ప్రియాంక చోప్రా సంపాదన ఎంతో తెలుసా?
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన అందం, టాలెంటుతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికోలో నటించడం ద్వారా ఆమె దశ తిరిగింది. ఆపై హాలీవుడ్ సినిమా అవకాశాలు దక్కించుకోవడంతో పాటు అక్కడ తనకంటూ స్నేహితులను ఏర్పరుచుకుంది. ప్రస్తుతం అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌తో డేటింగులో ఉన్న ఈ బ్యూటీ త్వరలో అతడిని పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉందనే ప్రచారం సైతం జరుగుతోంది.
ప్రియాంక ఒకప్పటి మామూలు నటి కాదు. ఇపుడు ఆమె రేంజి ప్రపంచ స్థాయికి పెరిగింది. అందుకే తాను తీసుకునే రెమ్యూనరేషన్ కూడా పెంచేసింది. సల్మాన్ ఖాన్ 'భారత్' మూవీలో ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేయగా.... వారు ఆఫర్ చేసిన రూ. 6 కోట్ల రెమ్యూనరేషన్ రిజక్ట్ చేసి తప్పుకుందని టాక్. నిక్ జొనాస్‌తో పెళ్లి కోసమే తప్పకుందని ప్రచారం జరిగినా అసలు విషయం ఇదేనంట.

హాలీవుడ్లో సంపాదన ఎక్కువ ఉండటంతో తన ఫోకస్ అంతా అక్కడ అవకాశాలు దక్కించుకోవడంపైనే పెట్టింది. 2017లో ప్రియాంక చోప్రా అమెరికన్ టీవీ సీరీస్, హాలీవుడ్ సినిమాలు, పలు ప్రకటనల్లో నటించడం ద్వారా 11 మిలియన్ డాలర్లు (రూ. 77 కోట్లు) సంపాదించిందని ఫోర్బ్స్ కథనం.
టాక్సులు కట్ అవ్వగా ... రూ. 56 కోట్లు తన ఖాతాలో వేసుకుందని టాక్. ప్రియాంక సినిమాల విషయానికొస్తే ఆమె నటించిన 'ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్' అనే అమెరికన్ చిత్రం 2019లో విడుదల కానుంది. దీంతో పాటు సోనాలి బోస్ దర్శకత్వంలో 'ది స్కై ఈజ్ పింక్' అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. ఇది కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











