For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిక్‌తో ప్రియాంక చోప్రా ఘాటు రొమాన్స్: ఎవరూ చేయని పని చేసి.. వాటిని చూపిస్తూ లీక్ చేసేసింది

  |

  ప్రియాంక చోప్రా.. భారతదేశంలో ఉన్న సినీ ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ దాదాపు రెండు దశాబ్దాలుగా తన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకూ ఉన్న చాలా ఇండస్ట్రీల్లో నటించి మెప్పించింది. తద్వారా చాలా ఏళ్లుగా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. ఇక, నిక్ జోనస్‌ను పెళ్లాడిన తర్వాత ప్రియాంక తీరు ఒక్కసారిగా మారిపోయింది. ఈ క్రమంలోనే వింతగా ప్రవర్తిస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా భర్తతో రొమాన్స్ చేసిన విషయం లీక్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

   ప్రపంచ సుందరిగా గెలిచిన ప్రియాంక

  ప్రపంచ సుందరిగా గెలిచిన ప్రియాంక

  చాలా చిన్న వయసులోనే మోడల్‌గా తన కెరీర్‌ను ఆరంభించింది ప్రియాంక చోప్రా. ఈ క్రమంలోనే అప్పట్లోనే ఎన్నో అందాల పోటీల్లో పాల్గొంది. అలా.. భారతదేశంలో సత్తా చాటిన ఈ బ్యూటీ.. 2000లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచింది. తద్వారా ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకుంది. అప్పట్లో ప్రియాంక వల్ల దేశం మొత్తానికి ప్రపంచ స్థాయిలో పేరొచ్చింది.

  సినిమాల్లోకి ఎంట్రీ... స్టార్ హీరోయిన్

  సినిమాల్లోకి ఎంట్రీ... స్టార్ హీరోయిన్

  ప్రపంచ సుందరిగా విజయం సాధించిన తర్వాత ప్రియాంక చోప్రాపై అన్ని ఇండస్ట్రీల కన్ను పడింది. ఈ క్రమంలోనే 2002లో ‘తమీజాన్' అనే తమిళ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా దాదాపు ఇరవై ఏళ్లుగా తన హవాను చూపిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో అవార్డులు సైతం అందుకుందీ బ్యూటీ.

  హాలీవుడ్‌లోకి ఎంట్రీ.. మారిపోయింది

  హాలీవుడ్‌లోకి ఎంట్రీ.. మారిపోయింది

  ఇండియాలో ఉన్న దాదాపు అన్ని భాషల్లోనూ నటించి మెప్పించిన ప్రియాంక చోప్రా.. చాలా కాలంగా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. అదే సమయంలో హాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని చిత్రాల్లోనూ నటించింది. అలాగే, ప్రైవేట్ ఆల్బమ్‌లు కూడా చేసింది. ఇలా అక్కడ ఉన్న సమయంలో ఆమె వ్యవహార శైలి కూడా మారిపోయింది.

   చిన్నోడితో ప్రేమలో పడిపోయి పెళ్లాడి

  చిన్నోడితో ప్రేమలో పడిపోయి పెళ్లాడి

  హాలీవుడ్‌లో బిజీగా ఉన్న సమయంలోనే ప్రియాంక చోప్రా.. తనకంటే వయసులో చిన్నోడు అయిన పాప్ సింగర్ నిక్ జోనస్‌తో ప్రేమలో పడిపోయింది. ఇలా చాలా రోజుల పాటు అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఇండియాలో వివాహం చేసుకుంది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చారు.

   పెళ్లికి ముందు నుంచే రొమాన్స్ చేసి

  పెళ్లికి ముందు నుంచే రొమాన్స్ చేసి

  వాస్తవానికి నిక్ జోనస్‌తో డేటింగ్ చేస్తున్న సమయంలోనే ప్రియాంక చోప్రా అతడితో రొమాన్స్ చేయడం ప్రారంభించింది. ఇలా చాలా సార్లు విదేశీ మీడియా కెమెరాలకు చిక్కింది. పబ్లిక్‌లోనే ముద్దులు పెట్టుకోవడం.. హగ్స్ చేసుకోవడం.. చెట్టాపట్టాలేసుకుని తిరగడం వంటివి చేయడంతో ఈ అమ్మడు అప్పట్లో అక్కడ ఫేమస్ అయింది. అలాగే ఇండియాలోనూ హాట్ టాపిక్ అయింది.

  వివాహం తర్వాత మరింత రెచ్చిపోతూ

  వివాహం తర్వాత మరింత రెచ్చిపోతూ

  నిక్ జోనస్‌ను వివాహం చేసుకున్న తర్వాత అమెరికాలో కొన్ని రోజులు, లండన్‌లో కొన్ని రోజులు ఉంటోంది. ఈ క్రమంలోనే పాశ్చాత్య సంస్కృతిని బాగా వంట పట్టించుకుంది. వింత వింత బట్టలు వేసుకోవడం.. పచ్చిగా మాట్లాడడం.. పబ్లిక్‌లోనే రొమాన్స్ చేయడం.. పర్సనల్ విషయాలు బయట పెట్టడం వంటి వాటితో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. దీంతో ఆమె పేరు మారుమ్రోగిపోతోంది.

  BA Raju : Mahesh Babu కి Loyal PRO, Tollywood Encyclopaedia || Filmibeat Telugu
   ఎవరూ చేయని పని.. వాటిని చూపిస్తూ

  ఎవరూ చేయని పని.. వాటిని చూపిస్తూ

  తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంక చోప్రా.. నిక్ జోనస్ ఫొటోను షేర్ చేసింది. అందులో అతడి తలపై ఆమె ముద్దు పెట్టింది. ఈ విషయాన్ని స్వయంగా చెబుతూ అక్కడ అంటుకున్న లిప్‌స్టిక్ గుర్తులను చూపించింది. ఇక, ఈ ఫొటోకు ‘అతడి తల మీద నా లిప్‌స్టిక్ గుర్తులు.. ఇప్పటికే మిస్ అయ్యాను' అంటూ క్యాప్షన్ పెట్టింది. తద్వారా భర్తపై ఉన్న ప్రేమను ఇలా బయట పెట్టింది.

  English summary
  Bollywood Star Actress Priyanka Chopra Recently Share a Photo in Instagram. In This Photo She Kissed Her Husband Nick Jonas Head.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X