కన్యత్వం కోల్పోని భార్య కోసం వెతకొద్దు.. పురుషులకు ప్రియాంక చోప్రా సలహా

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా సినిమాలతో పాటు సామాజిక అంశాలపైనా ఎంతో యాక్టీవ్‌గా ఉంటారు. మహిళా హక్కులు, సమానత్వం, వివక్ష తదితర అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంటారు. ఏ విషయంపై అయినా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటం ఆమె స్టైల్. ఎన్ని వివాదాలు ఎదురైనా సరే ప్రియాంక మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గరు. వర్క్ లైఫ్‌ని, ఫ్యామిలీ లైఫ్‌ని ఎలా బ్యాలెన్స్ చేయాలో కూడా ఆమె పలువురికి పాఠాలు చెబుతుంటారు. కొద్దిరోజుల క్రితం కన్యత్వం గురించి ప్రియాంక చోప్రా చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ వివరాల్లోకి వెళితే..

మిస్ట్ వరల్డ్ కీరిటం సాధించి టాప్ మోడల్‌‌గా వెలుగొందుతూ సినీరంగంలో అడుగుపెట్టారు ప్రియాంక చోప్రా. ఈ స్థాయిలో ఉన్నప్పటికీ, దేశం మొత్తం గుర్తించే సెలబ్రిటీ అయినప్పటికీ తొలినాళ్లలో తన రంగు, రూపం, నటనపై విమర్శలు వచ్చినా తట్టుకుని నిలబడ్డారు ప్రియాంక. అయితే తన ప్రతిభతోనే విమర్శలకు కళ్లెం వేయించిన ప్రియాంక.. తమిళ చిత్ర పరిశ్రమ ద్వారా వెండితెరపై అడుగుపెట్టారు. అనంతరం బాలీవుడ్‌కు మకాం మార్చీ.. అనతికాలంలోనే హిందీ చిత్ర పరిశ్రమలో నెంబర్‌వన్ హీరోయిన్‌గా నిలిచారు. భారత్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా, బాలీవుడ్‌లో రిచ్చెస్ట్ హీరోయిన్‌లలో ఒకరిగా, అత్యంత ప్రభావంతమైన సెలబ్రిటీ జాబితాలో ఫోర్బ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. సినీరంగానికి చేసిన సేవలకు గాను అతి చిన్న వయసులోనే పద్మశ్రీ అవార్డ్ అందుకున్నారు ప్రియాంక.

Priyanka Chopra Jonas s Virginity Comments Spark Debate on Values and Relationships

హాలీవుడ్‌ సినిమాలలో నటించిన అతికొద్దిమంది భారతీయ హీరోయిన్లలో ఒకరిగా నిలవడమే కాదు.. ప్రస్తుతం హాలీవుడ్‌లో ప్రముఖ స్టార్‌గా వెలుగొందుతున్నారు ప్రియాంక. తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్, హాలీవుడ్ రేపర్ నిక్ జోనాస్‌తో ప్రేమలో పడి 2018లో అతనిని ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం సరోగసీ ద్వారా కుమార్తె మాల్టీకి జన్మనిచ్చారు. వీరి పెళ్లి, ప్రెగ్నెన్సీ అన్ని వివాదాస్పదమై, వివాదాలు చుట్టుముట్టినా వాటికి ధీటుగా కౌంటరిచ్చారు ప్రియాంక.

నిక్‌తో పెళ్లి తర్వాత ఇండియాకు దూరంగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో స్థిరపడిన ఆమె బాలీవుడ్‌లో అంతంత మాత్రంగానే సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న వారణాసి మూవీలో ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ఇందులో మందాకినీ అనే రోల్ పోషిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలో తెరకెక్కుతోంది. మహేశ్ - రాజమౌళీలతో పనిచేయడం గర్వంగా ఉందని.. వారణాసి కోసం తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానని ప్రియాంక పలుమార్లు తెలిపారు. 2027 ఏప్రిల్ 7న వారణాసి చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

సినిమాలతో పాటు వివాదాలతోనూ ప్రియాంక చోప్రా అంతే పాపులర్ అయ్యారు. ఈ క్రమంలోనే కన్యత్వం గురించి గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. పురుషులు.. పెళ్లి చేసుకుందుకు వర్జిన్ అమ్మాయిని వెతకొద్దని, మంచి గుణాలు, మంచి ప్రవర్తన ఉన్న అమ్మాయిని ఎంపిక చేసుకోండి. ఎందుకంటే కన్యత్వం అనేది ఒక్క రాత్రిలోనే పోతుందని.. కానీ సభ్యత, సంస్కారం అనే మంచి గుణాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయని ప్రియాంక చోప్రా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై గతంలోనే దుమారం రేగగా... నెటిజన్లు భగ్గుమన్నారు. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ప్రియాంక స్పందించారు. అసలు ఆ వ్యాఖ్యలు నేను చేయలేదని.. సోషల్ మీడియాలో ఉన్నది ప్రతీది నిజం కాదని, వైరల్ అయ్యేందుకు ఇలాంటి కల్పిత కంటెంట్‌ను సృష్టిస్తున్నారని వీటి నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రియాంక చోప్రా కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X