SSMB29: హైదరాబాద్‌లో రాజమౌళి హీరోయిన్ ల్యాండింగ్.. మహేష్‌తో రొమాన్స్ కోసం అందాల బొమ్మ
SSMB 29: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు - క్రియేటివ్ డైరెక్టర్ రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న మూవీ SSMB 29. ఈ మూవీకి ఇంకా పేరు పెట్టకపోయినా.. SSMB 29గా ఫేమస్ అయిపోయింది. గ్లోబల్ మూవీ కోసం యావత్తు సినీ ప్రపంచం ఎదురు చూస్తుంది. యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెగ వైరలవుతోంది. ఈ మూవీ కోసం లాస్ ఎంజెల్స్ నుంచి హైదరాబాద్ కు రాజమౌళి హీరోయిన్ చేరుకుందట. ఇంతకీ మహేష్‌తో రొమాన్స్ కోసం అందాల తార ఎవరో ఓ లూక్కేయండి.
సాధారణంగానే రాజమౌళి మూవీ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. అది కూడా సూపర్ స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి కాంబో మూవీ అంటే.. భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి, మహేష్ బాబు చిత్రం ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ చిత్రంగా తెరకెక్కనుంది. ఆఫ్రికన్ రచయిత విల్బర్ స్మిత్ రచించిన నవల ఆధారంగా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సాహస వీరుడిగా కనిపిస్తారు. ఈ సినిమా కోసం మహేష్ తన లూక్‌ని మార్చేశారు. పొడవాటి జుట్టుతో జుంపాలు పెంచుకుని.. చాలా హాండ్‌సమ్‌గా కనిపిస్తున్నారు.

ప్రియాంక చోప్రా హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించింది. ప్రియాంక క్యాజువల్ లుక్‌లో కనిపిస్తుంది. గ్రే కలర్ హూడీ, లాంగ్ వేర్ ధరించింది. దీంతో పాటు ఒక టోపీని కూడా పెట్టుకుంది. ప్రియాంక విమానాశ్రయం నుండి బయట వస్తుండగా ప్రియాంక మీడియా కంటబడింది. ఈ సమయంలో ఫోటోల కోసం అభిమానులు ఎగబడ్డారు. కానీ ప్రియాంక ఆగకుండా నవ్వుతూ వెళ్లిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. బాబాల్ విజయం తర్వాత ప్రియాంక తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ రాజమౌళి SSMB29కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రాజమౌళి, మహేష్ బాబుల కాంబో మూవీ SSMB29 కోసం గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా లాస్ ఏంజిల్స్ నుంచి హైదరాబాద్ కి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ మూవీలో మహేశ్ బాబు సరసన నటించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించి పూజ గత రెండు వారాల క్రితమే జరిగింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్నాయి. ఇక రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గత ఆరు నెలలుగా ఈ సినిమా గురించి ప్రియాంక్, రాజమౌళి మధ్య చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. SSMB29 లో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా సెలక్ట్ చేసినట్టు తెలుస్తోంది. కానీ, ఇప్పటి వరకు ఈ విషయంలో క్లారిటీ రాలేదు.
ఇదెలా ఉంటే... ఇక SSMB29 సినిమా షూటింగ్ ఆఫ్రికా సహా ప్రపంచంలోని పలు దేశాలలో షూటింగ్ చేయబోతున్నారంట. అలాగే.. రాజమౌళి ఈ చిత్రాన్ని గ్లోబల్ స్థాయిలో 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భారీ బడ్జెట్ మూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే.. మరోవైపు మళయాల స్టార్ యాక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడుగా గా నటిస్తున్నాడనే టాక్ నడుస్తోంది. అలాగే.. ఈ సినిమాను రెండు పార్ట్స్‌లో విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్ట్ 1 2027లో, పార్ట్ 2 -2029లో రాబోతున్నట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.


Click it and Unblock the Notifications











