మా మద్య అలాంటి విభేదాలు.. భర్తతో విడాకులపై ప్రియాంక చోప్రా గుట్టురట్టు
Photo Courtesy: Instagram/priyankachopra
సినీ తారల మ్యారేజ్ బ్రేకప్ వార్తలు ఇటీవల కాలంలో మీడియాలో జోరుగా షికారు చేస్తున్నాయి. అయితే తమ దాంపత్య జీవితాలపై వెలుగు చూస్తున్న రూమర్లు, గాసిప్స్‌ను కొందరు లైట్‌గా తీసుకొంటే.. మరికొందరు మాత్రం ఘాటుగా స్పందిస్తున్నారు. బ్రేకప్ వార్తలు విషయంలో సినీ తారలు ఆచీతూచీ స్పందిస్తున్నారు. అయితే తన మ్యారేజ్ బ్రేకప్ గురించి వచ్చిన రూమర్లపై వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా క్లారిటీ ఇచ్చారు. తన భర్త నిక్ జోనస్‌తో ఉన్న అనుబంధాన్ని గురించి ఆమె వివరణ ఇచ్చారు. ప్రియాంక చోప్రా జోనస్ చెప్పిన విషయాల్లోకి వెళితే..
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఉన్నత స్థానానికి చేరుకొన్న ప్రియాంక చోప్రా వ్యక్తిగత జీవితం, డేటింగ్ లైఫ్ గురించి చాలానే వార్తలు వచ్చాయి. పలువురు హిందీ హీరోలతో వచ్చిన అఫైర్ వార్తలకు భిన్నంగా ఆమె అమెరికాకు చెందిన మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ నిక్ జోనస్‌తో ప్రేమలో పడింది. భిన్నమైన మతాలు, డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వారిద్దరూ కూడా ఇరు కుటుంబాలను ఒప్పించి 2018 సంవత్సరం, డిసెంబర్ 1వ తేదీన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో వివాహం చేసుకొన్నారు. వారికి మల్టీ మేరీ చోప్రా జోనస్ అనే కూతురు కూడా పుట్టింది.

అయితే ఇటీవల కాలంలో ప్రియాంక, నిక్ జోనస్ దాంపత్య జీవితంలో కలతలు చోటు చేసుకొన్నాయి. వారి మధ్య అభిప్రాయబేధాలు చోటు చేసుకొన్నాయి. దాంతో వారిద్దరూ విడిపోయే దిశగా నిర్ణయం తీసుకొంటున్నారు అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. తన వైవాహిక జీవితంపై వచ్చిన వార్తలను ఆమె కొట్టిపడేశారు. తన భర్తతో విభేదాలు అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని చెప్పారు.
నిక్ జోనస్‌తో నా బంధం ప్రత్యేకమైనది. మేము పరిచయమైన కొద్ది రోజుల్లోనే ఎవరూ వీడదీయలేనంతగా ప్రేమ పుట్టింది. మేము కలుసుకొన్న 6 నెలల లోపే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నాం. నిక్‌ను కలిసినప్పుడు.. నేను సరైన వ్యక్తిని కలిశాననే ఫీలింగ్ కలిగింది. అతడితోనే పెళ్లి చేసుకోవాలని అనుకొన్నాం. అందుకే నిక్‌ను పెళ్లి చేసుకొన్నాను అని ప్రియాంక చోప్రా స్పష్టం చేశారు.
మా జీవితంలో భిన్న మతాలు, రెండు డిఫరెంట్ దేశాల ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. మా మధ్య ఏజ్ గ్యాప్ కూడా ఉంది. ఇలాంటి కారణాల వల్లనే మా మధ్య సరైన అవగాహన లేదని అనుకొంటున్నారేమో. అందుకే అలాంటి రూమర్ల గురించి మీడియా ఎక్కువగా మాట్లాడుకొంటున్నారేమో. కానీ రూమర్లు క్రియేట్ చేసే వారికి నేను చెప్పేది ఏమిటంటే.. గత 8 ఏళ్లుగా కలిసి ఉంటున్నాం. హ్యాపీగా జీవిస్తున్నాం. మా మధ్య ఎలాంటి విభేదాలు, విడిపోవడాలు అనే సమస్యనే లేదు. ఇతరులు ఏమైనా అనుకొన్నా పట్టించుకోం. మేము చాలా సంతోషకరమైన లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాం అని అన్నారు.
ప్రియాంక చోప్రా కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న వారణాసి చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా తొలిసారి తెలుగులోకి అడుగుపెడుతున్నారు. చాలా సంవత్సరాల తర్వాత దక్షిణాది సినిమా రంగంలో మరోసారి రీ ఎంట్రీ ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











