నాకు భారత ప్రధాని.. నా భర్తకు అమెరికా అధ్యకుడు కావాలని ఉంది
బాలీవుడ్, హాలీవుడ్ చిత్ర పరిశ్రమలను ఏలేస్తున్న అందాల నటి ప్రియాంక చోప్రా తన మనసులోని మాటను బయటపెట్టింది. సామాజిక మార్పును తీసుకు రావడమే తన కోరిక అని 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరిటాన్ని సొంతం చేసుకొన్న బ్యూటీ ఆశలు భారీగా ఉన్నాయి. రాజకీయాల్లో ప్రవేశించాలన్న కోరిక ఉందా? ఉంటే ఎలాంటి పదవిని చెపట్టడానికి ఇష్టం అనే ప్రశ్నలకు చాలా ఆసక్తికరమైన సమాధాన్ని ఇచ్చారు.
ఒకవేళ నాకు అవకాశం వస్తే ప్రధానిమంత్రి పదవిని చేపట్టాలని ఉంది. అలాగే తన భర్త నిక్ జోనస్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే చూడాలని కోరిక ఉంది. అలాగే ఆయనకు కూడా అలాంటి కోరిక ఉంది అని ప్రియాంక వెల్లడించింది. రాజకీయాలపై మాకు ఆసక్తి లేకపోయినా సమాజంలో మార్పు తీసుకు రావడానికి మాత్రమే ఆ పదవిని చేపట్టాలని ఉంది అని అన్నారు.

నా భర్త నిక్ జోనస్ గొప్ప ఫెమినిస్టు. తాను ఫెమినిస్టునని చెప్పుకోవడానికి సిగ్గుపడడు. నేను ఓ ఫెమినిస్టును పెళ్లి చేసుకోన్నానని చెప్పడానికి గర్వంగా ఉంటుంది. గాయకుడు నిక్ జోనస్‌ను ప్రియాంక చోప్రా ప్రేమించి పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం రాజస్థాన్‌లోని జైపూర్‌లో నిరాడంబరంగా జరిగింది.


Click it and Unblock the Notifications











