twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియాంక చోప్రా మీద విషం: అత్తారింటి వారితో పాటు బాలీవుడ్ ప్రముఖుల మద్దతు!

    |

    అమెరికన్ మేగజైన్ 'ది కట్' వెబ్ సైట్లో ప్రియాంక చోప్రా మీద జాత్యహంకార విషం చిమ్ముతూ ఆమెకు వ్యతిరేకంగా ఒక ఆర్టికల్ ప్రచురితం అయిన సంగతి తెలిసిందే. ప్రియాంక అమెరికన్ సింగర్, నటుడు నిక్ జొనాస్‌ను పెళ్లాడిన నేపథ్యంలో వారి ప్రేమ బంధాన్ని శంకిస్తూ వారిది ఫేక్ రిలేషన్ అనే మీనింగ్ వచ్చేలా ఈ కథనం ప్రచురితమైంది. అంతే కాకుండా ప్రియాంక చోప్రాను 'గ్లోబల్ స్కామ్ ఆర్టిస్ట్' అని పేర్కొంటూ దారుణమైన వ్యాఖ్యలు చేసింది.

    మారియా స్మిత్ అనే రచయిత ప్రియాంక మీద విషం చిమ్ముతూ ఈ కథనం రాశారు. నిక్ జొనాస్ తనకు ఇస్టం లేకున్నా ప్రియాంకను పెళ్లాడారని, వీరిది మోసపూరితమైన అనుబంధం అనే ఆరోపణలు గుప్పించడంతో పాటు... వీరి రిలేషన్లో ప్రేమ కంటే... పెళ్లి ద్వారా వచ్చే స్టేటస్, డబ్బు సంపాదన మార్గాలపైనే ఎక్కువ ఆసక్తి ఉందనే విధంగా పిచ్చి రాతలు రాశారు.

    ప్రియాంక రియాక్షన్

    ప్రియాంక రియాక్షన్

    ఈ కథనంపై ప్రియాంక చోప్రా రియాక్ట్ అయ్యారు. ‘ఈ వార్తలను తాను అసలు పట్టించుకోను. దానిపై స్పందించాలని అనుకోవడం లేదు. వాటిని నా ఆవరణలోకి కూడా రానివ్వను. ప్రస్తుతం నేను సంతోషకరమైన మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నాను. నా సంతోషాన్ని ఇవి డిస్ట్రబ్ చేయలేవు' అని తెలిపారు.

    ప్రియాంక అత్తారింటి వారి నుంచి ఖండన

    ఆ కథనాన్ని ప్రియాంక చోప్రా బ్రదర్ -ఇన్- లా, నిక్ సొదరుడు జో జొనాస్ ఖండించారు. ‘ది కట్ కథనం చాలా అసహ్యంగా ఉంది. ఒక వ్యక్తి గురించి ఇలాంటి కథనం రాసినందుకు మ్యాగజైన్‌ సిగ్గుపడాలి. నిక్‌, ప్రియాంక నిజమైన ప్రేమికులు' అని జో జొనాస్‌ ట్వీట్ చేశారు.

    సోఫీ టర్నర్

    ప్రియాంక ఫ్రెండ్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ యాక్టర్ సోఫీ టర్న్ రియాక్ట్ అవుతూ.... ‘ది కట్' కథనం చాలా దారుణంగా ఉందని, అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు.

    సోనమ్ కపూర్ మద్దతు

    ‘మహిళల గురించి మంచి కథనాలు రాసే ‘ది కట్‌' మ్యాగజైన్‌ నుంచి ఇలాంటిది ఊహించలేదు. ప్రియాంక చోప్రాపై జాత్యహంకారంతో కూడిన కథనం ఇది. అందులోనూ ఓ ఓ మహిళ ఈ కథనం రాయడం బాధాకరం.' అని సోనమ్ కపూర్ పేర్కొన్నారు.

    క్షమాపణలు చెబుతూ కథనం తొలగింపు

    ప్రియాంక చోప్రా మీద విషం చిమ్ముతూ రాసిన కథనంపై సర్వాత్ర విమర్శలు రావడం, జాతి వివక్షను చూపే విధంగా ఉండటంతో వెంటనే క్షమాపణలు చెబుతూ ది కట్ మేగజైన్ దానని తన వెబ్ సైట్ నుంచి తొలగించింది.

    English summary
    A recent article in The Cut, has drawn widespread flak for its take on Priyanka Chopra and Nick Jonas' relationship. According to the report in Hindustan Times, Priyanka has responded to the article saying she did not want to react to such “random things”. She told the daily, “I don’t even want to react or comment. It’s not even in my stratosphere. I’m in a happy place at this moment. These kind of random things can’t disturb it.” Priyanka's brother-in-law Joe Jonas and Game of Thrones star, Sophie Turner condemned the article.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X