాంక

బికినీ ఫొటోలతో రచ్చ చేసిన ప్రియాంక

సోషల్ మీడియాలో సందడి చేస్తుండే ప్రియాంక చోప్రా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బికినీ ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె డోసు పెంచేసి మరీ అందాల విందు చేసింది. అలాగే, టాప్ యాంగిల్ నుంచి తీసుకున్న ఓ సెల్ఫీ కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇలా కొన్ని ఘాటు ఫొటోలను వదలగా.. అన్నింటికీ భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇవి వైరల్ అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X