twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియాంక చోప్రా బికినీ రచ్చ.. మామూలుగా లేదండీ బాబు!

    |

    గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అందాల గురించి వర్ణించాల్సిన పనే లేదు. నటనతో పాటు అందాన్ని కూడా అందరి ముందుంచి హాట్ హీరోయిన్‌గా వరల్డ్ క్రేజ్ సంపాదించింది ప్రియాంక. ఇటీవలే తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ని ప్రేమ వివాహం చేసుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత మరింత గ్లామర్ పెంచేసింది. దేశ, విదేశాల్లో ఏ వేడుక జరిగినా ప్రియాంక అందాలకే కెమెరాలు దాసోహం అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.

    ప్రస్తుతం భర్త, స్నేహితులతో కలిసి హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది ప్రియాంక చోప్రా. ఈ ట్రిప్ తాలూకు విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ వస్తున్న ప్రియాంక.. ఇటీవలే తన హాట్ బికినీ లుక్ ఒకటి పోస్ట్ చేసింది. రెడ్ కలర్ బికినీలో ప్రియాంక అందాలు అదరహారో అంటున్నాయి. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత నెల తన పుట్టినరోజు సందర్బంగా ట్రిప్ వేసిన ప్రియాంక ఇంకా ఆ వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది.

    Priyanka Chopras Bikini Pic Viral On Social Media

    ఈ నేపథ్యంలో భర్త నిక్ జోనాస్ తో దిగిన ప్రైవేట్ పిక్స్ సైతం పోస్ట్ చేస్తూ వస్తోంది ప్రియాంక. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు ఆమెపై ట్రోల్స్ చేస్తున్నా అవేమీ పట్టించుకోవడం లేదు. పెళ్లి తర్వాత భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అయిన ప్రియాంక ప్రస్తుతం 'ది స్కై ఈజ్‌ పింక్' అనే బాలీవుడ్‌ చిత్రంలో నటిస్తోంది. షొనాలీ బోస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఫర్హాన్‌ అక్తర్‌, జైరా వాసిం, రోహిత్‌ సరఫ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో పాటు పలు హాలీవుడ్ సినిమాలు సైతం చేస్తోంది ప్రియాంక చోప్రా.

    English summary
    Bollywood Priyanka Chopra maary's Nick Jonas last year. Now she was talk about netijan trollings of their marriage. Now Priyanka Chopra Bikini look viral on Social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X