Don't Miss!
- Sports ఆ రూల్ మా కొంపముంచింది- రుతురాజ్
- News మే 1 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బ్రా కూడా లేకుండా రెచ్చిపోయిన ప్రియాంక చోప్రా: అందాలు మొత్తం కనిపించేలా మరీ దారుణంగా!
భారతీయ సినీ చరిత్రలో ఎంతో మంది గొప్ప గొప్ప నటీమణులు తమ అందంతో పాటు అభినయంతో సత్తా చాటారు. తద్వారా చాలా కాలం పాటు దేశ వ్యాప్తంగా హవాను చూపించారు. అయితే, ఇందులో ఒకరిద్దరు మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును అందుకున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఒకరు. సాదాసీదాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అనతి కాలంలోనే అదిరిపోయే రీతిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. అదే సమయంలో స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది. ఇక, నిక్ జోనస్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఈ అమ్మడి రేంజ్ మరింతగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రియాంక చోప్రా బ్లాలెస్ ఫోజులతో కనిపించి షాకిచ్చింది. ఇంకెందుకు ఆలస్యం? ఆమె షేర్ చేసిన హాట్ ఫొటోపై మీరూ ఓ లుక్కేయండి మరి!
అందంతో ప్రపంచాన్నే గెలిచిన ప్రియాంక
చదువుకుంటోన్న రోజుల్లోనే అంటే చాలా చిన్న వయసులోనే పలువురు ప్రముఖుల సలహా మేరకు మోడల్‌గా తన కెరీర్‌ను ఆరంభించింది ప్రియాంక చోప్రా. ఈ క్రమంలోనే అప్పట్లోనే ఎన్నో అందాల పోటీల్లో పాల్గొని దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది. అలా తన అందచందాలతో ఇక్కడ గుర్తింపును దక్కించుకున్న ఈ బ్యూటీ.. 2000లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. తద్వారా ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకుంది. దీంతో ఈ అమ్మడు చిన్న వయసులోనే ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది. ఫలితంగా భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగుర వేసింది.
Mukku Avinash Engagement: నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చిన అవినాష్.. ఆ అమ్మాయి ఎవరంటే!
వరుస ఆఫర్లు.. అలా ఎంట్రీ ఇచ్చేసింది
ప్రపంచ సుందరిగా ఎంపికైన తర్వాత ప్రియాంక చోప్రా ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. దీంతో ఆమెకు ఇండియాలోని అన్ని ఇండస్ట్రీల నుంచి వరుసగా సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 2002లో 'తమీజాన్' అనే తమిళ చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే బాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా దాదాపు ఇరవై ఏళ్లుగా తన హవాను చూపిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో అవార్డులు సైతం అందుకుందీ బ్యూటీ. అలా దేశంలోని దాదాపు అన్ని ఇండస్ట్రీల్లోనూ నటించి ఇండియన్ స్టార్ హీరోయిన్గా మారింది.
హాలీవుడ్ ఎంట్రీ.. ప్రేమలో పడిన భామ
సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో దేశ వ్యాప్తంగా ఎన్నో భాషల్లో నటించి తన స్టామినాను చూపించిన ప్రియాంక చోప్రా.. ఇదే క్రమంలో హాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. కొన్నేళ్ల క్రితమే అక్కడ అడుగు పెట్టిన ఈ భామ.. పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని ఆంగ్ల చిత్రాల్లోనూ నటించింది. అలాగే, ప్రైవేట్ ఆల్బమ్‌లను కూడా చేసింది. తద్వారా మరోసారి అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకుంది. హాలీవుడ్లో బిజీ బిజీగా ఉన్న సమయంలోనే ప్రియాంక చోప్రా.. తన కంటే వయసులో చిన్నోడు అయిన అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌తో ప్రేమలో పడిందామె.
తెలుగు నటి హరి తేజ పర్సనల్ ఫొటోలు: తల్లైనా తర్వాత బోల్డుగా కనిపించిన భామ
వయసులో చిన్నోడితో డేటింగ్.. పెళ్లితో
ప్రియాంక చోప్రా.. నిక్ జోనస్‌తో డేటింగ్ చేస్తున్న సమయంలోనే చాలా సార్లు విదేశీ మీడియా కెమెరాలకు చిక్కింది. పబ్లిక్‌లోనే ముద్దులు పెట్టుకోవడం.. హగ్స్ చేసుకోవడం.. చెట్టాపట్టాలేసుకుని తిరగడం వంటివి చేయడంతో ఈ అమ్మడు అప్పట్లో అక్కడ ఫేమస్ అయింది. చాలా రోజుల పాటు అతడితో ప్రేమాయణం సాగించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఇండియాలో వివాహం చేసుకుంది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చారు. వివాహం తర్వాత ప్రియాంక చోప్రా ఎక్కువగా లండన్‌లోనే ఉంటోంది.
అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా ఉంటూ
అప్పట్లో చేతి నిండా సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్నా.. ఇప్పుడు అవకాశాలు లేక ఖాళీగా ఉన్నా హాట్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే ఉంటోంది. ఈ కారణంగానే ప్రియాంక చోప్రాను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ భారీ స్థాయిలో పెరిగిపోతోంది.
ఎప్పుడూ అలాంటివే వదులతోన్న నటి
మిగిలిన హీరోయిన్లతో పోలీస్తే ప్రియాంక చోప్రా మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోదన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో ఎక్కువ శాతం అందాలు ఆరబోస్తూ దిగిన పిక్స్ ఉంటాయి. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన ఫొటోలను కూడా ప్రియాంక చోప్రా షేర్ చేస్తుంటుంది. తద్వారా ఈ బ్యూటీ ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని పెంచుకుంటూనే ఉంది. ఆమె షేర్ చేసిన వాటన్నింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా దక్కుతూ ఉంటుంది. దీంతో తరచూ వార్తల్లో నిలుస్తూ ప్రియాంక హాట్ టాపిక్ అవుతోంది.
అరాచకంగా
నైనా
గంగూలీ
అందాల
ఆరబోత:
రాంగోపాల్
వర్మ
హీరోయిన్
అంటే
ఈ
మాత్రం
చూపించాల్లే!
Recommended Video
బ్రాలెస్ ఫొటోతో రెచ్చిపోయిన ప్రియాంక
తాజాగా ప్రియాంక చోప్రా 'వోగ్ ఇండియా' సంస్థ మ్యాగజైన్ కోసం కవర్ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇందులో ఈ అమ్మడు చాలా ఫోజుల్లో కనిపించింది. అయితే, ఒక దాంట్లో మాత్రం ఈ బ్యూటీ.. టాప్ బటన్స్ తీసేసి దర్శనమిచ్చింది. దీంతో ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. ఇక, ఇందులో ప్రియాంక చోప్రా లోదుస్తులు కూడా వేసుకోకపోవడంతో అందాలు మొత్తం కనిపిస్తున్నాయి. తద్వారా ఆమె కుర్రకారు గుండెళ్లో గాయాలు చేసేలా రచ్చ చేస్తోంది. ఈ ఫొటోకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా దీనికి లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తున్నాయి.