ఆ డైరెక్టర్ నన్ను అండర్ వేర్ చూడాలన్నాడు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Casting couch: కాస్టింగ్ కౌచ్ .. గత కొన్ని సంవత్సరాలుగా చిత్ర సీమను కాస్టింగ్ కౌచ్ భూతంలా పట్టిపీడిస్తోంది. ఎంతోమంది నటీమణులు లైంగిక వేధింపుల బారినపడి.. ఇండస్ట్రీకి దూరమయ్యారు. మరికొందరు ఆ వేధింపులను భరిస్తూ ఇండస్ట్రీలో రాణించారు. అయితే గత కొన్నాళ్లుగా నటీమణులు తమకు జరిగిన చేదు అనుభవాలను బహిరంగంగా మాట్లాడడం ప్రారంభించారు. మీటూ ఉద్యమం తర్వాత సినిమా ఇండస్ట్రీలోని పలు చీకటి వ్యవహారాలు బట్టబయలయ్యాయి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ సైతం తాను కాస్టింగ్ కౌచ్ అనే పేరు భూతాన్ని ఎదుర్కొన్న అంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే?
ఆ హీరోయిన్ ఎవరో కాదు.. బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా.. ఈ అందాల తార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ చిత్రసీమ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రియాంక వరుస విజయాలు అందుకుంటూ బాలీవుడ్ అడుగుపెట్టింది. అక్కడ కూడా ఎన్నో బ్లాక్ చిత్రాల్లో నటించి, మెప్పించింది. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించకుంది. తన నటన, డ్యాన్స్‌తో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. అతితక్కువ సమయంలోనే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని స్టార్ డమ్ సంపాదించుకుంది.

ప్రస్తుతం ప్రియాంక చోప్రా హాలీవుడ్(Hollywood)లో వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. గ్లోబల్ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇక హాలీవుడ్ స్టార్ నిక్ జోనస్(Nick Jonas) ప్రేమించి పెళ్లి చేసుకుంది. నిన్న మొన్నటివరకు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ నేషనల్ స్టార్ గా ఉన్న అమ్మడు .. ఇప్పుడు హాలీవుడ్ భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఇంటర్నేషనల్ స్టార్ గా మారింది. ఇటీవలే సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కబోతున్న మూవీలో ప్రధాన పాత్రలో నటిస్తోంది.
ఇలా బాలీవుడ్, హాలీవుడ్ బిజీబిజీగా మారిన ప్రియాంక చోప్రా బాలీవుడ్ డైరెక్టర్ పై సంచలన ఆరోపణలు చేస్తుంది. తాను కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభావాలను, ఇబ్బందికర పరిస్థితులు బయటపెట్టింది. బాలీవుడ్, హాలీవుడ్ బిజీబిజీగా మారిన ప్రియాంక చోప్రా బాలీవుడ్ డైరెక్టర్ పై సంచలన ఆరోపణలు చేస్తుంది. ఓఇంటర్వ్యూలో తాను కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభావాలను, ఇబ్బందికర పరిస్థితులు బయటపెట్టింది ప్రియాంక చోప్రా. తనకు 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక దర్శకుడు తనతో ఎలా అసభ్యకరంగా వ్యవహరించాడో వివరించింది.

'నా వయసు కేవలం 19 సంవత్సరాలు. నేను ఒక దర్శకుడితో సినిమా గురించి మాట్లాడటానికి వెళ్ళాను. నా స్టైలిస్ట్ తో మాట్లాడతావా అని అన్నాను? నీకు ఏమి కావాలో అతనికి చెబుతావా?' నేను అక్కడ నిలబడి ఉన్నానని అన్నాడు. నేను సరే అనడంతో ఆ దర్శకుడు అసిస్టెంట్ పిలిచి.. 'వినండి, ప్రియాంక మీ ప్యాంటీని చూపిస్తే.. ఈ సినిమాలో నిన్ను చూడటానికి చాలా మంది ఆడియన్స్ వస్తారు. ఆ ప్యాంటీ చాలా పొట్టిగా ఉండాలి. ప్యాంటీ చూడాలి. ఆయన ఈ మాటను ఒకసారి కాదు రెండు సార్లు కాదు.. నాలుగు సార్లు రీపిట్ చేశారు' అంటూ ఎమోషనల్ అయింది ప్రియాంక.
నటి ప్రియాంక చోప్రా ఇంకా మాట్లాడుతూ 'ఇంటికి తిరిగి వెళ్ళగానే ఆ విషయం నా తల్లికి చెప్పాను. "అమ్మా, ఆ డైరెక్టర్ నా గురించి ఇలా ఆలోచిస్తే నేను అతని ముఖం చూడలేను" అన్నాను. ఆ డైరెక్టర్ నా గురించి అంత సంకుచితంగా ఆలోచిస్తే.. నీచంగా ఆలోచిస్తే.. నేను ముందుకు సాగడానికి అవకాశం లేదు' అని అన్నాను. ఈ ఘటన తరువాత ఆ సినిమాను వదిలేశానని, ఆ దర్శకుడితో ఎప్పుడూ పని చేయనని ప్రియాంక చోప్రా పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











