Don't Miss!
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్‌బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- News జగన్ Vs పవన్, సమర్ధతకు పరీక్ష - దక్కేదెవరికి..!!
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
బంతి లాంటి డ్రెస్సుపై మీమ్స్.. ప్రియాంక చోప్రా షాకింగ్ రియాక్షన్.. విరాట్ కోహ్లీని కూడా వదల్లేదు!
సోషల్ మీడియాలలో ఈ రోజులలో వచ్చే మీమ్స్ కు ఏ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సెలబ్రెటీలు ఏ మాత్రం అతి చేసినా కూడా ఒక రేంజ్ లో ట్రోలింగ్ చేయడం కామన్ గా మారింది. అయితే ట్రోలింగ్ కు మీమ్స్ కు చిన్నపాటి డిఫరెంట్ ఉందనే చెప్పాలి. మీమ్స్ చాలా వరకు సరదాగా నవ్వుకునే విధంగా ఉంటాయి. ట్రోలింగ్స్ మాత్రం ఎంతో అసహనానికి గురి చేస్తాయి. ఇక ప్రియాంకా చోప్రా కూడా ఆమెపై వచ్చిన మీమ్స్ ను చాలా సరదాగా తీసుకుంది.
అభిమానుల కోసం...
మాజీ మిస్ వరల్డ్ అయిన ప్రియాంకా చోప్రా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కు రెగ్యులర్ గా టచ్ లో ఉంటుంది. పెళ్లి చేసుకున్న తరువాత మకాం అమెరికాకి మార్చేసినప్పటికి ఇండియన్ ఫ్యాన్డ్ ను మాత్రం ఆమె నిరాశపరచాలని అనుకోవడం లేదు. అందుకే ఎదో ఒక విషయంపై స్పందిస్తూనే ఉంటుంది. గ్లామరస్ ఫొటోలు కూడా నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి.
కలలో కూడా ఊహించని విధంగా
ప్రియాంక చోప్రా ఫొటో షూట్స్ చాలా వరకు డిఫరెంట్ ఉంటాయి. వరల్డ్ వైడ్ బెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ ను ఆమె ఫాలో అవుతూనే ఉంటారు. ప్రియాంక ఎలాంటి కాస్ట్యూమ్ వేసినా కూడా అది నిమిషాల్లో వైరల్ అవ్వడం కామన్. కలలో కూడా ఊహించని డ్రెస్సులతో ఆమె ఒక్కోసారి షాక్ ఇస్తుంటుంది.
వైరల్ అయిన మీమ్స్
ఇక ఈ సారి ప్రియాంక బంతి ఆకారంలో ఉన్న గుండ్రటి ఒక డ్రెస్ లో ఫోటోలకు స్టిల్ ఇచ్చింది. ప్రపంచంలో ఎవరు ట్రై చేయని విధంగా ఆమె ట్రై చేయడంతో ఆ ఫొటోలు నిమిషాల్లోనే వైరల్ అయ్యాయి. ఇక మీమర్స్ కు పని దొరకడంతో అనేక రకాల ఫొటోలు సైరల్ అయ్యాయి. ఇక ఆ మీమ్స్ ను చాలా సింపుల్ గా తీసుకున్న ప్రియాంక సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది.
స్పెషల్ గా కృతజ్ఞతలు చెప్పిన ప్రియాంక
మీమ్స్ లో ఆటో హారన్ నుంచి.. పోకే మాన్ వరకు అన్ని రకాల మీమ్స్ తో హడావుడి చేసేశారు. ఇక ఆఖరికి విరాట్ కోహ్లీ కూడా క్రికెట్ బాల్ క్యాచ్ పడుతున్నట్లు ఉన్న ఫొటోలో ప్రియాంక డ్రెస్ ను జత చేశారు. ఈ మీమ్స్ పై ప్రియాంక చాలలా పాజిటివ్ గా స్పంధించడమే కాకుండా అలా చేసిన వారికి ప్రియాంక ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పడం విశేషం.