కొత్త చాప్టర్ మొదలైంది.. రాజమౌళి మూవీ రూమర్ల మధ్య చిల్కూరులో ప్రియాంక చోప్రా

బాలీవుడ్ నుంచి గ్లోబల్ స్టార్‌గా మారిన అందాల భామ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హైదరాబాద్‌లో గత కొద్ది రోజులుగా సందడి చేస్తున్నది. ఇటీవల భాగ్యనగరంలో అడుగుపెట్టినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా కొన్ని రూమర్ల మధ్య ఆమె హైదరాబాద్‌లోని అత్యంత పాపులారిటీ ఉన్న ఆలయం చిలకూరు బాలాజీని సందర్భించుకోవడం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ క్రమంలో ఆమె చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతున్నది. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

మహేశ్ బాబు సినిమాలో
ఇంట గెలిచి రచ్చ గెలిచిన రీతిలో బాలీవుడ్‌కు దూరమైన హాలీవుడ్‌లో రాణిస్తున్న ప్రియాంక చోప్రా మరోసారి ఇండియన్ సినిమాపై కన్నేసింది. అయితే దర్శక ధీరుడు రాజమౌళి, మహేశ్ బాబు మూవీలో నటిస్తున్నారనే వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతున్న క్రమంలో ప్రియాంక చోప్రా హైదరాబాద్‌లో అడుగపెట్టారు. దాంతో మరోసారి జక్కన్న సినిమాలో కన్ఫార్మ్ అయిందని వార్తలు జోరందుకొన్నాయి.

Priyanka Chopra Jonas prayers at Chilkur Balaji temple in Hyderabad amid part of SS Rajamouli and Mahesh Babu Movie

చిలుకూరు ఆలయంలో
ఇదిలా ఉండగా, గత రెండు రోజులుగా రాజమౌళి సినిమాకు సంబంధించిన లుక్ టెస్ట్‌తో బిజీగా మారిన ఆమె కొంత సమయాన్ని తీసుకొని హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించుకొన్నారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి.. కంచి పట్టు చీరలో భారతీయ సంప్రదాయాలను గౌరవిస్తూ ఆమె బాలాజీ సేవల తరించారు. అనంతరం ఆలయ పూజారుల ఆశీస్పులు దీవెనలు అందుకొన్నారు.

కొత్త చాప్టర్ మొదలైందంటూ
వీసా బాలాజీని సందర్శిచుకొన్న తర్వాత ప్రియాంక చోప్రా తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు ద్వారా తన అనుభవాలను పంచుకొన్నారు. బాలాజీ ఆశీస్సులతో కొత్త చాప్టర్ మొదలైంది. మన హృదయాల్లో శాంతి, సౌఖ్యం చేకూరుతుందని ఆశిస్తున్నాను. భగవంతుడిని అనుగ్రహం అనంతం అని ప్రియాంక తన పోస్టులో పేర్కొన్నారు. ఆమె పోస్టుకు నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు.

Priyanka Chopra Jonas prayers at Chilkur Balaji temple in Hyderabad amid part of SS Rajamouli and Mahesh Babu Movie

1000 కోట్ల భారీ బడ్జెట్‌తో
అయితే మహేశ్ బాబు తన కెరీర్‌లో నటించే 29వ సినిమాకు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. సుమారుగా 1000 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఆమె ఈ సినిమా షూటింగులో పాల్గొనడానికి హైదరాబాద్‌కు వచ్చింది అనే వార్తలు వినపడుతున్నాయి.

వీసా బాలాజీ అని ఎందుకంటే?
ఇదిలా ఉండగా, చిలుకూరు బాలాజీని వీసా బాలాజీ అంటారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు వీసా కోసం ప్రయత్నించే వారు కాన్సులెట్‌కు వెళ్లే ముందు ఈ ఆలయాన్ని దర్శించుకొంటారు. 101 ప్రదర్శనాలు చేసి మొక్కు చెల్లించుకొంటారు. అందుకే ఈ భగవంతుడిని వీసా బాలాజీ అంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X