twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాపై కూడా లైంగిక దాడులు.. ఇప్పుడు తాకి చూడండి.. అణగదొక్కే దమ్ముందా? ప్రియాంక చోప్రా

    |

    బాలీవుడ్‌లో గత కొద్దికాలంగా కొనసాగుతున్న మీ టూ ఉద్యమానికి అందాల తార ప్రియాంకా చోప్రా మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. తనుశ్రీ దత్తా లైంగిక ఆరోపణలు చేసిన తర్వాత తొలిసారి ఈ ఉద్యమానికి మద్దతు తెలిపింది ప్రియాంక చొప్రా అనే విషయం తెలిసిందే. తాజాగా తన ఇన్స్‌టాగ్రామ్ పేజ్‌లో మహిళను నమ్మండి (బీలీవ్ ఉమెన్) అంటూ మెసేజ్ పెట్టింది. ఈ సందర్భంగా తాను కూడా లైంగిక వేధింపుల బాధితురాలినే అని వెల్లడించింది. వివరాల్లోకి వెళితే..

     మహిళలపై లైంగిక దాడులు కామన్

    మహిళలపై లైంగిక దాడులు కామన్

    అన్ని రంగాల్లో మహిళలపై లైంగిక ఆరోపణలు రావడం సర్వసాధారణంగా మారింది. ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు సినీ పరిశ్రమలో బలం చేకూరుతుంది. ఇలాంటి చేష్టలకు ముగింపు పలికేందుకు మీ టూ అనే మార్గం లభించింది. ఇప్పుడు మా బాధలు చెప్పుకోవడానికి ఓ గొంతుక దొరికింది అని ప్రియాంక చోప్రా అభిప్రాయపడ్డారు.

     మీటూ తర్వాత పరిస్థితి మారింది

    మీటూ తర్వాత పరిస్థితి మారింది

    లైంగిక వేధింపులకు గురైన వారిలో ఐక్యత రావడంతో మమ్మల్ని అణగదొక్కడానికి ఎవరికీ వీలు కావడం లేదు. మమ్మల్ని ఇప్పుడు తాకే పరిస్థితి కూడా లేదు. మీ టూ ఉద్యమం వల్ల మేము బలమైన శక్తిగా అవతరించాం. నాకే అన్యాయం జరిగితే ఇప్పుడు బాధపడనక్కర్లదు. ఇప్పుడు నాకు చాలా మంది అండగా ఉన్నారు. నాపై ఎవరైనా వేధింపులకు పాల్పడితే సిగ్గుపడే అవకాశం లేదు అని ప్రియాంక చెప్పారు.

    ఇక లైంగిక వేధింపులు కనిపించొద్దు

    ఇక లైంగిక వేధింపులు కనిపించొద్దు

    ఉమెన్ ఇన్ వరల్డ్ సమ్మిట్ 2019 సదస్సుకు హాజరైన ఆమె మాట్లాడుతూ.. మహిళలకు అండగా నిలుస్తానని చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ఓ గదిలో ఎవరో ఒక్కరు తప్పకుండా వేధింపులకు గురై ఉంటారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు. ప్రస్తుతం నీ ప్రొఫెషన్‌లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ మార్పు మహిళలకు బలంగా కనిపిస్తున్నది అని ప్రియాంక చోప్రా అభిప్రాయపడ్డారు.

     పెళ్లి తర్వాత మరింత జోష్

    పెళ్లి తర్వాత మరింత జోష్

    ప్రియాంక చోప్రా వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయానికి వస్తే.. నిక్ జోనస్‌తో వివాహం తర్వాత విదేశాల్లో జోష్‌ను కొనసాగిస్తున్నారు. కుటుంబ కార్యక్రమాల్లో బిజీగా ఉంటూనే కెరీర్‌పై మరింత దృష్టిపెట్టారు. హాలీవుడ్ టెలివిజన్, సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. పలు కొత్త ప్రాజెక్టులు ఇంకా అంగీకరించాల్సి ఉంది.

    English summary
    when Tanushree Dutta opened the gates of #MeToo movement in India, Priyanka Chopra Jonas was first of the Bollywood celebrities who supported her on social media. At the recently held Women in World Summit 2019 in New York, Priyanka Chopra Jonas opened up about facing sexual harassment at one point of time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X