twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నో జాకెట్, నో బ్రా... పెళ్లయ్యాక ఫోటో షూట్లో గ్లామర్ డోసు పెంచిన ప్రియాంక!

    |

    బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా... ఇటీవలే అమెరికా కోడలైన సంగతి తెలిసిందే. యూఎస్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లాడిన ఈ మాజీ విశ్వసుందరి హాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ స్టార్‌గా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇండియాలో ఉన్నప్పటితో పోలిస్తే పెళ్లి తర్వాత ప్రియాంక వ్యవహార శైలి, డ్రెసింగ్ స్టైల్‌లో చాలా మార్పు వచ్చింది. ఇంటర్నేషనల్ సెలబ్రిటీ లెవల్ మెయింటేన్ చేస్తున్నారు. ఇక ఫోటో షూట్ల విషయంలో కూడా ప్రియాంక గతంలో తాను గీసుకున్న హద్దులు చెరిపేసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అమెరికా లాంటి ఆల్ట్రామోడర్న్ సమాజంలో ఉన్నప్పుడు దానికి తగిన విధంగానే మలుసుకోవాల్సి ఉంటుంది. అందుకు ఆమె తాజా ఫోటో షూట్ ప్రతీకగా నిలుస్తోంది.

    సారీలో టాప్‌లెస్‌గా ప్రియాంక

    సారీలో టాప్‌లెస్‌గా ప్రియాంక

    యూఎస్ మేగజైన్ ‘ఇన్‌స్టైల్' కోసం ప్రియాంక చోప్రా టాప్‌లెస్ ఫోజులు ఇచ్చింది. తరుణ్ తహిల్యానీ ప్రత్యేకంగా డిజైన్ చేసిన సారీలో అమెరికన్లకు తన హాట్ అండ్ సెక్సీ అందాలను పరిచయం చేసింది. పెళ్లి తర్వాత ప్రియాంక చోప్రా ఈ స్థాయిలో అందాల ఆరబోయడం ఇదే తొలిసారి.

    యూఎస్ఏ కుర్రాళ్లను కూడా..

    యూఎస్ఏ కుర్రాళ్లను కూడా..

    ఇప్పటి వరకు ఇండియన్ కుర్రాళ్లను తన ఒంపు సొంపులతో కట్టిపడేసిన ప్రియాంక చోప్రా ఇప్పుడు అమెరికా పోరగాళ్ల సైతం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా అక్కడ బాగా పెరిగిందట. ఆమె జోరు చూస్తుంటే మున్ముందు మరిన్ని అందాల సంచలనాలు ఖాయంగా కనిపిస్తోంది.

    భర్త సపోర్టు కూడా ఉంది

    అమెరికా అంటేనే స్వేచ్ఛాయుత జీవితానికి కేరాఫ్ అడ్రస్‌గా చెబుతారు. పెళ్లయ్యాక నువ్వు అన్నీ మూసుకుని కూర్చోవాలి లాంటి ఆంక్షలు అక్కడ ఉండవు. ప్రియాంక చోప్రాకు ఈ విషయంలో అటు తన హస్బెండ్ పరంగా కూడా ఫుల్ సపోర్ట్ ఉండటంతో అమెరికా వినోద రంగంలో అందం పరంగా, టాలెంట్ పరంగా తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమైంది.

    ప్రియాంక చోప్రా

    ప్రియాంక చోప్రా

    అమెరికా కోడలైనప్పటికీ బాలీవుడ్ రంగంలో తన గుర్తింపును కోల్పోవడానికి ఆమె సిద్ధంగా లేదు. సంవత్సరానికి ఒక బాలీవుడ్ సినిమా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ‘స్కై ఈజ్ పింక్' అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో ప్రియాకంతో పాటు సోనాలి బోస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పర్హాన్ అక్తర్, జైరా వాసిమ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

    English summary
    Actor Priyanka Chopra has featured on US magazine InStyle’s July issue and is seen in a sultry new look on the cover. Priyanka Chopra is an Indian actress who has established herself as a leading actress of Indian cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X