స్విమ్మింగ్ పూల్‌లో రెచ్చిపోయిన ప్రియాంక: అబ్బో తడిచిన అందాలను చూపిస్తూ!

చాలా భాషల సినిమాల్లో నటించి.. సుదీర్ఘ కాలం పాటు ఇండియాలోనే టాప్ హీరోయిన్‌గా వెలుగొంది.. ఆ తర్వాత హాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చి గ్లోబర్ స్టార్‌గా పేరు తెచ్చుకుంది ప్రియాంక చోప్రా. చిన్న వయసులోనే తన అందంతో ప్రపంచాన్ని గెలిచిన ఈ సుందరాంగి.. ఆ తర్వాత సినిమాల్లో ఓ వెలుగు వెలిగింది. ఈ క్రమంలోనే అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత సినిమాల పరంగా స్పీడు తగ్గించేసింది. కానీ, పర్సనల్ లైఫ్‌ను మాత్రం విపరీతంగా ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రియాంక చోప్రా ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దానిని మీరూ చూసేయండి మరి!

మిస్ వరల్డ్.. సినిమాల్లోనూ సత్తా

మిస్ వరల్డ్.. సినిమాల్లోనూ సత్తా


టీనేజ్‌లోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిన ప్రియాంక చోప్రా.. 2000లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని విన్నర్‌గా నిలిచింది. తద్వారా ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడు సినిమాల్లోకి వచ్చింది. అలా చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా హవా చూపిస్తూ దూసుకెళ్తోంది.

హాలీవుడ్ ఎంట్రీ... లవ్‌లో పడి

హాలీవుడ్ ఎంట్రీ... లవ్‌లో పడి


ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లోనే కాకుండా చాలా భాషల్లో సినిమాలు చేసింది. ఆ తర్వాత హాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఈ భామ పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని ఆంగ్ల చిత్రాలు, ప్రైవేట్ ఆల్బమ్‌లను చేసింది. తద్వారా గ్లోబల్ స్టార్‌గా ఎదిగిపోయింది. అదే సమయంలోనే ప్రియాంక చోప్రా.. తన కంటే చిన్నోడైన అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌తో ప్రేమలో పడిపోయింది.

 పెళ్లి తర్వాత పద్దతి మార్చేస్తూ

పెళ్లి తర్వాత పద్దతి మార్చేస్తూ


చాలా కాలం పాటు నిక్ జోనస్‌తో డేటింగ్ చేసిన తర్వాత 2018 డిసెంబర్‌లో ప్రియాంక చోప్రా అతడిని వివాహం చేసుకుంది. వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చారు. వివాహం తర్వాత ప్రియాంక పూర్తిగా తన పద్దతిని మార్చుకుంది. ఈ క్రమంలోనే ఫారెన్ కల్చర్‌ను అలవాటు చేసుకున్న ఈ భామ.. విమర్శలపాలు అవుతోంది.

విడాకులు కాదు.. తల్లైన భామ

విడాకులు కాదు.. తల్లైన భామ


పెళ్లి తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉంటోన్న ప్రియాంక, నిక్.. విడాకులు తీసుకోబోతున్నారన్న వార్త ఒకటి ఆ మధ్య ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. దీనికి కారణం ప్రియాంక.. తన సోషల్ మీడియా ఖాతాల్లో నిక్ పేరును తొలగించడమే. ఆ తర్వాత వాటిని ఖండించడంతో పుకార్లకు పుల్‌స్టాప్ పడింది. ఇక, ప్రియాంక సరోగసి ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చి అందిరికీ షాకిచ్చింది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ


చాలా కాలం పాటు వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నా.. ఈ మధ్య కెరీర్‌కు గ్యాప్ ఇస్తూ ఖాళీగా ఉన్నా ప్రియాంక చోప్రా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ తరచూ హైలైట్ అవుతోంది.

అందాలను ఆరబోస్తూ రచ్చ

అందాలను ఆరబోస్తూ రచ్చ


ఎంతో మంది హీరోయిన్ల కంటే ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో మరింత ఎక్కువగా రచ్చ చేస్తుంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తన ఫొటోలు, వీడియోలు నిత్యం షేర్ చేస్తుంటుంది. వీటిలో ఎక్కువ శాతం అందాలు ఆరబోస్తూ దిగినవే ఉంటాయి. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన ఫొటోలు, రొమాంటిక్ పిక్స్‌తో కాక రేపుతూ ఉంటోంది.

స్విమ్మింగ్ పూల్‌లో బికినీతో

స్విమ్మింగ్ పూల్‌లో బికినీతో


సోషల్ మీడియాలో ఎంతో కాలంగా సందడి చేసే ప్రియాంక చోప్రా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె స్విమ్మింగ్ పూల్‌లో బికినీ మాత్రమే ధరించి ఘాటు ఫోజులు ఇచ్చింది. ఫలితంగా తడిచిన దేహంలో ఆమె అందాలన్నీ చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ప్రియాంక షేర్ చేసిన ఈ ఫొటో తక్కువ టైంలోనే వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X