బికినీలో హద్దులు దాటేసిన ప్రియాంక చోప్రా... వారణాసి షూటింగ్‌ బ్రేక్‌‌లో అలా చిల్!

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా సినిమాలు, షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నప్ప్పటికీ కుటుంబానికి, సన్నిహితులకు సమయాన్ని కేటాయిస్తూనే ఉంటారు. వర్క్ లైఫ్‌ని, ఫ్యామిలీ లైఫ్‌ని ఎలా బ్యాలెన్స్ చేయాలో కూడా ఆమె పలువురికి పాఠాలు చెబుతుంటారు. తీరిక వేళల్లో శరీరాన్ని, మనసును ఎలా రీఛార్జ్ చేసుకోవాలో కూడా ప్రియాంకకు బాగా తెలుసు. ఎంతటి బిజీలో ఉన్నప్పటికీ యోగా, ధ్యానం, వర్కవుట్స్‌ను అస్సలు వదిలిపెట్టరు. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న వారణాసిలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ షూటింగ్‌లో బిజీగా ఉన్న ప్రియాంక కాస్త బ్రేక్ దొరకడంతో చిల్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శ్రీ దుర్గా ఆర్ట్స్, షోవింగ్ బిజినెస్ బ్యానర్స్‌పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తీకేయ, ఎస్ గోపాల్ రెడ్డిలు సంయుక్తంగా వారణాసి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. ప్రకాష్‌రాజ్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. మిగిలిన టెక్నీషియన్స్, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. దాదాపు 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో వారణాసి చిత్రం తెరకెక్కుతోంది. 2027 ఏప్రిల్ 7న వారణాసి మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Priyanka Chopra Chills in Blue Bikini Enjoys Raw Mango with Desi Vibes in Varanasi Shooting Break

టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ వారణాసి కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం మూవీ షూటింగ్ హైదరాబాద్‌ నగర శివార్లలోని శంకరపల్లిలో వేగంగా జరుగుతోంది. వారణాసి నగరాన్ని, విశ్వనాథ ఆలయం, గంగా నదీతీరాన్ని ప్రతిబింబించేలా వేసిన భారీ సెట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు జక్కన్న. ఈ షూటింగ్‌లో ప్రియాంక చోప్రా జాయిన్ అయ్యారు. ఎయిర్‌పోర్ట్ నుంచి లోకేషన్‌కి వెళ్తూ.. కారులోనే మేకప్ వేసుకున్న వీడియోలు, ఫోటోలను ప్రియాంక షేర్ చేశారు. వారణాసిలో మందాకినిగా ప్రియాంక నటిస్తున్నారు.

రెండు వారాల పాటు ఇక్కడ షూటింగ్ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే వేసవి నేపథ్యంలో షూటింగ్‌కి గ్యాప్ ఇవ్వాలని రాజమౌళి భావిస్తున్నారట. ఇప్పటికే సుమారు 70 శాతం షూటింగ్ పూర్తి కావడంతో టీమ్‌కు రీఛార్జ్ అయ్యేలా చూడాలని ఆయన అనుకుంటున్నారట. వేసవి ముగిసిన తర్వాత విదేశాల్లో మరో షెడ్యూల్‌కి రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. ఈ బ్రేక్ సమయంలో పోస్ట్ ప్రొడక్షన్‌తో పాటు ఇప్పటి వరకు చేసిన షూటింగ్‌ తాలుకా ఫుటేజ్‌ని ఆయన పరిశీలించనున్నారని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.

కాగా.. ఇటీవల వారణాసి షూటింగ్‌కు కాస్త బ్రేక్ దొరకడంతో ప్రియాంక చోప్రా చిల్ అయ్యారు. దీనిలో భాగంగా బికినీ ధరించి రెచ్చిపోయారు. ఫూల్ సైడ్ బ్లూ బికినీని ధరించిన ఆమె.. పూల్ దగ్గర కూర్చొని ఉప్పు, కారం చల్లిన పచ్చి మామిడికాయ ముక్కలను రుచి చూశారు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎంత గ్లోబల్ బ్యూటీ అయినా, అమెరికాలో నివసిస్తున్నా ప్రియాంక చోప్రాలో దేశీ గర్ల్ వైబ్స్ ఏమాత్రం పోలేదని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X