twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజభవనంలా ప్రియాంక చోప్రా ఇల్లు.. విలాసవంతమైన ఇంటి విలువ ఎన్ని వందల కోట్లో తెలుసా?

    |

    ర్యాప్ సింగర్ నిక్ జోనస్‌ను వివాహం చేసుకొన్న తర్వాత బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అమెరికాకే పరిమితమైంది. భర్తతో కలిసి వైవాహిక జీవితాన్ని, ప్రొఫెషనల్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నది. ఇటీవల వోగ్స్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ప్రియాంక చోప్రా తన జీవితానికి సంబంధించిన పలు విషయాలను పంచుకొన్నారు. ఈ సందర్భంగా తన ఇంటి గురించి అనేక విషయాలను వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే...

    స్వర్గధామం లాంటి ఇల్లు

    స్వర్గధామం లాంటి ఇల్లు

    కెరీర్ పరంగా ఎన్ని చికాకులు ఉన్నప్పటికీ.. ఇంట్లోకి అడుగుపెడితే స్వర్గంలా అనిపిస్తుంది. ఇంట్లో ఉంటే ప్రశాంతతోపాటు సంతోషంగా ఉంటుంది. ఇంట్లో ఉండే పరిస్థితులు, మనుషులతో నా మనసుకు ఉల్లాసంగా ఉంటుంది. నాకు ముంబై, న్యూయార్క్‌, లాస్ ఏంజెలెస్‌లో నివాసాలు ఉన్నాయి అని తెలిపారు.

    కొంటెచూపుతో కవ్విస్తోంది.. తారా సుతారియా హాట్ పిక్స్

    విలాసవంతమైన ఇంటిలో

    విలాసవంతమైన ఇంటిలో

    మీడియా కథనాల ప్రకారం.. లాస్ ఎంజెలెస్‌లోని ప్రియాంక చోప్రా జోనస్ ఇంటిలో ఏడు బెడ్రూంలు, 11 బాత్రూంలు ఉన్నాయి. అలాగే వీలైనంత ఖాళీ ప్రదేశం, అందులో చక్కటి గార్డెన్, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. ఎత్తైన ప్రదేశంలో ఉండటం వల్ల నగరాన్ని మొత్తం చేసే వీలుగా ఇంటిని కొనుగోలు చేశారు అని పేర్కొన్నారు.

    అత్యంత ఖరీదైన ఫర్నీచర్...

    అత్యంత ఖరీదైన ఫర్నీచర్...

    ప్రియాంక చోప్రా అత్యంత ఇష్టంగా లివింగ్ రూమ్‌ను డిజైన్ చేసుకొన్నారు. విదేశాల నుంచి తెప్పించిన అత్యంత ఖరీదైన ఫర్నీచర్‌‌తో అందంగా ముస్తాబు చేసుకొన్నారు. ఇంటిని వైట్, బ్రౌన్ కలర్‌తో డిజైన్ చేసుకొన్నారు. మార్బుల్, ఇతర స్టోన్స్‌తో అంగరంగవైభవంగా తీర్చిదిద్దారు అని మీడియా కథనాలను ప్రచురించింది

    20 మిలియన్ డాలర్లు వ్యయంతో

    20 మిలియన్ డాలర్లు వ్యయంతో

    లాస్ ఎంజెలెస్‌లోని ప్రియాంక తన ఇంటిని భారీగా ఖర్చు చేసి అలంకరించుకొన్నారు. ఆ ఇంటి విలువ సుమారు రూ.20 మిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో అక్షరాల .144 కోట్ల రూపాయలు. ఈ నివాసం లాస్ ఎంజెలెస్‌లోని ఎన్‌సినో ప్రాంతంలో ఉంది.

    ప్రియాంక చోప్రా వైవాహిక జీవితం గురించి

    ప్రియాంక చోప్రా వైవాహిక జీవితం గురించి


    ప్రియాంక చోప్రా వైవాహిక జీవితం విషయానికి వస్తే... 2017లో మెట్ గాలా ఈవెంట్‌లో ప్రియాంక, నిక్ కలుసుకొని ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 2018 డిసెంబర్‌లో వివాహం చేసుకొన్నారు. జోధ్‌పూర్‌లోని ఉమేద్ భవన్ ప్యాలెస్‌లో వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.

    English summary
    Bollywood and Hollywood star Priyanka Chopra Jonas's los angeles house cost and details here. Her house has seven bedrooms and eleven bathrooms. Priyanka Chopra house worth is 144 crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X