twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియాంక చోప్రా‌కు రికార్డుస్థాయి రెమ్యునరేషన్.. కళ్లు చెదిరే రాజభవనం, కార్ల విలువ తెలిస్తే షాకే!

    |

    బాలీవుడ్‌లో అగ్ర తారగా గొప్ప అవకాశాలు అందుకొంటున్న సమయంలో అందరికీ షాక్ ఇస్తూ హాలీవుడ్‌లో ప్రవేశించింది. ఆ తర్వాత అందరి అంచనాలను తలకిందులు చేస్తూ హాలీవుడ్‌లో సత్తా చాటుకొన్నారు. ప్రస్తుతం అమెరికాలోని అందాల తారల్లోనే కాకుండా టాలెంటెడ్ యాక్టర్లలో ఒకరిగా ప్రశంసలు అందుకొంటున్నారు. అయితే ఇటీవల కాలంలో ప్రియాంక చోప్రా నికర ఆస్తులు, రెమ్యునరేషన్ విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఆ వివారాల్లోకి వెళితే..

    బాలీవుడ్ బ్యూటీ డైసీ షా.. గ్లామరస్ బ్యూటీ స్టైలిష్ లుక్ (ఫోటో గ్యాలరీ)

     బేవాచ్ సిరీస్ కోసం రెమ్యునరేషన్

    బేవాచ్ సిరీస్ కోసం రెమ్యునరేషన్

    హాలీవుడ్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ చూరగొన్న బేవాచ్ సిరీస్‌తో ప్రియాంక చోప్రా అంతర్జాతీయ సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఒక్కో సిరీస్‌కు రూ.3 కోట్ల పారితోషికాన్ని తీసుకొన్నట్టు సమాచారం. 2015 నుంచి అమెరికాలోనే ఉంటూ క్వింటాకో లాంటి సిరీస్‌లో సత్తా చాటుకొన్నారు. ఆ తర్వాత ఆమె నటించిన హాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాలు టెక్ట్స్ ఫర్ మీ, మాట్రిక్స్ 4 చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి.

    బాలీవుడ్‌లో అత్యధికంగా 12 కోట్లు

    బాలీవుడ్‌లో అత్యధికంగా 12 కోట్లు

    హాలీవుడ్‌లో నటిస్తూనే బాలీవుడ్ చిత్రాలపై కూడా ప్రియాంక చోప్రా దృష్టిపెట్టారు. 2019 నాటికి సినీ వర్గాలు పేర్కొన్న ప్రకారం.. ప్రతీ సినిమాకు 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ను తీసుకొన్నారు. అప్పట్లో బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకొనే హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా ఓ ఘనతను సొంతం చేసుకొన్నారు.

    నిర్మాతగా కూడా సక్సెస్‌ఫుల్

    నిర్మాతగా కూడా సక్సెస్‌ఫుల్

    ప్రియాంక చోప్రా నటిగా రాణిస్తూనే నిర్మాతగా కూడా 2015లో తన అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు. పర్పుల్ పెబెల్ పిక్చర్స్ (PPP) పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి వెంటిలేటర్ అనే చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రాన్ని రూ.3.5 కోట్లతో రూపొందించగా, దాదాపు రూ.35 కోట్లకుపైగా లాభాలను సాధించిపెట్టింది.

    ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా

    ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా

    నిర్మాతగా మొదటి సినిమాతోనే లాభాలను సొంతం చేసుకొన్న ప్రియాంక చోప్రా తానే హీరోయిన్‌గా జైరా వసీం, ఫరాన్ అఖ్తర్‌తో ది స్కై ఈజ్ పింక్ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి మూడు ఫిలింఫేర్ అవార్డులు దక్కించుకోవడమే కాకుండా దాదాపు రూ.50 కోట్ల నికర వసూళ్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి.

    లాస్ ఏంజెలెస్‌లో ఖరీదైన ఇల్లు

    లాస్ ఏంజెలెస్‌లో ఖరీదైన ఇల్లు

    ఇలా నటిగా, నిర్మాతగా టాప్ గేర్‌లో దూసుకెళ్తున్న ప్రియాంక చోప్రా ఇటీవలే లాస్ ఎంజెలెస్‌లో అద్బుతమైన భవనాన్ని రూ.144 కోట్లతో కొనుగోలు చేసింది. అంతేకాకుండా బుంబల్ అనే డేటింగ్ యాప్‌లో బిజినెస్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇలా తన సంపాదనను పెట్టుబడిగా మారుస్తున్నారు.

    14 లక్షలతో కాస్ట్యూమ్స్

    14 లక్షలతో కాస్ట్యూమ్స్

    వ్యక్తిగత ఖరీదైన ఆభరణాలు, విలాసవంతమైన వస్తువులను కొనడంలో ప్రియాంక చోప్రా ఎప్పుడు ముందుంటారు. రూ.14 లక్షల జాకెట్‌ను, 7 లక్షల రూపాయల విలువైన హ్యాండ్ బ్యాగ్‌ను కొనుగోలు చేయడం విశేషంగా మారింది. ఇాంటి వస్తువులు ప్రియాంక వద్ద లెక్కకు మించి ఉన్నాయని ఆమె సన్నిహితులు చెప్పుకొంటారు.

    Recommended Video

    Harbhajan Singh Says Yes For Ranveer Singh, Geeta Basra Disagrees
    విలాసవంతమైన కార్లతో ప్రియాంక

    విలాసవంతమైన కార్లతో ప్రియాంక

    ఇక ఖరీదైన, విలాసవంతమైన వాహనాలు కూడా ప్రియాంక చోప్రా వద్ద చాలానే ఉన్నాయి. ఇటీవల కోటి రూపాయల విలువైన మెర్సిడెజ్ బెంజ్ కారును కొనుగోలు చేశారు. అలాగే ఓ బీఎండబ్ల్యూ 5 సిరీస్, మెర్సిడెజ్ ఎస్ క్లాస్, ఆడి క్యూ7, 1360 ఫోర్డ్ థండర్‌బర్డ్, 1968 ఫోర్డ్ మస్టాగ్, షెవర్లేట్ కమరో లాంటి విలాసవంతమైన కార్లు ఎన్నో ఉన్నాయి.

    English summary
    Hollywood and Bollywood actress Priyanka Chopra Net Worth become talk of the industry as per 2021 record, She was one of the richest actress in the Hollywood. Priyanka bought house in Los Angeles house costs Rs.144 crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X