Priyanka Chopra: బాత్రూమ్‌లో కూర్చుని తినేదాన్ని.. అమెరికాలో చదువుపై ప్రియాంక చోప్రా కామెంట్స్

ఇప్పుడు స్టార్ హీరో హీరోయిన్లు అయినప్పటికీ ఒకానొక సమయంలో ఎవరూ పడని తీవ్ర ఇబ్బందులకు గురు అవుతుంటారు. జీవితం ఏ ఒక్కరికీ అంతా ఈజీగా ఉండదని వాళ్లు ఎదుర్కున్న పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మంచి స్టార్ డమ్ రేంజ్ ఎంజాయ్ చేస్తున్న ముద్దుగుమ్మలు గతంలో ఎదుర్కున్న సమస్యలను చెప్పుకొస్తున్నారు. తాజాగా తన జీవితంలో చాలా భయపడిన క్షణాలను గుర్తు చేసుకుంది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. ఆ వివరాల్లోకి వెళితే..

రామ్ చరణ్ తో: మోస్ట్ గ్లామరస్ బ్యూటి ప్రియాంక చోప్రా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ నటించిన క్రిష్ మూవీ సిరీస్ తో తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేరువైంది. తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన తుఫాన్ మూవీ ద్వారా మరింత దగ్గరైంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో మళ్లీ ఆమె తెలుగులో సినిమా చేయలేదు.

Priyanka Chopra

పద్మశ్రీతో సత్కారం : హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ రేంజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా రెండు జాతీయ అవార్డులు, ఐదు ఫిల్మ్ ఫేర్ బహుమతులతో సహా పలు సత్కరాలను అందుకుంది. అంతేకాకుండా 2016 సంవత్సరంలో ప్రియాంకను భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిభావంతమైన 100 మంది వ్యక్తుల్లో ప్రియాంక ఒకరిగా నిలిచింది.

Priyanka Chopra

తమిళ మూవీతో : ప్రస్తుతం హాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న ప్రియాంక చోప్రా 2002లో తమిజన్ అనే తమిళ చిత్రంతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. అనంతరం 2003లో ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై సినిమాతో హిందీలోకి అడుగు పెట్టింది. తర్వాత 2004లో ముజ్సే షాదీ కరోగి, ఐత్రాజ్ సినిమాలతో పాపులారిటీ దక్కించుకుంది. ఐత్రాజ్ లో అద్బుతమైన పాత్రతో హిందీ ఆడియెన్స్ ను ఫిదా చేసింది.

Priyanka Chopra

ఫ్యాషన్ చిత్రానికి : ఇక 2006లో క్రిష్, డాన్ వంటి ఫ్రాంచైజీ చిత్రాలతో అత్యధిక వసూళ్లు సాధించిన హీరోయిన్ గా నిలిచింది ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా. అనంతరం ఫ్యాషన్ మూవికి అనేక అవార్డ్స్ అందుకుంది. తర్వాత వరుసగా కమీనే, 7 ఖూన్ మాఫ్, బర్ఫీ, మేరీ కోమ్, బాజీరావ్ మస్తానీ వంటి చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం హాలీవుడ్ లో సినిమాలతో సత్తా చాటుతోంది ఈ బ్యూటి.

ఎవరూ చూడకుండా : ఇటీవల సిటాడెల్ వెబ్ సిరీసుతో ముందుకు వచ్చిన ప్రియాంక చోప్రా ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. హైస్కూల్ విద్య కోసం అమెరికాకు వెళ్లిన కొత్తలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. "క్యాంటీన్ కు వెళ్లి ఫుడ్ ఎలా తీసుకోవాలో నాకు అప్పట్లో తెలియదు. వెండింగ్ మిషన్ నుంచి స్నాక్స్ తీసుకుని ఎవరూ చూడకుండా బాత్రూమ్ లోకి వెళ్లి తినేదాన్ని" అని ప్రియాంక తెలిపింది.

Priyanka Chopra

ఎంతో మారాను..: "బాత్రూమ్ లో స్నాక్స్ తిన్న తర్వాత క్లాస్ రూమ్ కి వెళ్లిపోయేదాన్ని. అలా చాలా రోజులపాటు వేరే వాళ్లతో కలిసి తిరగలేదు. నాకున్న భయంతోనే నేను అలా ప్రవర్తించాల్సి వచ్చింది. సుమారు నాలుగు వారాలు అక్కడ ప్రతి విషయాన్ని గమనించాను. ఆ తర్వాత నాలో ధైర్యం పెరిగింది. స్కూల్ లో ఉన్న ఇతర పిల్లలతో ఫ్రెండ్ షిప్ కోసం నేను ఎంతో మారాను. స్నేహితులతో డేట్ కు వెళ్లడం, లేట్ నైట్ పార్టీలు ఇలాంటివి మా కుంటుంబంలో అనుమతించరని నా ఫ్రెండ్స్ కు అర్థమయ్యేలా చెప్పాను" అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X