For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Priyanka Chopra రేర్ ఫోటో వైరల్.. రొమాంటిక్‌గా భర్తతో కలిసి అందాల ఆరబోత

  |

  ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ దంపతులు పెళ్లి తర్వాత కూడా ప్రేమ పక్షుల మాదిరిగా రొమాంటిక్ జీవితాన్ని గడుపుతుండటం అభిమానులను కేక పెట్టిస్తున్నది. వివాహం తర్వాత కెరీర్‌ను, ఫ్యామిలీ లైఫ్‌ను, అలాగే తల్లిగా కొత్త బాధ్యతలతో జీవితాన్ని బాలెన్స్ చేస్తూ కనిపిస్తున్నది. అయితే ప్రియాంకపై తరగని ప్రేమను నిక్ జోనస్ సోషల్ మీడియాలో తరచు చూపిస్తుంటాడు. పార్టీలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు ఫీల్‌గుడ్ మూమెంట్స్ పంచుతుంటారు. తాజా నిక్ జోనస్ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోటో వివరాల్లోకి వెళితే..

  కూతురు మల్టీ మేరి బర్త్ డే

  కూతురు మల్టీ మేరి బర్త్ డే

  ప్రియాంక చోప్రా దంపతులు ఇటీవల కాలంలో చాలా ఎమోషనల్‌గా కనిపిస్తున్నారు. తమ ఇంటికి కూతురు రావడంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. నెలలు తిరగకుండా పుట్టిన బిడ్డను చాలా నెలలు హాస్పిటల్‌లోనే పెట్టారు. చిన్నారి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఇటీవల ఇంటికి తీసుకొచ్చి పెద్ద సెలబ్రేషన్ నిర్వహించారు. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ దంపతులు తమ కుమార్తె మల్టీ మేరి ఆరు నెలల పుట్టిన రోజును ఘనంగా జరుపుకొన్నారు. మెక్సికోలో జరిగిన బర్త్ డే సెలబ్రేషన్‌లో బాలీవుడ్ నటి, సోదరి పరిణితి చోప్రా, ప్రియాంక తల్లి మధు చోప్రా పాలుపంచుకొన్నారు.

  ప్రియాంక చోప్రా 40వ బర్త్ డే

  ప్రియాంక చోప్రా 40వ బర్త్ డే

  అదే జోష్‌లో ప్రియాంక చోప్రా తన 40వ బర్త్ డేను ఘనంగా జరుపుకొన్నారు. ఈ బర్త్ డే సెలబ్రేషన్‌కు భారీగా స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు. ఈ బర్త్ డే వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో వైలర్ అయ్యారు. ఈ సందర్భంగా తన భార్యపై ప్రేమను కురిపిస్తూ ఇప్పటి వరకు ఎవరూ చూడని ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటో ప్రస్తుతం అభిమానులను విశేషంగా ఆకట్టుకొంటున్నది.

  ప్రియాంకను గాఢంగా కౌగిలించుకొని

  ప్రియాంకను గాఢంగా కౌగిలించుకొని

  ప్రియాంక చోప్రాపై ఉన్న లవ్‌ను వ్యక్తీకరిస్తూ వెనుక నుంచి గాఢం కౌగిలించుకొన్నాడు. వారిద్దరు కెమెరాకు రొమాంటిక్‌గా ఫోజిచ్చారు. ఈ ఫోటోలో ప్రియాంక చోప్రా మరింత అందంగా కనిపించారు. ఎద అందాలను బహిర్గతం చేస్తూ హాట్‌గా కనిపించింది. అయితే అందాల ప్రదర్శనతోపాటు సిగ్గుతో కూడా కనిపించింది. ఈ ఫోటోకు ఎరుపు రంగు డ్రస్సులో నా ప్రియురాలు అని కామెంట్ పెట్టాడు. నిక్ జోనస్ పెట్టిన ఫోటో క్యాప్షన్‌కు మంచి స్పందన లభిస్తున్నది.

  రెడ్ డ్రస్‌లో ప్రియాంకపై భారీగా కామెంట్స్

  రెడ్ డ్రస్‌లో ప్రియాంకపై భారీగా కామెంట్స్

  రెడ్ డ్రస్‌లో ప్రియాంక చోప్రా, డిజైనర్ దుస్తుల్లో నిక్ జోనస్ ఉన్న ఫోటోపై నెటిజన్లు భారీగా కామెంట్లు గుప్పిస్తున్నారు. ఫోటో చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. రేర్ ఫోటో అంటూ కామెంట్ చేస్తున్నారు. మీరిద్దరు హాట్ కపుల్. రెడ్ డ్రస్‌లో మీరు స్టన్నింగ్‌గా ఉన్నారు. మీరు దేవతలా కనిపిస్తున్నారు. మీరు వేసుకొన్న ఎరుపు రంగును చూసి వేరే కలర్స్ కుళ్లుకొంటున్నాయి అని కామెంట్ల వర్షం కురిపించారు. ఈ ఫోటో పోస్టు చేసిన కొద్ది సేపట్లోనే 8 లక్షల లైక్స్ రావడం విశేషం.

  Recommended Video

  బాక్స్ ఆఫీస్ యుద్ధం లో బింబిసారుడు గెలిచాడా లేదా *Reviews | Telugu OneIndia
  ప్రియాంక చోప్రా హాలీవుడ్, బాలీవుడ్ కెరీర్

  ప్రియాంక చోప్రా హాలీవుడ్, బాలీవుడ్ కెరీర్

  ప్రియాంక చోప్రా కెరీర్ విషయానికి వస్తే.. చేతినిండా భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. కెప్టెన్ అమెరికా ఫేమ్ ఆంథోని మాకీ‌తో కలిసి ఎండింగ్ థింగ్స్ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నది. అలాగే ఇట్స్ ఆల్ కమింగ్ బ్యాక్ చిత్రంలో కూడా నటిస్తున్నది. అలాగే ఫరాన్ అక్తర్ రూపొందించే జీ లే జరా అనే చిత్రంలో ఆలియా భట్, కత్రినా కైఫ్‌తో కలిసి నటిస్తున్నది. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్తుంది. సిటాడెల్ అనే చిత్రంతో ఓటీటీలోకి అడుగుపెడుతున్నది.

  English summary
  Actress Priyanka Chopra husband Nick Jonas dropped unseen photo. He wrote in Instagram that My Lady in Red.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X