Priyanka Chopra బిడ్డకు నామకరణం చేసిన ప్రియాంక.. కూతురు పేరు ఏమిటో తెలుసా?

బాలీవుడ్ హీరోయిన్, గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ దంపతులు తొలి సంతానం తమ జీవితాల్లోకి రావడంతో ఆనందంలో మునిగితేలుతున్నారు. జనవరి 22వ తేదీన తమకు సంతానం కలిగిందని అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు సంతోషంతో శుభాకాంక్షలు అందించారు. ప్రియాంక చోప్రా, నిక్ ఇద్దరు సరోగసి ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడం తెలిసిందే. తమకు సంతానం కలుగడం ఆనందానికి గురిచేస్తున్నది. ఈ సమయంలో మమల్ని ఇబ్బంది పెట్టకండి.. మా స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలిగించకూడదని విన్నవించుకొన్నారు.

తన మాతృత్వపు అనుభూతులను వెల్లడిస్తూ ఇటీవల ప్రియాంక చోప్రా భావోద్వేగానికి లోనయ్యారు. తల్లిగా నా జీవితంలో సరికొత్త అనుభూతి కలుగుతున్నది. నా బిడ్డ పెంపకంపై ఎలాంటి ఆంక్షలు, భయాలను పెట్టను. నా పిల్లల భవిష్యత్తును నేనే తీర్చిదిద్దాలనే కఠిన నిర్ణయాలను మనసులో పెట్టుకోను. వారి జీవితాలను వారే తీర్చిదిద్దుకోవాలి. వారి జీవితాలపై మనం న్యాయనిర్ణేతలుగా మారొద్దు అని ప్రియాంక తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Priyanka Chopra revealed her Daughter name, Do you know her child name?

ఇక చాలా రోజులుగా ప్రియాంక, నిక్ జోనస్ దంపతుల తమ బిడ్డకు ఏం పేరు పెట్టారనే విషయంపై ఆసక్తికరమైన చర్చ అభిమానుల్లో జరిగింది. తాజాగా ప్రియాంక దంపతులు వెల్లడించిన ప్రకారం.. ప్రియాంక బిడ్డ పేరు మల్టీ మేరీ చోప్రా జోనస్. హాస్పిటల్‌ జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్ ప్రకారం ఈ విషయాన్ని అమెరికా మీడియా బయటకు వెల్లడించింది. మల్టీ అంటే సంస్కృతంలో సువాసనలు వెదజల్లే పువ్వు లేదా చంద్రకాంతి అని అర్థం. ఇక మేరి అనే పదం లాటిన్‌ భాష నుంచి వచ్చింది. లాటిన్‌లో మేరి అంటే.. సముద్ర నక్షత్రం. అలాగే బైబిల్ ప్రకారం.. జీసస్ తల్లి మేరి అని కూడా అర్థం.

ప్రియాంక చోప్రా కెరీర్ విషయానికి వస్తే.. ఆమె నటించిన ఆల్ కమింగ్ బ్యాక్ టు మీ అనే చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. జిమ్ స్ట్రౌస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో రస్సెల్ టోవీ, ఓమిడ్ డాజిలీ, సెలియా ఇమ్రై నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ అమెరికా, లండన్‌లో జరిగింది. అలాగే రుస్సో బ్రదర్స్ దర్శకత్వం వహిస్తున్న సిటాడెల్ చిత్రంలో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X