Oscars 2026లో అత్యంత ఖరీదైన నెక్లెస్‌తో ప్రియాంక చోప్రా డామినేషన్.. ధర ఎన్ని కోట్లో తెలుసా?

ప్రతిష్టాత్మక 98వ అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్) ప్రదానోత్సం ఆదివారం రాత్రి అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. 2025 సంవత్సరానికి గాను ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదలైన సినిమాలకు పలు కేటగిరీలలో ఆస్కార్ కమిటీ అవార్డులను ప్రకటించి అందజేసింది. ప్రపంచ సినీరంగానికే తలమానికంగా భావించే ఆస్కార్స్ కోసం ఎందరో నటీనటులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తారు. ఈ అవార్డ్స్ వేడుకను తిలకించేందుకు గాను ప్రపంచం నలుమూలల నుంచి నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్స్, ఇతర ప్రముఖులు లాస్ ఎంజిల్స్ నగరానికి తరలివచ్చారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సైతం ఆస్కార్ అవార్డు వేడుకలో సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె ధరించిన డైమండ్ నెక్లెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ నేపథ్యంలో దాని ప్రత్యేకతలు ఏంటీ? ఆ నెక్లెస్ ధర ఎంత? అనేది పరిశీలిస్తే..

98వ అకాడమీ అవార్డుల‌లో టైటానిక్ మూవీ హీరో లియోనార్డో డికాప్రియో న‌టించిన వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్ అనదర్‌ సత్తా చాటింది. ఏకంగా ఆరు కేటగిరీలలో అవార్డులను దక్కించుకుంది. ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ ద‌ర్శ‌కుడు, ఉత్త‌మ స‌హాయ న‌టుడు, అడాప్ట‌డ్ స్క్రీన్ ప్లే, బెస్ట్ క్యాస్టింగ్‌, ఎడిటింగ్ విభాగాల్లో ఈ చిత్రం ఆస్కార్స్‌ను సొంతం చేసుకుంది. ర్యాన్ కూగ్ల‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మైఖేల్ బీ జోర్డాన్ న‌టించిన‌ సిన్న‌ర్స్ మూవీకి ఉత్త‌మ న‌టుడు, ఉత్త‌మ స్క్రీన్ ప్లే, ఉత్త‌మ ఒరిజిన‌ల్ స్కోర్‌, ఉత్త‌మ సినిమాటోగ్ర‌ఫీ కేటగిరీలలో నాలుగు అవార్డు లు గెలుచుకుంది. ఇక‌ ఉత్త‌మ అంత‌ర్జాతీయ సినిమా విభాగంలో నార్వేకు చెందిన సెంటిమెంట‌ల్ వాల్యూ అవార్డు కైవసం చేసుకుంది.

Priyanka Chopra jonas Shines at Oscars 2026 with 9 Crore Bulgari Diamond Necklace

కాగా.. ఆస్కార్స్ 2026లో భారతీయ సినిమాకు నిరాశ ఎదురైంది. 98వ అకాడమీ అవార్డ్స్ కోసం సుమారు 24 సినిమాలను మనదేశం తరపున అధికారికంగా పంపించారు. ఇందులో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగానికి కొన్ని భారతీయ చిత్రాలు సైతం ఎంపికయ్యాయి. అయినప్పటికీ చివరి నిమిషంలో ఏ ఒక్క భారతీయ చిత్రం కూడా నామినేట్ కాలేదు. కాంతార చాప్టర్ 1, తన్వి ది గ్రేట్, మహావతార్ నరసింహ, టూరిస్ట్ ఫ్యామిలీ, పుష్ఫ 2, ది బెంగాల్ ఫైల్స్ వంటి సినిమాలను ఆస్కార్స్ కోసం పంపించారు.

ఇకపోతే.. ఆస్కార్ అవార్డుల్ని అందుకోవడమే కాదు.. ఆ వేడుకలను ప్రత్యక్షంగా చూడటం కూడా అంత తేలికకాదు. అధికారికంగా ఆహ్వానం ఉంటేనే అక్కడికి ఎంట్రీ. అలాంటిది పలువురు భారతీయ తారలు ఆస్కార్స్‌లో సందడి చేశారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. ఆస్కార్స్‌లో ఎన్నో ఏళ్లుగా సందడి చేస్తూ వస్తున్నారు. 2016, 2017, 2021, 2025లలో ఆమె ఆస్కార్‌లో హల్‌చల్ చేయడంతో పాటు తన చేతుల మీదుగా విజేతలకు అవార్డులను సైతం అందించారు. అలాగే రెడ్ కార్పెట్‌పై ఫోటోలకు ఫోజులు ఇవ్వడం, ప్రీ ఆస్కార్ ఈవెంట్స్‌, రోలెక్స్ ప్రీ- ఆస్కార్స్ డిన్నర్‌కు కూడా ప్రియాంక చోప్రా హాజరయ్యారు.

తాజాగా 98వ ఆస్కార్ వేడుకలకు కూడా ప్రియాంక చోప్రా హాజరై అవార్డ్‌కు ప్రెజెంటర్‌గా వ్యవహరించారు. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్‌ని ఆమె అందజేశారు. స్ట్రాప్‌లెస్ వైట్ గౌన్‌లో ప్రియాంక రెడ్ కార్పెట్‌పై తన భర్త నిక్ జోనాస్‌తో కలిసి నడుస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. నిక్.. క్లాసిక్ బ్లాక్ వెల్వెట్ టక్సేడో.. వైట్ షర్ట్, బో టైతో ఆకట్టుకున్నారు. ఇదిలాఉండగా.. ప్రియాంక చోప్రా ధరించిన డైమండ్ నెక్లెస్ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.

బుల్గారి బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు ప్రియాంక చోప్రా. ఈ కంపెనీ తయారు చేసిన ద సర్పెంటి ఇల్యూసియో హై జ్యువెలరీ నెక్లెస్‌ను ప్రియాంక ధరించారు. దీనిని తయారు చేయడానికి 1300 గంటల సమయం పట్టిందట. అలాగే 14 క్యారెట్ల నీలమణి స్పెషల్ అట్రాక్షన్‌‌గా నిలిచింది. ఇందులో డైమండ్స్, ఎమెరాల్డ్స్, ఒనిక్స్ ఎలిమెంట్స్‌ను పొందుపరిచారు. ఈ నెక్లెస్ ధర 1 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 8 కోట్ల నుంచి 9 కోట్ల రూపాయలు) పై మాటేనని అంచనా. ప్రస్తుతం ప్రియాంక చోప్రా.. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతోన్న వారణాసిలో మందాకినీగా నటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X