Priyanka Chopra బోల్డ్ లుక్‌తో అదరగొట్టిన ప్రియాంక చోప్రా.. 40 ఏళ్ల వయసులో మత్తెక్కించే అందాలతో

ప్రియాంకా చోప్రా.. దక్షిణాది సినిమాలతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి, బాలీవుడ్ లో మంచి సక్సెస్ అందుకుని ఇప్పుడు హాలీవుడ్ లో సత్తా చాటుతోంది. తనకంటే పదేళ్ళు చిన్నవాడైన పాప్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్ళి చేసుకుని అమెరికాలోనే సెటిల్ అయ్యింది ప్రియాంక. వరుసగా హాలీవుడ్ టీవీ సిరీస్ లు, సినిమాల్లోనే కనిపిస్తున్న ప్రియాంక, తాజాగా BVLGARI హోటల్ ప్రారంభోత్సవంలో తళుక్కున మెరిసింది. ఇటీవల ఆమె ఇటలీలో జరిగిన ర్యాంప్ షోలో చేసిన హంగామా వివరాల్లోకి వెళితే..

ఇటలీ దేశంలోని రోమ్ నగరంలో BVLGARI హోటల్ ప్రారంభోత్సవంలో వైట్ గౌనులో మెరిసిపోతూ, హాలీవుడ్ సింగర్ జెండయా ఇంకా ఇతర బ్రాండ్ మెంబర్లతో రెడ్ కార్పెట్ మీద నడిచింది. తెల్లటి డ్రెస్ కి మ్యాచ్ అయ్యే నెక్ లైన్ ధరించి హాటుగా, ఘాటుగా కనిపించింది. జుట్టుకు రెండు పోనీటెయిల్స్ వేసుకుని, వైట్ కలర్ హై హీల్స్ లో అందానికే అందంలా కనిపించింది. తెల్లని డ్రెస్ లో తళుక్కుమంటున్న ప్రియాంకా చోప్రా ఫోటోలు, తన ఫ్యాన్ పేజీల ద్వారా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Priyanka Chopra’s Stunning photoshoot in the white thigh-high slit gown photos goes viral

ప్రియాంకా అందానికి ముగ్ధులైన నెటిజన్లు, ఆమెను ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. నాలుగు పదుల వయసులో తళతళా మెరిసిపోతున్న ప్రియాంకా చోప్రా, రోజురోజుకూ తన వయసును తగ్గించుకుంటోందని, కుర్రకారును కిర్రెక్కించేలా మత్తెక్కిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. ప్రియాంకా చోప్రాతో పాటు రెడ్ కార్పెట్ మీద నడిచిన జెండయా, బ్లాక్ అండ్ బ్లాక్ లో సింపుల్ గా అందంగా కనిపించింది.

ప్రొఫెషనల్ గా చూసుకుంటే, ఇటీవల ప్రియాంకా చోప్రా నటించిన సిటాడెల్ సిరీస్ అమెజాన్ లో రిలీజ్ అయ్యింది. రిచర్డ్ మ్యాడెన్ హీరోగా కనిపించిన ఈ సిరీస్ ను హాలీవుడ్ దర్శకులు రుస్సో బ్రదర్స్ తెరకెక్కించారు. సిటాడెల్ సిరీస్ కోసం టాప్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ప్రియాంకా చోప్రా వెల్లడి చేసింది. సిటాడెల్ సిరీస్ ఇండియన్ వెర్షన్ బాలీవుడ్ దర్శకులు రాజ్ అండ్ డీకే హిందీలో తెరకెక్కిస్తున్నారు. ఈ వెర్షన్‌లో సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Priyanka Chopra’s Stunning photoshoot in the white thigh-high slit gown photos goes viral

ఇదిలాఉంటే, గతకొన్ని రోజులుగా బాలీవుడ్ కు ప్రియాంకా చోప్రా దూరమైంది. బాలీవుడ్‌లో తనకు అవకాశాలు రానివ్వకుండా కొందరు ట్రై చేశారని ఇటీవల ఆమె వ్యాఖ్యానించింది. ప్రస్తుతం చాలా రోజుల తర్వాత జీలే జరా అనే సినిమాతో బాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ఆలియా భట్, కత్రినా కైఫ్ నటిస్తున్నారు. దాదాపు రెండేళ్ళ క్రితం మొదలైన ఈ సినిమా, అనేక కారణాల వల్ల ఆగిపోయింది. షూటింగ్ ముగించుకుని ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X