‘ఒక్క రాత్రితోనే కన్యత్వం హుష్‌కాకి .. అలాంటి భార్య కోసం ఆశపడొద్దు’
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశం దూసుకెళ్తున్నప్పటికీ ఆడపిల్లల విషయంలో ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. గౌరవ మర్యాదలు, వేతనాలు ఇలా ఎక్కడా సమానత్వం లేదు. ఇక పెళ్లిళ్ల సమయంలో స్త్రీలు ఎదుర్కొనే అవమానాలు అన్నీ ఇన్నీ కాదు. కన్యత్వ పరీక్షల పేరుతో మహిళలను వేధించే ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎంతగా అవగాహన కలిగిస్తున్నా ఈ సామాజిక దురాచారం మాత్రం భారతీయ సమాజం నుంచి పోవడం లేదు. తాజాగా కన్యత్వ పరీక్షల గురించి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా గతంలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
రెండ్రోజుల క్రితం బాలీవుడ్ సీనియర్ నటి ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. కన్యత్వం గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చాలామంది పురుషులు తమకు కాబోయే భార్య కన్యగానే ఉండాలని కోరుకుంటున్నారు. సిటీలు, పట్నాలలో బాగా చదుకువున్న వారు కూడా ఈ మనస్తత్వంతోనే ఉన్నారని నీనా గుప్తా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. గతంలో కన్యత్వం గురించి ప్రియాంక చోప్రా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి. అప్పుడు ప్రియాంక చోప్రా ఏం మాట్లాడారు? వివాదం ఏంటీ? అనేది చూస్తే

మిస్ట్ వరల్డ్ సాధించి టాప్ మోడల్‌గా సినీరంగంలో అడుగుపెట్టారు ప్రియాంక చోప్రా. తన రంగు, రూపం, నటనపై విమర్శలు వచ్చినా తట్టుకుని నిలబడ్డారు. తన నటనతోనే విమర్శలకు కళ్లెం వేయించిన ప్రియాంక.. తొలుత తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఈ తర్వాత ముంబైకి మకాం మార్చి వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌ని దక్కించుకుంది. అనతికాలంలోనే బాలీవుడ్‌లో అగ్రనటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో పాటు భారత్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సినీరంగానికి చేసిన సేవలకు గాను అతి చిన్న వయసులోనే ఏకంగా భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డ్ అందుకుని చరిత్ర సృష్టించింది ప్రియాంక చోప్రా.
బాలీవుడ్‌లో కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు అనూహ్యంగా హిందీ చిత్ర పరిశ్రమకు దూరమై హాలీవుడ్ సినిమాలలో నటించి షాకిచ్చింది ప్రియాంక చోప్రా. తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్, హాలీవుడ్ రేపర్ నిక్ జోనాస్‌తో ప్రేమలో పడి 2018లో అతనిని ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం సరోగసీ ద్వారా కుమార్తె మాల్టీకి జన్మనిచ్చారు. నిక్‌తో పెళ్లి తర్వాత అమెరికాలో స్థిరపడిన ఆమె .. లాస్ ఏంజిల్స్‌లోనే ఉంటున్నారు. బాలీవుడ్ సినిమాలను తగ్గించేసిన ప్రియాంక చోప్రా... ప్రస్తుతం తెలుగులో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న వారణాసి మూవీలో ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మందాకినీ అనే రోల్ పోషిస్తున్నారు. దీనికి సంబంధించి జక్కన్న విడుదల చేసిన పోస్టర్ వైరల్ అయ్యింది.
సినిమాలు, షూటింగ్స్‌తో పాటు వివాదాస్పద విషయాలపైనా ప్రియాంక చోప్రా గతంలో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే కన్యత్వం గురించి ఈ బ్యూటీ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అబ్బాయిలు.. వర్జిన్ అమ్మాయిని వెతకొద్దని, మంచి గుణాలు, సత్ప్రవర్తన ఉన్న అమ్మాయిని ఎంచుకోండి. ఎందుకంటే కన్యత్వం అనేది ఒక్క రాత్రిలోనే పోతుందని.. కానీ సభ్యత, సంస్కారం అనే సుగుణాలు జీవితాంతం ఉంటాయని వ్యాఖ్యానించారు. వీటిపై దుమారం రేగగా... నెటిజన్లు భగ్గుమన్నారు. దాంతో ప్రియాంక చోప్రా స్పందించింది. ఆ వ్యాఖ్యలు నేను చేయలేదని.. ఆన్‌లైన్‌లో ఉన్న విషయాలు నిజం కాదు.. ముందు ఏది వాస్తవమో? ఏది నకిలీదో అర్ధం చేసుకోవాలి. వైరల్ కావడం కోసం కల్పిత కంటెంట్ సృష్టిస్తున్నారని ప్రియాంక చోప్రా వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











