సల్మాన్ ఖాన్ వల్ల.. ఆమెకు ప్రియాంక చోప్రా 1000 సార్లు ఫోన్ కాల్.. ఏమైంది?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నుంచి గ్లోబల్ బ్యూటీగా ఎదిగిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం డైరెక్టర్ తెలుగు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొంత కాలంగా బాలీవుడ్ చిత్రాలనే కాదని హాలీవుడ్ లోనే సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబుకు జంటగా SSMB 29లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా దృష్టి మొత్తం ఈ చిత్రంపైనే పెట్టింది. ఓ రేంజ్ ఉన్న చిత్రాల్లోనే నటిస్తూ వస్తోంది. అలాంటిది ప్రియాంక చోప్రా ఓ సందర్భంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ వల్ల వాళ్ల చెల్లెకు 1000 సార్లు ఫోన్ కాల్ చేయాల్సి వచ్చిందంట.. తాజాగా సల్మాన్ ఖానే ఆ విషయాలను వివరించాడు..

ప్రియాంక చోప్రా SSMB29 ప్రాజెక్ట్ వివరాలు..
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తొలిసారిగా నటిస్తున్న తెలుగు చిత్రం SSMB29. ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ప్రియాంక చోప్రా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ రూ.1000 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

Priyanka Chopra Called up Bollywood Star Salman Khan Sister a Thousand Times

సల్మాన్ ఖాన్ తో ప్రియాంక చోప్రాకు గొడవ?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చిత్రాలకు సౌత్ లో ఎంతటి డిమాండ్ ఉంటుందో తెలిసిందే. ఆయనకంటూ దక్షిణాదిలో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే సల్లూ బాయ్ తో కలిసి నటించాలని చాలా మంది హీరోయిన్లు కోరుకుంటారు. ఈ క్రమంలోనే కరోనా ముందు ప్రియాంక చోప్రా కూడా సల్మాన్ ఖాన్ తో నటించడానికి ప్రయత్నించిందంట. సల్మాన్ ఖాన్ నటించిన 'భరత్' అనే చిత్రంలో నటించాలని ఎంతోగానో ప్రయత్నించిందంట. కానీ చివరల్లో సినిమా చేయకుండానే సైడ్ అయ్యిపోయిందని, బాలీవుడ్ మీడియాలో గతంలో వార్తలు ఉన్నాయి. దీంతో సల్మాన్ ఖాన్ ప్రియాంకకు చెడిందా? అని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ తాజాగా దీనిపై సల్మాన్ ఖాన్ స్పందించి క్లారిటీ ఇవ్వడం విశేషం.

సల్మాన్ ఖాన్ కోసం 1000 సార్లు ఫోన్ కాల్..
ప్రియాంక చోప్రా సల్మాన్ ఖాన్ తో 'భరత్' అనే చిత్రంలో నటించడానికి ఎంతో ప్రయత్నించింది. 2019లో ఈ సినిమా విడుదలైంది. కానీ ఈ సినిమా షూటింగ్ 2018లో ప్రారంభమైంది. అయితే అదే ఏడాది ప్రియాంక చోప్రా ఎంగేజ్ మెంట్, పెళ్లి కారణంగా భరత్ అనే సినిమాలో పని చేసే అవకాశాన్ని కోల్పోయిందని, ముందుగా ప్రియాంకానే ఎంపికైనా తర్వాత మాత్రం తన వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఆ ప్రాజెక్ట్ ను మిస్ అయ్యిందని చెప్పారు. అయితే సల్మాన్ ఖాన్ చెల్లి అప్రిత్ ఖాన్ కు ప్రియాంక చోప్రా 1000 ఫోన్ చేసి భరత్ మూవీలో ఛాన్స్ అడిగిందని, చివరికి ఎలాంటి పాత్రైనా సల్మాన్ తో నటించాలని ఉందని అడిగిందని సల్మాన్ ఖాన్ చెప్పిన్నట్టు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

అల్లు అర్జున్ కు నో చెప్పిన ప్రియాంక..
ఐకాన్ స్టార్ అర్జున్ - అట్లీ కాంబినేషన్ లో రూపుదిద్దుకోబోతున్న భారీ ప్రాజెక్ట్ కోసం టీమ్ ప్రియాంక చోప్రాను సంప్రదించారు. కానీ ప్రియాంక చోప్రా అల్లు అర్జున్ సరసన నటించేందుకు ఒప్పుకోలేదు. ఒకప్పుడు ప్రియాంక చోప్రా ఎలా ఉన్నా.. ఇప్పుడు మాత్రం గ్లోబల్ బ్యూటీ టచ్ చేయని రేంజ్ కు వెళ్లింది. మరోవైపు SSMB29 తర్వాత మరోసారి ఇండియాలో సంచలనంగా మారడం ఖాయమంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X