Priyanka Chopra Net Worth: ఖరీదైన బంగ్లాలు, కార్లు, ప్రియాంక చోప్రా ఆస్తి ఎన్ని వందల కోట్లంటే?
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి మూవీ లవర్స్‌కి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆమెకు గుర్తింపు ఉంది. ఇండియాతో పాటు హాలీవుడ్‌లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే స్టార్స్‌లో ప్రియాంక చోప్రా కూడా ఒకరు. ఆమె కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోగా.. స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. రెమ్యునరేషన్, సంపద విషయంలో మేల్ సూపర్‌స్టార్స్ కూడా ప్రియాంక దరిదాపుల్లో లేరు. ఆ వివరాల్లోకి వెళితే..
హిందీలో కాకుండా తమిళ సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన ప్రియాంక చోప్రా.. ఆ తర్వాత బాలీవుడ్‌లో వరుస అవకాశాలను అందుకున్నారు. అతి తక్కువ కాలంలోనే తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్లారు. తన సినిమాలతోనే కాకుండా పెళ్లితోనూ ప్రియాంక చోప్రా సంచలనం సృష్టించారు. తనకంటే పదేళ్లు చిన్నవాడైన హాలీవుడ్ రేపర్ నిక్ జోనాస్‌ను 2018లో ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం సరోగసీ ద్వారా కుమార్తె మాల్టీకి జన్మనిచ్చారు.

ముంబై నుంచి లాస్ ఏంజెల్స్‌కు మకాం మార్చిన ప్రియాంక దాదాపుగా ఇండియన్ ఇండస్ట్రీని వదిలిపెట్టేసింది. పలు వెబ్ సిరీస్‌లలో ప్రియాంక నటించింది. చాలా రోజుల తర్వాత మరాఠీలో తెరకెక్కిన పానీ మూవీలో ప్రియాంక చోప్రా నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్లోబల్ స్టార్‌గా అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ సంపాదించిన ఆమె భారత్‌లో రిచెస్ట్ హీరోయిన్‌లలో ఒకరిగా నిలిచారు.
సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా కోట్లలో ఆర్జిస్తున్న ప్రియాంకా చోప్రా.. తన సంపాదనను తెలివిగా పెట్టుబడులుగా మళ్లిస్తున్నారు. 42 ఏళ్ల ప్రియాంక .. ఒక నిమిషం స్క్రీన్‌పై కనిపించినందుకు రూ.4.5 కోట్ల చొప్పున వసూలు చేస్తారు. ఒక్కో బ్రాండ్ అండార్స్‌మెంట్‌కు రూ.5 నుంచి రూ.10 కోట్లు ఛార్జ్ చేస్తారు. పాపులర్ డేటింగ్ యాప్ బంబుల్, హోలబర్టన్ స్కూల్ అనే కోడింగ్ స్టార్టప్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారట ప్రియాంక. ఇవి కాక మరిన్ని కంపెనీలలో ఆమె రూ.కోట్లలో ఇన్వెస్ట్ చేసినట్లుగా బాలీవుడ్ టాక్.

ప్రియాంక చోప్రాకు ముంబైలో 9, గోవాలో 3, న్యూయార్క్‌లోని మన్‌హట్టన్‌లో ఒకటి చొప్పున విలాసవంతమైన భవనాలు ఉన్నాయట. గోవాల్ సీ ఫేస్ బంగ్లా విలువ రూ.50 కోట్ల పైనే ఉంటుందని అంచనా. ప్రస్తుతం తన భర్త నిక్ జోనాస్‌తో కలిసి కాలిఫోర్నియాలోని బ్రేవరీ హిల్స్‌లో ఓ లగ్జరీ విల్లాలో నివసిస్తున్నారు. దీని విలువ రూ.80 నుంచి రూ.100 కోట్ల వరకు ఉంటుందని బీటౌన్ టాక్.
ప్రియాంక చోప్రా వద్ద రోల్స్ రాయస్ ఘోస్ట్, మెర్సిడెస్ బెంజ్ ఈ క్లాస్ , బీఎండబ్ల్యూ 7 సిరీస్, పోర్షే కేనిన్ వంటి కోట్ల రూపాయల విలువైన కార్లు ఉన్నాయట. మొత్తంగా ప్రియాంక చోప్రా ఆస్తుల విలువ రూ.450 - రూ.500 కోట్ల మధ్యలో ఉంటుందని అంచనా. గడిచిన పదేళ్ల కాలంలో ఆమె ఆస్తులు, సంపద విలువ భారీగా పెరిగిందని సినీ క్రిటిక్స్ అంటారు. తద్వారా అత్యధిక ఆస్తులున్న ఇండియన్ సూపర్‌స్టార్స్‌లో ఒకరిగా ప్రియాంక చోప్రా వెలుగొందుతున్నారు.


Click it and Unblock the Notifications











