ప్రియాంక చోప్రా మామగారు దివాళా తీశాడంట!
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ నటుడు నిక్ జోనస్ నిశ్చితార్థం ఇటీవలే జరిగిన సంగతి తెలిసిందే. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ చాలా కాలం నుంచి రిలేషన్ లో ఉన్నారు. వీరిద్దరి ప్రేమ గురించి మీడియాలు వరుస కథనాలు వచ్చాయి. ఇప్పటికే నిశ్చితార్థం పూర్తి చేసుకున ఈ జంట త్వరలో వివాహంతో ఒక్కటి కాబోతోంది.
నిక్ జోనస్ తండ్రి గురించి గురించి వస్తున్న వార్త ఆసక్తికరంగా మారింది. నిక్ జోనస్ తండ్రి పౌల్ జోనస్ కు న్యూ జెర్సీ అనే కంపెనీ ఉంది. ఆ సంస్థ సుమారు 7 కోట్ల అప్పులో కురుకునిపోయి దివాళా తీసే స్థితిలో ఉందట. ఈ సంస్థకు చెందిన ఆస్తులని అమ్మకానికి పెట్టి కోర్టులో దివాళా పిటిషన్ వేయాలని పౌల్ జోనస్ భావిస్తున్నారు.

పౌల్ జోనస్ కి చెందిన న్యూ జెర్సీ కంపెనీ దివాళా తీసినంత మాత్రాన వారి కుటుంబం కష్టాల్లో ఉందని అనుకుంటే పొరపాటే. పౌల్ జోనస్ కు ఉన్న ఆస్తితో పోల్చుకుంటే ఆ కంపెనీ రవ్వంత మాత్రమే. పౌల్ జోనస్ కు దాదాపు 200 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. నిక్ జోనస్ పేరిట 170 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. ఈ పాటికే అర్థం అయి ఉంటుంది నిక్ జోనస్ కుటుంబం ఎంతటి కుబేరులో అని.


Click it and Unblock the Notifications











