Priyanka Chopra కూతురు ఎంత ముద్దొస్తుందో చూశారా? వినాయక చవితి సందర్భంగా ఫస్ట్ టైమ్ అలా..!
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అమెరికాలో ఉన్నప్పటికీ భారతీయ సంప్రదాయాలను, మూలలను మరిచిపోదు అనే పలుమార్లు రుజువు చేసుకొన్నారు. భారతీయ పండుగలను తన కుటుంబం, స్నేహితులతో ఘనంగా చేసుకొంటారు. ఆ వేడుకల సంబంధించిన ఫోటోలను తన అభిమానులు, నెటిజన్లతో పంచుకొన్నారు. ఎప్పటి మాదిరిగానే వినాయక చవితి పండుగను ప్రియాంక చోప్రా ఘనంగా జరుపుకొన్నారు. పండుగ సమయంలో గణేష్ మహారాజ్ బొమ్మతో తన కుమార్తె మల్టీ ఉన్న ఫోటోలు షేర్ చేయగా ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్ అయ్యాయి. ఆ ఫోటో వివరాల్లోకి వెళితే..
వినాయక చవితికి ముందు ఇటీవల తన భర్త నిక్ జోనస్ బర్త్ డేను ఘనంగా జరుపుకొన్నారు. తన భర్తకు ముద్దు పెడుతూ.. నీతో సంబరాలు చేసుకోవడం నా జీవితంలో గొప్ప క్షణాలుగా భావిస్తాను. నేను సాధిస్తానని నమ్మకం లేని విషయాలను నాతో సాధించేలా చేశావు. నాలో శాంతి, ప్రేమను నింపావు. నా భర్త్ డే బాయ్‌కి ఐ లవ్ యూ. నీ కలలన్నీ సాకారం కావాలని కోరుకొంటున్నాను అని ప్రియాంక చోప్రా ఓ ఫోటోను షేర్ చేసింది.

ఇక వినాయక చవితి సందర్భంగా తన కూతురును ప్రజలకు చూపించే ప్రయత్నం చేసింది. చాలాకాలంగా తన కూతురు ఫోటోను చూపించకుండా దాచి పెడుతున్న విషయం తెలిసిందే. వినాయక చవితి సందర్భంగా తన కూతురును పూర్తిగా చూపించకపోయినా.. సగం ముఖాన్ని చూపించి ఊరించింది. ప్రియాంక చోప్రా కూతురు మల్టి ఫోటోలలో ముద్దు ముద్దుగా కనిపించింది.

ప్రియాంక తన కూతురు మల్టీ ఫోటోలను షేర్ చేస్తూ.. గణపతి దేవుడితో నా పాప. మేము ఎక్కడ ఉన్నా.. ఎప్పుడూ మాతోనే వినాయకుడు ఉంటాడు. గణపతి బప్పా మోరియా.. హ్యాపీ గణేష్ చతుర్థి అంటూ ప్రియాంక పోస్టు పెట్టింది. దాంతో అభిమానులు కూడా విషెస్ అందజేస్తూ నెటిజన్లు కామెంట్లతో హోరెత్తించారు.
ప్రియాంక కూతురు మల్టీ ముద్దుగా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్ పెట్టారు. తల్లికూతుళ్లు ఇద్దరు కూడా చాలా అందంగా ఉన్నారు. మీ కుటుంబానికి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఫోటో షేర్ చేసిన కొద్ది గంటల్లోనే 1.4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

ప్రియాంక చోప్రా కెరీర్ విషయానికి వస్తే.. 2023 సంవత్సరంలో అవ్ అగైన్ చిత్రంలో నటించింది. అలాగే హెడ్స్ ఆఫ్ స్లేట్ సినిమాలో నటించింది. ఇంకా ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ఇక ప్రియాంక నటించిన సిటాడెల్ చిత్రం ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది.


Click it and Unblock the Notifications











