twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Priyanka Chopra దీపావళీ సెలబ్రేషన్స్‌లో హంగామా.. లేడీ బాస్‌లతో కలిసి వైభవంగా పార్టీ

    |

    గ్లోబల్ ఐకాన్‌గా నిలిచిన బాలీవుడ్‌లో హీరోయిన్ ప్రియాంక చోప్రా దీపావళీ పండుగను ఘనంగా జరుపుకొన్నది. అమెరికాలోని లాస్ ఎంజెలెస్‌లోని తన స్నేహితులు, సన్నిహితులతో జరుపుకొన్న దీపావళీ వేడుకల్లో జోష్‌తో కనిపించింది. లాస్ ఎంజెలెస్‌లోని తన గ్యాంగ్ సభ్యులతో వైభవంగా దీపావళీని ఉత్సాహంగా, భక్తి శ్రద్దలతో జరుపుకొన్నారు. ఆ ఫోటోలను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేయగా వైరల్ అయ్యాయి.

    Priyanka Chopras Diwali celebrations photo goes viral on Social media

    లాస్ ఎంజెలెస్‌కు చెందిన నిర్మాత, దర్శకురాలు మిండీ కాలింగ్ దీపావళీ వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకల్లో ప్రియాంక స్నేహితులతోపాటు మిండీ సన్నిహితులు కూడా భాగమయ్యారు. భారీగా, వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో లిల్లీ సింగ్, పూర్ణ జగన్నాథన్, రిచా మూర్జానీ, మీనా హ్యారీస్ తదితరులు అయ్యారు.

    ప్రియాంక చోప్రాతో కలిసి జరుపుకొన్న వేడుకలకు సంబంధించిన ఫోటోలను మిండీ కూడా కాలింగ్ షేర్ చేసింది. గత రాత్రి నేను దీవాలీ పార్టీని నిర్వహించానని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. నా స్నేహితులందరూ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దశాబ్దం క్రితం నేను లాస్ ఎంజెలెస్‌లో నివాసం ఏర్పరుచుకోకపోతే ఈ వేడుక జరుపుకోవడానికి అవకాశం దక్కేది కాదు. వచ్చే ఏడాది ఇంతకంటే గొప్పగా దీపావళీ వేడుకలను జరుపుకొంటాను. ఈ ఏడాది వేడుకలకు సంబంధించిన ఫోటోలు ఇవే అంటూ మిండీ షేర్ చేశారు.

    Priyanka Chopras Diwali celebrations

    ఇక ప్రియాంక చోప్రా షేర్ చేసిన ఫోటో వైరల్ అయింది. దేశీ లేడీ బాస్‌లతో కలిసి దీపావళీ పండుగ వేడుకల్లో జరుపుకొన్నాను. ప్రేమ, వినోదాల మధ్య దేశీ లేడీ బాస్‌లతో ఉత్సాహంగా సాగింది. నా జీవితంలో గొప్ప అనుభూతి పొందిన దీపావళీ ఇదే అంటూ ప్రియాంక తన ఇన్స్‌టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నది.

    ప్రియాంక చోప్రా కెరీర్ విషయానికి వస్తే.. అవెంజర్‌ను రూపొదించిన జో, ఆంథోని రుస్పో నిర్మిస్తున్న సిటాడెల్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రిచర్డ్ మ్యాడెన్ హీరోగా నటిస్తున్నారు. త్వరలోనే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నది. అంతేకాకుండా టెక్ట్ ఫర్ యూ, ది మ్యాట్రిక్స్ రీసర్రెక్షన్స్, జీ లే జరా అనే చిత్రాల్లో నటిస్తున్నారు.

    English summary
    Priyanka Chopra's Diwali celebrations photo goes viral on Social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X