ప్రియాంకకు ఏమైంది? పబ్లిక్ ప్లేస్‌లో భర్తతో కలిసి పాడుపని.. వీడియో పోస్ట్ చేసిన నెటిజన్
ప్రియాంక చోప్రా.. ఈ పేరు ఎవరికీ పరిచయం చేయనవసరం లేదు. అంతలా ఆమె భారతీయులపై ప్రభావం చూపించింది. ఎన్నో భాషల్లో సినిమాలు చేసి ఇండియాలోనే టాప్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. ఇదే క్రమంలో హాలీవుడ్‌లోకీ అడుగు పెట్టింది. అక్కడ కొన్ని సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో నటించి మెప్పించింది. అదే సమయంలో అక్కడ నిక్ జోనస్ అనే ఓ సింగర్ నచ్చడంతో అతడితో డేటింగ్ చేసేసింది. ఆ తర్వాత అతడినే పెళ్లి చేసుకుంది. ఇక్కడ షూటింగ్ లేని సమయంలో ఇప్పుడు భర్తతో పాటు అమెరికాలో ఉంటోంది.
హాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన తర్వాత ప్రియాంక ప్రవర్తనలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆమె అక్కడి కల్చర్‌కు బాగా అలవాటు పడిపోయింది. ఇక పెళ్లి తర్వాత ఇది మరింత ఎక్కువైంది. గతంలో పబ్లిక్‌లో భర్తను లిప్ లాక్ ఇవ్వడం వంటివి చేసింది. ఇది అక్కడ సర్వసాధారణమే అయినా.. మన దేశంలో కాదు కాబట్టి ప్రియాంకను నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు. అయినా, ఆమె ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. తాజాగా మరోసారి ప్రియాంక బుక్కైపోయింది.

జులై 18న ప్రియాంక.. భర్త నిక్ జోనస్‌తో కలిసి పుట్టిన రోజు సంబరాలను ఘనంగా జరుపుకుంది. అప్పుడు ఆమె అమెరికాలోని మయామి ప్రాంతంలోని ఒక ప్రైవేటు బోటులో ప్రయాణించింది. ఆ సమయంలో ఆమె భర్త మరికొందరితో కలిసి సిగరెట్ కాలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమెపై నెటిజన్లు విరుచుకు పడుతున్నారు. ఈ పోస్టుకు కామెంట్లు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు, గతంలో ప్రియాంక 'దీపావళిని దీపాలతో జరుపుకోవాలి కానీ.. పటాసులు కాల్చి కాలుష్యానికి కారణం కావద్దు' అంటూ నీతులు చెప్పిన వీడియోను పోస్ట్ చేస్తున్నారు. అలాగే, 'అల్ ఈజ్ వెల్.. సిగరెట్ ఈజ్ హార్మ్‌ఫుల్.. యాక్' అంటూ చేసిన పోస్టును కూడా నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. ఈ ఫొటోపై భారీ స్థాయిలో వ్యతిరేకత వస్తుండడంతో ప్రియాంక చోప్రా సదరు పోస్టును తొలగించింది.


Click it and Unblock the Notifications











