హీరోయిన్లు ఎక్కువ సంపాదిస్తే.. హీరోలు కుళ్లుకుంటారు..ఇండస్ట్రీలో రెమ్యునరేషన్స్‌పై ప్రియాంక చోప్రా సెటైర్

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భారతీయ ప్రేక్షకులకు చేరువయ్యేందకు రెడీ అయ్యారు. కొద్ది సంవత్సరాలుగా ఆమె హాలీవుడ్‌కు పరిమితమైన సంగతి తెలిసిందే. ఆమె నటించిన సిటాడెల్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ప్రముఖ సినీ నిర్మాత, దర్శకులు రూసో బ్రదర్స్ రూపొందించిన సిరీస్‌కు సంబంధించిన టీజర్, ట్రైలర్లు భారీ అంచనాలు పెంచాయి. సిటాడెల్ ప్రమోషన్స్‌ను నిర్వహించేందుకు ప్రియాంక ఇండియాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక చోప్రా మీడియాతో మాట్లాడుతూ..

22 ఏళ్ల కెరీర్‌లో సిటాడెల్ : సినీ పరిశ్రమలో 22 ఏళ్ల సుదీర్ఘమైన కెరీర్‌లో సిటాడెల్ సిరీస్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. సిటాడెల్ నాకు మంచి అనుభూతులను పంచింది. హాలీవుడ్ హీరోకు రిచర్డ్ మ్యాడెన్‌కు సమానంగా నాకు రెమ్యునరేషన్ ఇచ్చారు. సినిమా పరిశ్రమలో హీరోయిన్లకు సమానంగా రెమ్యునరేషన్ ఇస్తే హీరోలు కుళ్లుకుంటారు. ఇండస్ట్రీలో ఆడవాళ్లు ఎక్కువ సంపాదిస్తే..మగవాళ్లకు అభద్రతా భావం ఉంటుంది అని ప్రియాంక చోప్రా ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

 Priyanka Chopra

అలాంటి మగాళ్లు తారసపడ్డారు : సినీ పరిశ్రమలో హీరోలలో అలాంటి అభద్రతభావం ఇంకా ఉంది. మగవాళ్ల బలహీనతల గురించి మాట్లాడటం తప్పే. అందుకు నేను సారీ చెబుతున్నాను. కానీ నా సక్సెస్ చూసి కుళ్లుకోని గొప్ప మగవాళ్లు కూడా నాకు తారసపడ్డారు. అలాగే నా సంపాదన చూసి అభద్రతాభావానికి గురైన హీరోలు, నటులను కూడా చూశాను. ఫ్యామిలీలో పెద్దగా, సంపాదనపరులుగా ఉండటాన్ని మగవాళ్లు గర్వంగా ఫీలవుతారు అని ప్రియాంక చోప్రా తెలిపారు.

మహిళలు ఎక్కువగా సంపాదిస్తే... : అయితే ఆడవాళ్లు భారీగా సంపాదిస్తే.. చాలా సక్సెస్ అయితే మగవాళ్లు భరించలేరు. ఒకవేళ మగవాడు ఇంటి వద్దే ఉండి.. మహిళలు బయటకు వెళ్లి సంపాదించిన వారికి కష్టమే. వాళ్లు ఆ విషయాన్ని చాలా తప్పుగా భావిస్తారు. అలాంటి ఫీలింగ్‌ను మార్చే శక్తి మహిళల్లోనే ఉంది. ఆడవాళ్ల సంపాదనను గౌరవించే జనరేషన్‌ రావడం ఆడవాళ్ల చేతిలోనే ఉంది అని ప్రియాంక చోప్రా అన్నారు.

 Priyanka Chopra

అభద్రతాభావం వదిలేయాలి అంటూ :కష్టాలు వస్తే ఆడవాళ్లే ఏడ్వాలి.. మగవాళ్లు ఏడువ కూడదనే విషయంపై ఉన్న అభిప్రాయాలను తొలగించాలి. అందుకు మన పిల్లలకు లింగ వివక్ష విషయంలో ఎడ్యుకేట్ చేయాలి. బాధకలిగితే మగవాళ్లు కూడా రోదించాలి. ఏడవడం అంటే సిగ్గుపడే విషయం కాదని మగవాడు తెలుసుకోవాలి. చెల్లెలు, తల్లి, భార్య, ప్రియురాలు ఎవరైనా సరే వారికి సుముచిత గౌరవం ఇవ్వాలి అని ప్రియాంక చోప్రా అభిప్రాయపడ్డారు.

 Priyanka Chopra

నాన్న కంటే అమ్మ ఎక్కువగా సంపాదన : మా ఇంటిలో మా నాన్న కంటే మా అమ్మ ఎక్కువగా సంపాదించేది. అయినా మా నాన్నలో ఎలాంటి అభ్యంతరాలు లేవు. మా అమ్మ సంపాదించేది ఇంటికే, పిల్లలకే ఉపయోగపడుతున్నదనే భావనలో ఉండేవారు. ఆయనకు ఎలాంటి ఇగో లేకుండా ఉండేది. ప్రస్తుతం నా భర్త కూడా అలానే ఉంటాడు. నేను రెడ్ కార్పెట్ మీద నడుస్తుంటే.. నా పక్కన ఉండి ప్రోత్సాహిస్తుంటాడు. నా భర్త తీరు చూసి నేను నిజంగా గర్వంగా ఫీలవుతాను అని ప్రియాంక చోప్రా తెలిపారు.

సిటాడెల్ రిలీజ్ ఎప్పుడంటే? : ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ సిరీస్ సైంటిఫిక్, ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. స్టాన్లీ టుసీ, రిచర్డ్ మ్యాడెన్ లాంటి హాలీవుడ్ తారలు నటించారు. ఆరు ఎపిసోడ్స్‌గా సాగే రెండు సీజన్ల సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఏప్రిల్ 28వ తేదీ నుంచి ఈ సిరీస్ ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X