గ్లోబర్ స్టార్ ప్రియాంక చోప్రా.. ఫ్యాషన్‌కు కుర్రకారు ఫిదా
గ్లోబర్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న తరుణంలో హాలీవుడ్ వెళ్లి అక్కడా దుమ్ములేపింది. అక్కడి బుల్లితెర, వెండితెరపై అందాలను ఆరబోసి అందర్నీ ఆకట్టుకుంది. చివరగా హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్‌ను వివాహామాడి అక్కడే సెటిలైంది. అలా నిక్ జోనాస్‌తో వివాహం జరగడం, బాలీవుడ్‌కు దూరమవ్వడంతో ఇక్కడి అభిమానులు కాస్త నిరాశ చెందారు. అయితే వారిని ఎలా ఆకట్టుకోవాలో ప్రియాంకకు తెలిసినంత మరో హీరోయిన్‌కు తెలీదేమో.
తన స్టైలింగ్, ఫ్యాషన్‌తో ఇట్టే కట్టిపడేస్తుంది. అంతర్జాతీయ వేదికల్లో ప్రియాంక మెరిసిందే.. కెమెరా కళ్లన్నీ ఆమె వైపు తిరగాల్సిందే. ఒక్కోసారి ఆమె ధరించిన దుస్తులపై విపరీతంగా ట్రోల్స్ జరుగుతాయి. అయినా సరే ఆ ట్రోల్స్‌తో అవి మరింత పాపులర్ అవుతాయి. ఆమె అంతర్జాతీయ వేడుకల్లో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

న్యూయార్క్ 2017 మెట్ గాలా ఈవెంట్, 2016 టైమ్ గాలా ఈవెంట్, 2019 మెట్ గాలా ఈవెంట్, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈవెంట్, మొరాకోలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రియాంక ధరించిన దుస్తులు, ఆమె స్టైలింగ్ అంతర్జాతీయ మీడియాను ఆకర్షించాయి. ఈ ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాను ఊపు ఊపేశాయి. తాజాగా ఆ ఫోటోలు మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి. మీరూ ఓ సారి వాటిపై ఓ లుక్కేయండి.



Click it and Unblock the Notifications











