భర్తతో కలిసి సరికొత్త ఘనత సాధించిన ప్రియాంక చోప్రా
పీపుల్ మ్యాగజైన్ బుధవారం ప్రచురించిన 2019 బెస్ట్ డ్రెస్సడ్ జాబితాలో ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ టాప్ పొజిషన్లో నిలిచారు. ఇందులో చోటు దక్కించుకున్న తొలి జంట కూడా వీరే. ఈ మాజీ విశ్వసుందరి కేవలం బాలీవుడ్‌లో మాత్రమే కాదు, హలీవుడ్ సర్కిల్‌లోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు అనడానికి ఇదొక ఉదాహరణ.
''వారు ఇద్దరూ కలిసి ఓల్డ్ హాలీవుడ్ కళాసౌందర్యాత్మకతను సృష్టించారు. వారి ఫ్యాషన్ దుస్తుల ఎంపిక చాలా భిన్నంగా ఉంటుంది.'' అని చోప్రా స్టైలిస్ట్ మిమ్మి కట్రెల్ వెల్లడించినట్లు పీపుల్ మేగజైన్ పేర్కొంది. "వారి వ్యక్తిగతమైన స్టైల్ కూడా భిన్నంగా ఉంటుంది. అందుకే పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించుకున్నారు." అని నిక్ స్టైలిస్ట్ అవో యెర్మాగ్యాన్ అన్నారు.
తమకు ఈ స్థానం దక్కడంపై ప్రియాంక చోప్రా ఆనందం వ్యక్తం చేశారు. ప్రియాంక వల్లే ఇది సాధ్యమైందని నిక్ పేర్కొన్నారు. కాగా ఈ జాబితాలో వీరిద్దరి తరువాత సెలిన్ డియోన్, జెన్నిఫర్ లోపెజ్, జెండయా, లేడీ గాగా, సెరెనా విలియమ్స్ తదితరులు ఉన్నారు.

ప్రియాంక చోప్రా సినిమాల విషయానికొస్తే... 2016లో వచ్చిన 'జై గంగాజల్' ఆమె నటించిన చివరి బాలీవుడ్ చిత్రం. ఆ తర్వాత ఆమె హాలీవుడ్ చిత్రాల్లో బిజీ అయ్యారు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత 'ది స్కై ఈజ్ పింక్' చిత్రం ద్వారా హిందీ చిత్రసీమలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. గతేడాది డిసెంబర్లో ప్రియాంక-నిక్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











