twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Priyanka Chopra కు అరుదైన గౌరవం.. దీపిక పదుకోన్ స్థానంలో గ్లోబల్ ఐకాన్.. రానా దగ్గుబాటి ట్వీట్ వైరల్!

    |

    బాలీవుడ్‌లో గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా‌కు సముచితమైన గౌరవం దక్కింది. MAMI ముంబై ఫిల్మ్ ఫెస్టివల్‌‌కు చైర్ పర్సన్‌గా ఆమె ఎంపికయ్యారు. ఇంతకు ముందు ఈ పదవిలో బాలీవుడ్ సూపర్ స్టార్ దీపిక పదుకోన్ కొనసాగారు. ఆమె నుంచి ప్రియాంక చోప్రా పదవికి సంబంధించిన బాధ్యతలు చేపట్టడంతో ఆమెను బాలీవుడ్ ప్రముఖులు అభినందించారు. ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ 2021లో అక్టోబర్‌లో ప్రారంభం కానున్నది. ఈ సందర్భంగా రానా దగ్గుబాటి చేసిన ట్వీట్ వైరల్ అయింది.

    ప్రపంచానికి భారతీయ సినిమాను పరిచయం చేసే

    ప్రపంచానికి భారతీయ సినిమాను పరిచయం చేసే

    ముంబై ఫిల్మ్ ఫెస్టివల్‌కు చైర్ పర్సన్‌గా ఎంపిక కావడంపై ఆనందం వ్యక్తం చేస్తూ ప్రియాంక చోప్రా ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ప్రపంచానికి ఇండియన్ సినిమాను పరిచయం చేసే ఈ గొప్ప వేదికలోని టాలెంటెడ్ నటులు, సాంకేతిక నిపుణులతో కలువడం చాలా హ్యాపీగా ఉంది అంటూ వీడియోలో ప్రియాంక చోప్రా పేర్కొన్నారు.

    ప్రియాంక చోప్రా ఎమోషనల్‌గా

    ప్రియాంక చోప్రా ఎమోషనల్‌గా

    తనకు అరుదైన అవకాశాన్ని కల్పించడంపై స్పందిస్తూ.. ఇక చాలా మందితో మాట్లాడాల్సిన పని ఉంది. అంతేకాకుండా మరింత మంది చెప్పిన విషయాలను వినాల్సి ఉంటుంది. ప్రపంచం భారతీయ సినీ పరిశ్రమను ఎలా చూస్తుందనే విషయంపై అవగాహన కల్పించుకోవాలి ఇలాంటి నేర్చుకోవాలంటే సినిమా మంచి మీడియం అంటూ ప్రియాంక ఎమోషనల్ అయ్యారు.

    కొత్త బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉంది..

    కొత్త బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉంది..


    ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ చైర్ పర్సన్‌‌గా కొత్త బాధ్యతలను చేపట్టడం చాలా గర్వంగా ఉంది. దేశంలోనే అతిపెద్ద ఫెస్టివల్ అయిన జియో మామీ ఫిల్మ్ ఫెస్టివల్‌కు చైర్మన్‌గా వ్యవహరించడం అరుదైన అవకాశం. ప్రపంచం గత రెండేళ్లలో ఎన్నో మార్పులు చోటుచేసుకొన్నాయి. వాటిని సృజనాత్మక దృక్పథంతో చూసి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధత్య నాపై ఉందని భావిస్తున్నాను. నా జీవితంలో కొత్త చాప్టర్‌ను ప్రారంభించడానికి చాలా ఉత్తేజంగా ఉన్నాను అని ప్రియాంక తన వీడియోలో భావాలను షేర్ చేసుకొన్నారు.

    అక్టోబర్ 21 తేదీ నుంచి మార్చి 2022 వరకు

    అక్టోబర్ 21 తేదీ నుంచి మార్చి 2022 వరకు

    ముంబై అకాడమీ ఆఫ్ ది మూవింగ్ ఇమేజ్ (MAMI) ఫిల్మ్ ఫెస్టివల్ గతేడాది సుమారు వారం రోజులపాటు నిర్వహించారు. గతేడాది ముంబైలో కరోనావైరస్ వ్యాప్తి భారీగా ఉండటంతో ఈ వేడుకను ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ప్రస్తుతం మళ్లీ ఈ వేడుకను థియేటర్లలో నిర్వహించేందుకు అంతా సిద్దం చేశారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో అక్టోబర్ 21 నుంచి మార్చి 2022 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

    ప్రియాంక చోప్రాకు రానా దగ్గుబాటి ఘన స్వాగతం

    ప్రియాంక చోప్రాకు రానా దగ్గుబాటి ఘన స్వాగతం

    ప్రియాంక చోప్రా మామీ ఫిల్మ్ ఫెస్టివల్‌కు చైర్ పర్సన్‌గా ఎంపిక కావడంపై రానా దగ్గుబాటి సంతోషాన్ని వ్యక్తం చేశారు. రానా ట్వీట్ చేస్తూ.. ముంబై ఫిల్మ్ ఫెస్టివల్‌లో కొత్త చాప్టర్ మొదలైంది. ప్రియాంక చోప్రాను స్వాగతం పలకడానికి థ్రిల్లింగ్‌గా ఉంది. బోర్డు ఆఫ్ ట్రస్టీలో చోటు దక్కించుకొన్న అంజలీ మీనన్, శివిదుంగార్పూర్ నా అభినందనలు, గొప్ప ఆశావాదంతో ముందుకెళ్లడం సంతోషం కలిగిస్తున్నది. మా ఫిల్మ్ ఫెస్టివల్ అందరికి స్వాగతం పలుకుతున్నది అంటూ రానా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    English summary
    Global Icon and Bollywood actress Priyanka Chopra elected as chairperson for Mami Mumbai film Festival. In this occassion, Rana Tweeted that, A new chapter begins. Thrilled to welcome priyankachopra, AnjaliMenonFilm and shividungarpur to the MumbaiFilmFest Board of Trustees. We are stepping up and stepping out with hope. We are now OPEN.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X