twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆడిషన్స్‌లో ఆయనను చూసి వణికిపోయా.. ఆ రేంజ్ కెమిస్ట్రీతో భయపడ్డా.. ప్రియాంక చోప్రా

    |

    బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా జోనస్ పెళ్లి తర్వాత కూడా హిందీ చిత్ర పరిశ్రమలో రఫ్ ఆడేస్తున్నది. తాజాగా ఆమె నటించిన ది స్కై ఈజ్ పింక్ సినిమా సూపర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. ఈ చిత్రంలో ఫర్హాన్ అఖ్తర్‌తో కలిసి ప్రియాంక చోప్రా నటించింది. ఈ చిత్రంలో భయమంటే తెలియని మహిళ పాత్రలో నటించి మెప్పించింది. అయితే తోటి నటుడు ఫర్హాన్ అఖ్తర్‌తో ఉన్న అనుబంధం గురించి ఆసక్తికరంగా వెల్లడించింది.

    ఫర్షాన్ అఖ్తర్ డైరెక్షన్‌లో

    ఫర్షాన్ అఖ్తర్ డైరెక్షన్‌లో

    గతంలో ఫర్హాన్ డైరెక్ట్ చేసిన డాన్, డాన్2 చిత్రాల్లో నటించాను. ఆ సినిమాలో షారుక్‌తో డిజైన్ చేసిన పాత్ర అద్భుతమైన కెమిస్ట్రీని పండించింది. ఇప్పటికీ డాన్ సినిమా గురించి ఫర్హాన్‌తో వీలు చిక్కినప్పుడల్లా మాట్లాడుతాను. ఫర్మాన్ నా కెరీర్‌లో ఆరంభంలో బిగ్గెస్ట్ చిత్రాలను అందించారు. నాకు నటన ఏంటో తెలియని సమయంలో కాన్ఫిడెన్స్ నింపారు అని ప్రియాంక చెప్పుకొచ్చింది.

    తొలిసారి కలిసినప్పుడు

    తొలిసారి కలిసినప్పుడు

    డాన్ ఆడిషన్స్ సమయంలో ఫర్హాన్‌ను తొలిసారి కలిశాను. అతడిని చూసి భయమేసింది. నిజంగా ఫర్హాన్‌తో మాట్లాడానికి భయంతో వెనుకంజ వేశాడు. అప్పటికే దిల్ చాహ్తా హై లాంటి సినిమాలో మంచి ఊపులో ఉన్నాడు. నేను అందాజ్, ముజ్‌సే షాదీ కరోగే లాంటి సాధారణమైన సినిమాల్ో నటించాను. అందుకే ఆయనను చూసి కంగారు పడ్డాను అని ప్రియాంక చెప్పింది.

    సక్సెస్‌ను తలకెక్కించుకోలేదు

    సక్సెస్‌ను తలకెక్కించుకోలేదు

    అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫర్హాన్‌లో ఎలాంటి మార్పులు రాలేదు. 2005లో కలిసినప్పుడు ఎలా ఉన్నాడో.. ఇప్పుడు కూడా అన్ని రకాలుగా అలానే ఉన్నాడు. సక్సెస్, స్టార్ డమ్ లాంటి విషయాలు ఆయనపై ప్రభావం చూపలేదు. అందుకే ఫర్హాన్ అంటే నాకు చాలా ఇష్టం అని ప్రియాంక చోప్రా అన్నారు.

     సక్సెస్ దిశగా ది స్కై ఈజ్ పింక్

    సక్సెస్ దిశగా ది స్కై ఈజ్ పింక్

    ఇక ది స్కై ఈజ్ పింక్ సినిమా మంచి టాక్‌తో దూసుకెళ్తున్నది. గత నాలుగు రోజుల్లో ఈ చిత్రం 12 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ సినిమాను ప్రియాంక భర్త నిక్ జోనస్ కూడా ప్రమోట్ చేయడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఈ చిత్రం 50 శాతానికిపైగా ఆక్యుపెన్సీతో ప్రదర్శనలు కొనసాగుతున్నాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    English summary
    Bollywood actress Priyanka Chopra riding high on The Sky Is Pink success. She shared her relation with Actor Farhan Khan. She said, I was scared see him first time in 2005.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X