Varanasi: అదే నాకు పెద్ద ఛాలెంజ్.. ఆ విషయంలో రాజమౌళి సాయం: ప్రియాంక చోప్రా
Varanasi: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు- దర్శకధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ వారణాసి. ప్రస్తుతం ఈ మూవీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. టైటిల్ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రతి చిన్న అప్‌డేట్ వైరల్ అవుతుండగా, అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఈ ప్రాజెక్ట్‌ను ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇండస్ట్రీ సెలబ్రిటీలు సైతం 'వారణాసి' విశేషాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తాజాగా హీరోయిన్ ప్రియాంక చోప్రా చేసిన కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే?
ఈ సినిమాలో మహేష్ బాబు 'రుద్ర' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్‌గా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన విలన్ పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ భారీ స్టార్ కాస్టింగ్‌తో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు ఖాయమనే అంచనాలు వినిపిస్తున్నాయి. రాజమౌళి తండ్రి కేవీ విజయేంద్ర ప్రసాద్ అందించిన కథ ఆధారంగా 'వారణాసి'ను గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందిస్తున్నారు. ముఖ్యంగా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంతో సాగే కీలక ఎపిసోడ్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయట. భారత్‌తో పాటు అమెరికా, యూరప్, ఆఫ్రికాలోని పలు లొకేషన్లలో షూటింగ్ జరగనుండగా, అంతర్జాతీయ టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నారు.

తాజాగా వారణాసి మూవీ టీం అంతర్జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ.. తెలుగు రాకపోయినా వారణాసి సినిమాలో నటించడం తనకు పెద్ద ఛాలెంజ్‌గా మారిందని నిజాయితీగా చెప్పుకొచ్చారు. 'నిజం చెప్పాలంటే ఇంకా నేను తెలుగు నేర్చుకుంటున్నానని కూడా చెప్పలేను. డైలాగ్స్‌ను అక్షరాలా గుర్తుపెట్టుకుని (phonetic) పలుకుతున్నాను. తెలుగు నాకు అర్థం కాదు, మాట్లాడటం కూడా రాదు,'అని ఆమె స్పష్టం చేశారు.ఇంప్రొవైజేషన్ సీన్స్ వచ్చేటప్పుడు కష్టాలు మరింత పెరుగుతాయని ప్రియాంక వెల్లడించారు. తనతో పాటూ తన తోటి నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ కు కూడా తెలుగు రాదని, కానీ తనకంటే అతనే బెటర్ అని ఆమె చెప్పారు.
'సెట్‌లో ఒక్కసారిగా డైలాగ్ మార్చాల్సి వస్తే... అది నా మాతృభాష కాకపోవడంతో వెంటనే స్పందించడం చాలా కష్టం. అప్పుడు పూర్తిగా రాజమౌళి సర్ మీదే ఆధారపడాల్సి వస్తుంది'అని చెప్పారు. ఈ ప్రాసెస్‌లో రాజమౌళి తనకు పెద్ద సపోర్ట్ అని ప్రియాంక చెప్పింది. 'ప్రతి డైలాగ్ అర్థం ఏంటి, ఏ టోన్‌లో చెప్పాలి అన్నది ఆయన వివరంగా చెబుతారు. ముఖ్యంగా ఇంప్రొవైజేషన్ ఉంటే దాదాపు పది నిమిషాలు తీసుకుని మాటల అర్థం, భావం అర్థం చేసుకుని... తర్వాత నా స్టైల్‌లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది అదనపు పెర్ఫార్మెన్స్ లేయర్ లాంటిది' అని వివరించారు. ఇది అంత ఈజీ కాదని అంగీకరిస్తూనే, 'కానీ నాకు ఛాలెంజెస్ అంటే ఇష్టం. అదే ఈ జర్నీలో ఆసక్తికరమైన భాగం' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
మరోవైపు 'వారణాసి' రెండు భాగాలుగా ఉండబోదని, ఒక్క పార్ట్ మూవీగానే వస్తుందని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. సినిమా నిడివి సుమారు మూడు గంటలు ఉంటుందని కూడా వెల్లడించారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం... ఈ సినిమాను దాదాపు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు, కేవలం ప్రమోషన్ల కోసమే సుమారు రూ.200 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు టాక్.


Click it and Unblock the Notifications











