ప్రియాంక చోప్రా వేసుకున్న ఈ డైమండ్ నెక్లెస్ ధర ఎంతో తెలుసా?
ప్రియాంక చోప్రా అంతర్జాతీయ ఆభరణాల బ్రాండ్ బల్గారీకి బ్రాండ్ అంబాసిడర్. తాజాగా దీనికి సంబంధించి జరిగిన 140 వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొంది ప్రియాంక. అయితే ఆమె లుక్ తో పాటు అందరి కళ్ళు ప్రియాంక చోప్రా వేసుకున్న డైమండ్ నెక్లెస్ పై పడ్డాయి. దీని ధర ఎంత అనే విషయంపై ఓ లుక్కేద్దాం.ప్రియాంక ఈ ఈవెంట్ లో వైట్ అండ్ బ్లాక్ ఆఫ్ షోల్డర్ గౌను ధరించింది. అలాగే ఈ దేశీ అమ్మాయి కొత్త హెయిర్ స్టైల్ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే అంతకంటే ఎక్కువగా ఆమె మెడలోని డైమండ్ నెక్లెస్ చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు.
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కొత్త లుక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. బల్గారీ 140వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని డిన్నర్ పార్టీని ఏర్పాటు చేశారు. బల్గారీ ఏటర్నా జ్యువెలరీ కలెక్షన్ ప్రదర్శనకు కూడా ఇందులో భాగంగా నిర్వహించారు.ప్రియాంక చోప్రా గ్లామర్ లుక్ లో అదరగొట్టింది. అంతేకాదు ఖరీదైన డైమండ్ నెక్లెస్ ధరించి ఈవెంట్‌కి వచ్చింది. 140 క్యారెట్ల వజ్రాలతో కూడిన ఈ అందమైన హారాన్ని తయారు చేయడానికి దాదాపు 2,800 గంటల సమయం పట్టిందని తెలుస్తోంది.

ఈ నెక్లెస్ చాలా ఖరీదైనది. దాదాపు ఈ డైమండ్ నెక్లెస్ 320 కోట్ల విలువ ఉంటుందని తెలిసి నోరెళ్ళబెడుతున్నారు జనాలు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.పోరస్ వాటర్‌ఫ్రూఫింగ్ సమస్యల కారణంగా బాలీవుడ్ నటీమణులు ప్రియాంక చోప్రా మరియు నిక్ జోనాస్ ఈ ఏడాది ప్రారంభంలో తమ లాస్ ఏంజిల్స్ ఇంటిని ఖాళీ చేశారు. ఇటీవల, నటి తన పునర్నిర్మాణం తర్వాత దేశీ గర్ల్ హౌస్‌కి తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంది.
2018లో అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకుంది ప్రియాంక. ఇప్పుడు తన భర్త నిక్, కూతురు మాల్తీ మేరీ చోప్రా జోనాస్‌తో కలిసి హాలీవుడ్ హిల్స్ మాన్షన్‌లో నివసిస్తున్నారు. లాస్ ఏంజెల్స్‌లోని ప్రియాంక బంగ్లాలో విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి.టాప్ రిచ్ సెలబ్రిటీల లిస్ట్‌లో చేరిన ఏకైక బాలీవుడ్ నటి ప్రియాంక. ఈ జాబితాలో ఎక్కువ మంది విదేశీ సెలబ్రిటీలు ఉన్నారు. ఈ జాబితాలో కోహ్లీ, ప్రియాంక మాత్రమే చేరగలిగారు.
ఐశ్వర్యరాయ్ తర్వాత మిస్ వరల్డ్ టైటిల్ ప్రియాంక చోప్రాకే దక్కింది. ప్రియాంక చోప్రా 2000లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. ప్రియాంక కేవలం ప్లస్ టూ చదువుతో మిస్ యూనివర్స్ దాకా చేరుకుంది.హాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేస్తున్న ప్రియాంక బాలీవుడ్ లో మాత్రం సినిమాలు చేయడం లేదు. వివాహం తర్వాత ఈ బ్యూటీ పూర్తిగా అమెరికాలో స్థిరపడింది.


Click it and Unblock the Notifications











