కేన్స్ 2019: లేడీ డయానా లుక్‌లో మతి పోగొట్టిన ప్రియాంక

ఇండియన్ బ్యూటీ ప్రియాంక చోప్రా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ 2019లో సందడి చేస్తున్నారు. తన తొలి రెడ్ కార్పెట్ అప్పియరెన్స్ సందర్భంగా బ్లాక్ అండ్ రోజ్ గోల్డ్ గౌను ధరించిన ఈ దేశీ గర్ల్ చూపరుల మతి పోగొట్టింది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్సులో ఆమె వయ్యారంగా ఎరుపు తివాచీపై నడుచుకుంటూ వస్తుంటే అభిమానుల గుండెలు జారిపోయాయి.

తాజాగా ప్రియాంక 5బి అనే డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శనకు హాజరైన సందర్భంగా వైట్ కలర్ థీమ్‌తో తయారు చేసిన గౌనులో దర్శనమిచ్చారు. ప్రియాంక లుక్ చూసిన చాలా మంది ప్రిన్స్ లేడీ డయానాను గుర్తు చేసుకున్నారు. ప్రియాంక ధరించిన డ్రెస్ లేడీ డయానా డ్రెస్ పోలి ఉండటమే అందుకు కారణం.

Priyanka Chopras Cannes 2019 Look Inspired By Lady Diana

ప్రియాంక కోసం డ్రెస్ రూపొందించిన వారు లేడీ డయానా ధరించి రాయల్ గౌను స్పూర్తితో దీన్ని డిజైన్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను ప్రేమ వివాహం చేసుకున్న ప్రియాంక చోప్రా... హాలీవుడ్ సర్కిల్‌లో మరింత పాపులర్ అయ్యారు. ఇటీవలే మెట్ గాలా 2019 వేడుకలో భర్తతో కలిసి సందడి చేసిన ఈ భారతీయ అందం... తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేస్తోంది.

Priyanka Chopras Cannes 2019 Look Inspired By Lady Diana

ప్రస్తుతం ఆమె అమెరికా దేశపు కోడలు కావడంతో... భారతీయురాలిగా తన గుర్తింపును చాటుకుంటూనే అత్తింటివారి ప్రతిష్ట పెంచే విధంగా నడుచుకుంటున్నారు. ప్రియాంక గురించి యూఎస్ మేగజైన్స్ సైతం ప్రత్యేక కథనాలు ప్రచురించాయి.

ఆమె నటిస్తున్న సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆమె సోనాలి బోస్ తెరకెక్కిస్తున్న 'స్కై ఈజ్ పింక్' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్, జైరా వాసిమ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో సంజయ్ లీలా భన్సాలీ చిత్రంలో నటించే అవకాశం ఉందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X